క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్.. ప్రమాదంలో మీ ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ ఇచ్చే కారు! 29 కి.మీ మైలేజ్
భారత మార్కెట్లో కార్ల భద్రతపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మారుతి సుజుకి కార్ల విషయంలో, ఇవి స్టైల్, మైలేజ్, ప్రాక్టికల్ యూజ్ విషయంలో ముందుంటాయి కానీ సేఫ్టీ విషయంలో మాత్రం వెనుకబడి ఉంటాయి అని చాలా మంది వినియోగదారులు ఆరోపిస్తూ వచ్చారు. ఇదే సమయంలో, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు మాత్రం సేఫ్టీపై దృష్టి పెట్టి 5-స్టార్ రేటింగ్ పొందిన మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో, మారుతి సుజుకి తాజాగా తీసుకొచ్చిన విక్టోరిస్ ఎస్‌యూవీ (victoris suv) అంచనాలను తలకిందులు చేసింది. ఈ కారు మొదట భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లోనే 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది.
ఇప్పుడు గ్లోబల్ NCAP నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సేఫ్టీ పరీక్షల్లో కూడా అదే స్థాయి ప్రదర్శన చేసి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది మారుతి సుజుకి బ్రాండ్‌కు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సరికొత్త విక్టోరిస్ SUVను గ్లోబల్ NCAP పలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కఠినంగా పరీక్షించింది. ముఖ్యంగా వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 34 పాయింట్లలో 33.72 స్కోర్ సాధించింది.

పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లలో 44.1 స్కోర్ చేసింది. ఈ ఫలితాలు స్పష్టంగా ఒక విషయాన్ని రుజువు చేశాయి, విక్టోరిస్ SUV ప్రయాణికులకు అత్యున్నత భద్రతను అందించే వాహనం అని. ఇది మారుతి సుజుకి కోసం గేమ్ ఛేంజర్ అనిపించుకునే ఘటనగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు మారుతి వాహనాలు సేఫ్టీ విషయంలో వెనుకబడ్డాయి అనే మాటలకు ముగింపు పలికినట్లయింది.
చాలామంది మారుతి కార్ల సేఫ్టీపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ విక్టోరిస్ SUV మాత్రం అన్ని విభాగాల్లోనూ అసాధారణ ప్రదర్శన చేసి అందరి నోరూరించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో ఈ SUV 16 పాయింట్లలో 15.66 స్కోర్ సాధించింది. అంటే, ముందుభాగం నుంచి బలమైన ఢీకొనుగోలులో కూడా కారు లోపలి ప్రయాణికులపై ప్రభావం తక్కువగానే ఉండేలా దీన్ని రూపొందించారు.

అంతేకాకుండా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో విక్టోరిస్ SUV పూర్తి 16లో 16 పాయింట్లు సాధించడం గమనార్హం. ఇది సైడ్ నుంచి ఢీకొన్నా కూడా కారు బలమైన రక్షణను అందిస్తుందని రుజువైంది. ఇందులోని డైనమిక్ టెస్ట్‌లో పూర్తి 24/24 పాయింట్లు, అలాగే చైల్డ్ రెస్ట్రైన్ట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌లో 12/12 పాయింట్లు రావడం నిజంగా ఈ SUV భద్రతా ప్రమాణాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
గ్లోబల్ NCAPలో మారుతి సుజుకి డిజైర్ తర్వాత ఫైవ్-స్టార్ రేటింగ్ సాధించిన రెండవ మోడల్ విక్టోరిస్. వినియోగదారులు, ఇప్పుడు అదే కంపెనీ నుంచి వచ్చిన మరో కారు అంతర్జాతీయ సేఫ్టీ టెస్ట్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.విక్టోరిస్ SUV కూడా అదే జాబితాలో చేరడంతో, మారుతి సుజుకి ఇకపై మైలేజ్ కింగ్ మాత్రమే కాదు, సేఫ్టీ లీడర్ గానూ గుర్తింపు పొందే అవకాశం ఉంది.

విక్టోరిస్ SUV భద్రతా ఫీచర్ల పరంగా కూడా అత్యాధునిక సాంకేతికతను అందిస్తుంది. ఇది అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS)తో వచ్చిన మొట్టమొదటి SUV కావడం ప్రత్యేకత. ఈ ఫీచర్ వల్ల డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత పెరుగుతుంది. ప్రామాణికంగా అందించే 6 ఎయిర్‌బ్యాగులు అన్ని వేరియంట్లలో ప్రయాణికుల రక్షణకు భరోసా ఇస్తాయి. అదేవిధంగా, EBDతో కూడిన ABS అత్యవసర పరిస్థితుల్లో వాహనం స్లిప్ కాకుండా నియంత్రణలో ఉంచుతుంది.
ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు కఠిన రోడ్ల పరిస్థితుల్లో కూడా డ్రైవర్‌కు నమ్మకాన్ని ఇస్తాయి. అదనంగా, హిల్ హోల్డ్ కంట్రోల్ ఎత్తైన ప్రదేశాల్లో వాహనం వెనక్కి జారకుండా కాపాడుతుంది. కుటుంబాలతో ప్రయాణించే వారికి అత్యంత అవసరమైన ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు కూడా విక్టోరిస్‌లో ప్రామాణికంగానే అందించడం గమనార్హం. ఈ ఫీచర్లన్నీ కలిపి, విక్టోరిస్ SUV భద్రత విషయంలోనూ అత్యుత్తమంగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








