33 వేల బుకింగ్స్.. దేశంలో హాట్ టాపిక్‌గా మారుతి కారు.. షోరూమ్‌కు జనాలు క్యూ కట్టారు!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) SUV చివరికి సెప్టెంబర్ 16న విడుదలైంది. ఈ కారు రూపకల్పన నుంచి ఫీచర్ల వరకు ప్రతి అంశం ప్రజల్లో విశేష ఆసక్తిని రేకెత్తించింది. ఫ్రంట్ గ్రిల్ నుంచి టెయిల్ ల్యాంప్ వరకు ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫినిషింగ్, అలాగే ఆధునిక టెక్నాలజీతో నిండి ఉన్న క్యాబిన్.. ఇవన్నీ ఈ SUVని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. అదనంగా, మారుతి సుజుకి దీన్ని పోటీ ధరలో మార్కెట్లోకి తీసుకురావడంతో, వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విక్టోరిస్ ప్రారంభం తర్వాత మార్కెట్లో దాని హవా ఏ రేంజ్‌లో ఉందంటే, కేవలం రెండు నెలల్లోనే ఈ SUV 33,000 పైగా బుకింగ్‌లను సాధించింది.
కంపెనీ సెప్టెంబర్ 3 నుండి ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించగా, తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో బుకింగ్‌లు రావడం మారుతికి మరొక మైలురాయిగా మారింది. ప్రత్యేకంగా ఈ మోడల్‌లో అందించిన వేరియంట్లు, పెట్రోల్, CNG రెండింటికీ భారీ డిమాండ్ ఉంది. సాధారణంగా కొత్త SUVలు లాంచ్ అయినప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంటుంది. కానీ విక్టోరిస్ విషయంలో మాత్రం CNG మోడల్‌కి కూడా సమానమైన డిమాండ్ వచ్చింది.

ఇప్పటివరకు మొత్తం 11,000 CNG వేరియంట్లు బుక్ చేయబడ్డాయి. అంటే ప్రతి మూడు విక్టోరిస్ SUVలలో ఒకటి CNG మోడల్‌గా ఉంటుంది. ఈ ట్రెండ్ చూస్తే, భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం పవర్‌ఫుల్ ఇంజిన్‌గానే కాకుండా, మైలేజ్ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. మారుతి కూడా ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకుని, విక్టోరిస్‌లో రెండు విభిన్న ఆప్షన్లు అందించడం ద్వారా మార్కెట్లో సమతుల్య స్థానం సంపాదించింది.
మారుతి సుజుకి విక్టోరిస్ SUV గురించి వివరంగా మాట్లాడితే, ఇది కేవలం లుక్ మాత్రమే కాదు, పనితీరు, టెక్నాలజీ, ఫీచర్ల పరంగా కూడా పూర్తి స్థాయి ప్యాకేజ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ SUV ధరలు రూ. 10.50 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. అంటే, వివిధ అవసరాలు, బడ్జెట్‌లను దృష్టిలో ఉంచుకుని మారుతి 6 వేరియంట్లలో ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంజిన్ విషయానికి వస్తే, విక్టోరిస్‌లో 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్(పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్ ఉంది. దీని వల్ల వినియోగదారులు తమ అవసరానికి సరిపోయే వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. మైల్డ్ హైబ్రిడ్ మోడల్ ఎక్కువగా డ్రైవింగ్ కంఫర్ట్, పనితీరును ప్రాధాన్యత ఇచ్చే వారికి అనుకూలం కాగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని కోరుకునే వారికి ప్రత్యేక ఆకర్షణ.
ఇక పర్యావరణహిత డ్రైవింగ్‌కి ఆసక్తి ఉన్నవారికి CNG ఆప్షన్ సరైన ఎంపికగా నిలుస్తోంది. ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో కూడా మారుతి విభిన్నతను అందించింది, ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వస్తుంది. వీటిలో e-CVT వెర్షన్ ప్రత్యేకంగా హైబ్రిడ్ మోడల్‌లకు అనుకూలంగా రూపుదిద్దుకుంది. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే, విక్టోరిస్ తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజ్ రేంజ్‌ను అందిస్తుంది.

డ్రైవింగ్ కండిషన్లను బట్టి ఇది 21 నుండి 29 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది, ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇంటీరియర్ విషయానికి వస్తే, 5 సీట్ల సీటింగ్ అరేంజ్‌మెంట్ ప్రయాణికులకు విస్తారమైన స్థలం, కంఫర్ట్‌ను అందిస్తుంది. 373 లీటర్ల బూట్ స్పేస్ వల్ల ఎక్కువ లగేజీని సులభంగా ఉంచుకోవచ్చు, దీని వలన ఇది కుటుంబ ట్రిప్‌లకు కూడా అనువైన SUVగా మారింది.


Click it and Unblock the Notifications








