రోజుకు 1,000 మంది బుక్ చేస్తున్న కారు.. 5 స్టార్ సేఫ్టీ, 29 కి.మీల మైలేజ్, రూ.10.50 లక్షల ధర..

మారుతి సుజుకి కొత్త విక్టోరిస్ ఎస్‌యూవీ (Maruti Suzuki Victoris Suv) సోమవారం అధికారంగా లాంచ్ అయింది. ఈ కారు కోసం చాలా కాలంగా ఆటో ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ విటారా తర్వాత మారుతి సుజుకి విక్రయించే ప్యాసింజర్ వాహన విభాగంలో విక్టోరిస్ రెండవ మిడ్-సైజ్ SUV. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను కంపెనీ సెప్టెంబర్ 3 నుండి ప్రారంభించబడింది. వినియోగదారులు కేవలం రూ.11,000 ముందస్తు చెల్లింపుతో తమ ఆర్డర్‌ను ఖరారు చేసుకోవచ్చు. తాజాగా ప్రైవేట్ మీడియా నివేదికల ప్రకారం, ప్రతి రోజూ సగటున సుమారు 1,000 బుకింగ్‌లు ఈ కొత్త SUV కోసం వస్తున్నాయి. దీనిపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ఆకట్టుకునే డిజైన్, పనితీరు అన్నీ కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుండటం కారణంగా చాలా మంది దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇటీవల ఈ కారు ధర వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, విక్టోరిస్ SUV ప్రారంభ ధర కంపెనీ ఎక్స్-షోరూమ్ వద్ద రూ.10.50 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ధర, ఫీచర్ల కలయికతో, ఇది తన సెగ్మెంట్‌లో వినియోగదారులకు పోటీగా నిలుస్తుంది. అలాగే విలువైన ఆప్షన్‌గా మారనుంది. అధికారికంగా SUV విక్రయాలు సెప్టెంబర్ 22, 2025 నుండి ప్రారంభం కానున్నప్పటికీ, ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్‌ల కారణంగా ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Maruti Suzuki Victoris Suv Receiving 1000 Bookings Everyday More Details

విభిన్న వేరియంట్లలో విక్టోరిస్ SUV వినియోగదారులకు ఎన్నో ఆప్షన్లను అందిస్తోంది. మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్లపై దృష్టి సారిస్తే, ఎంట్రీ లెవెల్‌గా 1.5 MT LXi వేరియంట్ రూ.10.50 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టాప్-ఎండ్ మోడళ్లలో 1.5 e-CVT ZXi+ వేరియంట్ రూ.19.47 లక్షలకు, అలాగే ZXi+(O) వేరియంట్ రూ.19.99 లక్షలకు లభిస్తుంది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.

మారుతి విక్టోరిస్ SUV ధరల జాబితా చూస్తే, ప్రతి వినియోగదారుడికి అనుగుణంగా, మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్, CNG లేదా ఆల్-గ్రిప్ డ్రైవ్ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. మొత్తానికి, కొత్త SUV తన శ్రేణి లో వినియోగదారులకు సరిపడే ధరలతో, పటిష్టమైన ఫీచర్లతో, విస్తృత వేరియంట్ ఆప్షన్లతో, మార్కెట్‌లో మంచి రేప్యుటేషన్, హై ఇంటరెస్ట్‌ను సృష్టిస్తోంది. ముఖ్యంగా దీని సేఫ్టీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

Maruti Suzuki Victoris Suv Receiving 1000 Bookings Everyday More Details

విక్టోరిస్ SUV మారుతి సుజుకి చరిత్రలోనే అత్యంత సురక్షితమైన మోడల్‌గా గుర్తింపు పొందింది. గ్లోబల్ NCAP, భారత్ NCAP పరీక్షల్లో ఈ SUV పూర్తి 5-స్టార్ రేటింగ్ సాధించడం ప్రత్యేకమైన విషయం. గతంలో మారుతి మోడళ్లపై వచ్చిన సేఫ్టీ సంబంధ విమర్శలకు ఇది గట్టి సమాధానంగా నిలుస్తోంది. రహదారిపై ప్రయాణించే ప్రతి కుటుంబానికి, డ్రైవర్‌కు, ప్రయాణికుడికి నమ్మకాన్ని పెంచే రీతిలో ఈ SUV రూపొందించబడింది.

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్),EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా విక్టోరిస్ SUV దుమ్మురేపేలా ఉంటుంది. మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Maruti Suzuki Victoris Suv Receiving 1000 Bookings Everyday More Details

మొదటిది 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, రెండోది 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), మూడోది 1.5-లీటర్ CNG ఇంజిన్. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, వేరియంట్లపై 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేయిర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మైలేజీ పరంగా, వేరియంట్ ఆధారంగా ఈ SUV 19 kmpl నుండి 28.65 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2025, 7:15 [IST]
English summary
Maruti suzuki victoris suv receiving 1000 bookings everyday more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+