డాక్టర్లు, ఇంజనీర్ల ఫేవరెట్ కారు.. రూ.5.79 లక్షలు, 34 కి.మీ మైలేజ్.. సేల్స్‌లో దుమ్ములేపుతుంది
సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి మొదలుకొని, కొత్త డ్రైవర్లు, డేలీ ప్రయాణాలు చేసే వేరే వర్గాల అవసరాలను తీర్చగలిగిన వాహనంగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)కు ఒక గొప్ప పేరుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అనేది భారతీయ కార్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మోడల్. మొదటిసారిగా 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ హ్యాచ్‌బ్యాక్, అప్పటి నుంచి మారుతి బ్రాండ్‌కి ఓ నమ్మకమైన గుర్తింపుగా నిలిచింది. సరళమైన స్టైలింగ్ ఉన్నప్పటికీ, ఈ కారులో అవసరమైన అన్ని లేటెస్ట్ ఫీచర్లను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. మారుతి సుజుకి కూడా ఈ కారుకి కొత్త తరం టచ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ కొత్త ఇంజిన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్-టోన్ కలర్స్ వంటి ఎలిమెంట్లను అందిస్తూ వచ్చింది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అమ్మకాల్లో తన సత్తాను చూపిస్తుంది. తాజాగా విడుదలైన గణంకాల ప్రకారం, జూలై 2025లో 14,710 యూనిట్లను అమ్ముతూ, ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో 4వ స్థానాన్ని దక్కించుకుంది. జాబితాలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి ఎర్టిగా కార్లు ఉన్నాయి. దీనికి ముందు జూన్‌లో 12,930 యూనిట్లు సేల్ అయ్యాయి.

వినియోగదారుల నిత్యావసరాలకు అద్దం పడే డిజైన్‌తో, రోజువారీ ప్రయాణాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే కారుగా వ్యాగన్ ఆర్ ఇప్పటికీ బిజీ యూసర్‌లు, చిన్న కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. బ్రాండ్‌కు వచ్చిన బలమైన గుర్తింపుతో కొత్త కార్లు వరుసగా మార్కెట్లోకి వస్తున్నా, వ్యాగన్ ఆర్‌ను ఏదీ తప్పించలేకపోతోంది. అందుకే, 25 ఏళ్ల తరువాత కూడా ఇది పరుగులు తీయడమే కాదు, పోటీలో ముందు ఉంటుంది.
అదే సమయంలో, హ్యాచ్‌బ్యాక్ కార్ల కేటగిరీలో జూలై 2025లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ అద్భుతమైన అమ్మకాలకు ప్రధాన కారణాల్లో ముందుగా చెప్పుకోవాల్సాంది దాని ధర. మధ్యతరగతి కుటుంబాలకు మించనిది అన్నట్టుగా, వ్యాగన్ ఆర్ ధరలు చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 5.79 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 7.50 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).

దీంతో పాటు, వినియోగదారులకు అందుబాటులో ఉన్న పెట్రోల్, CNG వేరియంట్లు, టచ్‌స్క్రీన్, AMT గేర్‌బాక్స్ వంటి ఆధునిక ఫీచర్లు వ్యాగన్ ఆర్ ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేంత విస్తారమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. కుటుంబ ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక. భద్రత పరంగా చూసుకుంటే, ప్రతి వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా అందించబడుతున్నాయి, ఇది వ్యాగన్ ఆర్‌ని మరింత విశ్వసనీయంగా మారుస్తోంది.
ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో Wagon R CNG వేరియంట్ ఎంతో మందికి డబ్బులు సేవ్ చేస్తుంది. CNG వేరియంట్‌లో గరిష్టంగా 33.47 కి.మీ/కేజీ మైలేజ్ లభిస్తుంది. చాలా మంది వ్యాగన్ ఆర్ యజమానులు రియల్-టైమ్‌లో ఈ మైలేజ్‌కి దగ్గరగానే పొందుతున్నామని వెల్లడిస్తున్నారు. అన్నీ కలిపి ఇది కలిపి సంపూర్ణ కుటుంబ కారుగా కొనసాగుతోంది. 25 ఏళ్ల తరువాత కూడా, నెలనెలా సేల్స్ చార్ట్‌లో దూసుకుపోతుంది వ్యాగన్ ఆర్.



Click it and Unblock the Notifications








