దేశంలో ఏ కారును ఎక్కువ మంది కొంటున్నారో తెలుసా..? లేట్ చేయకుండా మీరు త్వరగా బుక్ చేసుకోండి
ప్రపంచదేశాల కంటే భారత్‌లోనే కార్ల వినియోగం భారీగా పెరుగుతుంది. ఒకప్పుడు ఇంటికి ఒక టూవీలర్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంటికి ఒక కారు కచ్చితంగా కనిపిస్తుంది. ప్రజలు తమ రోజువారి అవసరాలకు టూవీలర్స్‌తో పాటు కార్లను కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే కార్లు అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు అనుగుణంగా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నారు. ప్రతి నెల కూడా కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 జనవరి నెలలో ఇండియాలో మొత్తం 4 లక్షలకు పైగా కార్లు అమ్ముడుపోయాయి. ఇది గత ఏడాది (2024) జనవరితో పోలిస్తే మరింత ఎక్కువ. దీన్ని బట్టి దేశీయంగా కార్ల మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతుంది.
2025 జనవరిలో నెలలో మొత్తం కార్ల విక్రయాల్లో ఎక్కువగా టాప్ కంపెనీలకు చెందిన మోడళ్లను కస్టమర్లు అధికంగా ఎంచుకున్నారు. గణంకాల ప్రకారం, టాప్ 10 కార్లను ఒకసారి చూసినట్లయితే వాటిలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన మోడళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ఇతర కంపెనీలకు చెందిన కార్స్ ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ కార్లను సమీక్ష నెలలో ఎక్కువ మంది కొనుగోలు చేశారు.

గత ఏడాది జనవరిలో కూడా మారుతీ సుజుకీ కార్లు టాప్-10 కార్ల లిస్ట్‌లో అగ్రగామిగా ఉన్నాయి. 2025 జనవరిలో ఈ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు కూడా చోటు దక్కించుకున్నాయి. ఆ తరువాత టాటా మోటార్స్ నుంచి 2, హ్యుందాయ్ 1, మహీంద్రా 1 కారు ఉన్నాయి. దేశంలో సమీక్ష నెలలో అత్యధికంగా వ్యాగన్ఆర్ (Wagonr) 24,078 యూనిట్లతో ఎక్కువగా అమ్ముడుపోయింది. అదే 2024 జనవరిలో 17,756 కార్లు అమ్ముడుపోయాయి.
మొత్తంగా వ్యాగన్ఆర్ కార్లను గత ఏడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో 6,322 ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఈ నెలలో భారతదేశంలో అత్యధిక విక్రయాలను జరిపిన కారుగా వ్యాగన్ఆర్ నిలిచింది. ఆ తరువాత, రెండవ స్థానంలో మారుతీ సుజుకీ బాలెనో (Baleno) ఉంది. ఈ కారును 2025 జనవరి నెలలో మొత్తం 19,965 మంది కొనుగోలు చేశారు. అదే 2024 జనవరిలో 19,630 మంది కొన్నారు.

ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సంఖ్య దాదాపు సమానంగా ఉంది. దీని తరువాత హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా (Creta) మూడో స్థానంలో ఉంది. క్రెటా కారు జనవరిలో దాదాపు 18,522 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ మోడల్‌కు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక, నాలుగో స్థానం విషయానికి వస్తే, మారుతీ సుజుకీకి చెందిన స్విఫ్ట్ (Swift) 17,081 యూనిట్ల అమ్మకాలతో ఈ ప్లేస్‌లో నిలిచింది.
దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ (Punch) జనవరిలో 16,231 కార్లను విక్రయించి 6వ స్థానం పొందింది. తరువాత మారుతీకి చెందిన గ్రాండ్ విటారా (Grand Vitara) 15,784 యూనిట్ల అమ్మకాలతో 7వ స్థానంలో నిలవగా, మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) 15,442 యూనిట్ల అమ్మకాలతో 8వ స్థానంలో, తరువాత టాటా నెక్సాన్ (15,397), మారుతీ డిజైర్ (15,383), మారుతీ ఫ్రాంచైజ్ (15,192) కార్లు ఉన్నాయి.

2025 జనవరి నెల అమ్మకాలను చూసినట్లయితే మారుతీ సుజుకీ కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయని తెలుస్తుంది. సాధారణంగా ఈ కంపెనీ నుంచి వచ్చే మోడళ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అలాగే ఇతర కంపెనీలు హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీలు కూడా అమ్మకాలతో దూసుకుపోతున్నాయి.


Click it and Unblock the Notifications








