రిలీజ్ అయి నెల కూడా కాలేదు..అప్పుడే డిమాండ్ తట్టుకోలేక మారుతి కొత్త ఎస్యూవీ ధరలు పెంచేశారు
ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇటీవల ప్రకంపనలు సృష్టించిన మోడల్‌లలో ఒకటి మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris). అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్న ఈ ఎస్‌యూవీ రిలీజ్ అయిన అతి తక్కువ రోజుల్లోనే 25,000 బుకింగ్‌లను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి నెలలోనే 4,261 యూనిట్ల డెలివరీతో మారుతికి విజయాన్ని అందించింది.
అయితే, విక్టోరిస్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి మారుతి కంపెనీ షాకిచ్చింది. మార్కెట్లోకి వచ్చి ఒక నెల కూడా కాకముందే మారుతి సుజుకి ఈ ఎస్‌యూవీ ధరను పెంచింది. ఏ వేరియంట్ల ధర పెరిగింది, ఎంత పెరిగింది, మిగిలిన ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

| వేరియంట్ | పాత ధర(రూ.ల్లో) | పెరిగింది(రూ.ల్లో) | కొత్త ధర(రూ.ల్లో) |
| LXI (1.5L పెట్రోల్-మాన్యువల్) | 10,49,900 | - | 10,49,900 |
| VXI (1.5L పెట్రోల్-మాన్యువల్) | 11,79,900 | - | 11,79,900 |
| ZXI (1.5L పెట్రోల్-మాన్యువల్) | 13,56,900 | 15,400 | 13,72,300 |
| ZXI Plus (1.5L పెట్రోల్-మాన్యువల్) | 15,23,900 | 15,400 | 15,39,300 |
| ZXI (1.5L CNG-మాన్యువల్) | 14,56,900 | 15,400 | 14,72,300 |
| ZXI (1.5L స్ట్రాంగ్ హైబ్రిడ్-CVT) | 17,79,900 | 15,400 | 17,95,300 |
మారుతి సుజుకి విక్టోరిస్ కొన్ని వేరియంట్లపై కంపెనీ రూ.15,400 వరకు ధరను పెంచింది. ఇది వెహికల్ ప్రారంభ ధరలో సుమారు 1.13% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెంపునకు గల ప్రధాన కారణం మార్కెట్‌లో ముఖ్యంగా మీడియం రేంజ్ ZXI వేరియంట్‌కు ఉన్న ఊహించని డిమాండ్‌గా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, సామాన్య కస్టమర్‌లకు, బడ్జెట్ కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తూ, LXI, VXI వంటి ఎంట్రీ-లెవల్ వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడం విశేషం.

ఈ వ్యూహం ద్వారా కంపెనీ బేస్ వేరియంట్ల ద్వారా ఎక్కువ మంది కొత్త కస్టమర్‌లను ఆకర్షించాలని, అధిక డిమాండ్ ఉన్న టాప్ వేరియంట్లపై లాభాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ధరల పెరుగుదల తరువాత ఆయా వేరియంట్ల కొత్త ధరలు (ఎక్స్-షోరూమ్) క్రింది విధంగా ఉన్నాయి.
ధర పెంచినప్పటికీ, మారుతి సుజుకి కొన్ని వేరియంట్ల నుండి ఒక ముఖ్యమైన ఫీచర్‌ను తొలగించింది. మారుతి సుజుకి ZXI, ZXI (O) వేరియంట్ల నుండి లెదరెట్ అప్‌హోల్స్టరీ ఫీచర్‌ను తొలగించింది. ముఖ్యంగా ZXI వేరియంట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ ఉండటం వల్లే ఈ ధర పెంపు, ఫీచర్లలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. టాప్ హైబ్రిడ్ వేరియంట్‌ల ధరపై మాత్రం ఈ పెంపు ప్రభావం చూపలేదు.

1.5 లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ మోడల్ 89 బీహెచ్‌పీ పవర్‌ను అందిస్తూ, కిలోకు 27.02 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, ఈ-సీవీటీ (స్ట్రాంగ్ హైబ్రిడ్ కోసం) ఆప్షన్లలో ఈ ఎస్‌యూవీ లభిస్తుంది.
విక్టోరిస్ దాని ఫీచర్ల, సేఫ్టీ విషయంలో కూడా మెరుగైన స్థానంలో ఉంది. ఇందులో లెదరెట్ సీట్లు (ప్రస్తుతం కొన్నింటిలో తొలగించారు), వెంటిలేటెడ్ సీట్లు, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, రియర్ ఏసీ వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
విక్టోరిస్ భారత్ NCAP (Bharat NCAP), గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








