ఈ కారుకు పెట్రోల్ అవసరం లేదు.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు తీసుకొస్తున్న మారుతి.. మార్కెట్లో సునామీ ఖాయం

భారత మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ బ్రాండ్లు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. అయితే, దేశంలో నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సొంతంగా ఒక ఈవీని అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. దీని లాంచ్ కూడా వాయిదా పడుతోంది. భారతీయ కస్టమర్లను, దేశ ప్రభుత్వ విధానాలను బాగా అర్థం చేసుకున్నందున లేటయినా లేటెస్టుగా రావాలనే ఆలోచనలో మారుతి సుజుకి ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకాలకు అనుగుణంగా ఒక కారును కంపెనీ సీక్రెటుగా డెవలప్ చేస్తోంది. ఇప్పుడు మనం ఆ రహస్య ఆయుధం గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Maruti Suzuki Wagon R Flex Fuel) మోడల్ గురించి మాట్లాడుకుందాం. దేశంలో ప్రస్తుతం E20 ఇంధనాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాగన్ ఆర్ 20% (E20) నుండి 85% (E85) వరకు ఇథనాల్-పెట్రోల్ మిశ్రమంపై పనిచేస్తుంది.

Maruti Suzuki Wagon R Flex Fuel Specs Features and Future Plans

2030 నాటికి దేశంలో 30% ఇథనాల్ కలిపిన E30 పెట్రోల్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. E30 తప్పనిసరి అయినప్పటికీ ఈ వాహనం ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తుంది. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పనితీరులో రాజీ పడకుండా, 79% పర్యావరణ అనుకూలమైన వాహనం అని మారుతి సుజుకి చెబుతోంది. దీన్ని సాధించడానికి, వాగన్ ఆర్‌లో చాలా మార్పులు చేశారు.

ఇందులో ఇథనాల్ సెన్సార్లు చల్లని వాతావరణంలో స్టార్టింగ్ మెరుగుపరచడానికి హీటెడ్ ఫ్యూయల్ రైల్స్, అప్‌డేటెడ్ ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, మరింత పటిష్టమైన ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లు ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో కూడా కారు సమర్థవంతంగా, సమస్యలు లేకుండా పనిచేసేలా చూస్తాయి.

Maruti Suzuki Wagon R Flex Fuel Specs Features and Future Plans

వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌కు శక్తినిచ్చేది 1.2-లీటర్, ఫోర్-సిలిండర్ ఇంజిన్. ఇది 88.5 బీహెచ్‌పీ పవర్, 113ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇందులో స్టాండర్డ్‌గా వస్తుంది. 2024 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను ప్రజల ముందు మొదటిసారి ప్రదర్శించారు.

ఇథనాల్, పెట్రోల్‌ను ఇంధనంగా ఉపయోగించడం ద్వారా టెయిల్ పైప్ ఎమిషన్లను గణనీయంగా తగ్గించడానికి ఈ వాహనం రూపొందించబడిందని మారుతి సుజుకి తెలిపింది. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లుక్ స్టాండర్డ్ వాగన్ ఆర్ లాగే ఉంటుంది. అయితే, ఫ్లెక్స్-ఫ్యూయల్ స్టిక్కర్లు దీనిని భిన్నంగా చూపిస్తాయి. వాహనం ఇంటీరియర్‌లో, ఫ్లోరసెంట్ డెక్కలేషన్స్ దీనికి స్పెషల్ లుక్ ఇస్తాయి.

Maruti Suzuki Wagon R Flex Fuel Specs Features and Future Plans

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం భారతదేశంలోని రద్దీ నగరాలలో, ఇతర ప్రాంతాలలో పర్యావరణ అనుకూలమైన డ్రైవింగ్‌కు ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ఈ పవర్‌ట్రైన్ మారుతి సుజుకి ఇతర మోడల్స్‌లో కూడా ఉపయోగించవచ్చు, కాబట్టి ఈ ఇంజిన్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను ఇతర మారుతి సుజుకి మోడల్స్‌లో చూసినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

దేశంలో ఈవీల విప్లవం ఆశించినంత వేగంగా జరగని పరిస్థితులలో, ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి ప్రత్యామ్నాయాల అవకాశాన్ని మారుతి వంటి కంపెనీలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాయని భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, August 31, 2025, 16:03 [IST]
English summary
Maruti suzuki wagon r flex fuel specs features and future plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+