చిన్న కుటుంబానికి బెస్ట్ కారు.. రూ.5 లక్షలకే 34 కి.మీ మైలేజ్.. దేశంలో భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది!
మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ భారతీయ కుటుంబాలందరిలోనూ మంచి గుర్తింపు సంపాదించిన ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. సాధారణ వాడకానికి సరిపడే మైలేజ్, తక్కువ ధర మొదలగు అంశాలతో ఇది దేశంలో పేద, మధ్య తరగతి వారికి బాగా నచ్చిన మోడల్‌గా స్థిరపడింది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, జూన్ నెలలో దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో వ్యాగన్ఆర్ మరోసారి తన సత్తా చూపించింది. ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచిన ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 12,930 యూనిట్లను అమ్మేసింది. ఇది కేవలం ఒక నెలలోనే సాధించిన గణనీయమైన విజయంగా చెప్పాలి. ప్రస్తుతం 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు వ్యాగన్ఆర్ అమ్మకాల ప్రగతిని పరిశీలిస్తే దాని స్థిరమైన డిమాండ్ స్పష్టమవుతుంది.
నెల వారీగా అమ్మకాలను చూసినట్లయితే జనవరిలో ఏకంగా 24,078 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో 19,879, మార్చిలో 17,175, ఏప్రిల్‌లో 13,413, మే నెలలో 13,949 యూనిట్లతో మంచి జోరును కొనసాగించింది. ఈ సంఖ్యలన్నీ వినియోగదారుల ఆదరణ, బలమైన బ్రాండ్ నమ్మకం, అలాగే మారుతీ సుజుకీ అందించే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్‌కి ప్రతిబింబం. జూన్ 2025 లో జరిగిన అమ్మకాలను చూస్తే, దీని డమాండ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.

ఈ నెలలో మొత్తం అమ్మకాల్లో ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ ఆరు వ స్థానాన్ని సంపాదించం సాధారణ విషయం కాదు. అయితే, మొదటి ఐదు స్థానాల్లో వేరే కార్లు మెరుగైన అమ్మకాలతో దూసుకుపోయాయి. జాబితాలో అగ్రస్థానం హ్యుందాయ్ క్రెటా సొంతం చేసుకుంది, ఇది 15,786 యూనిట్లతో అత్యధిక అమ్మకాలను సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మారుతి డిజైర్ 15,484 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.
మారుతీ బ్రెజ్జా 14,507 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని 14,151 యూనిట్లతో మారుతీ ఎర్టిగా ఆక్రమించగా, ఐదో స్థానంలో 13,275 యూనిట్ల విక్రయాలతో మారుతీ స్విఫ్ట్ నిలిచింది. ఇలా, ప్రతీ నెల కొత్త రికార్డులు సృష్టిస్తూ, మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ తన స్థిరమైన సేల్స్‌తో కంపెనీకి ప్రధాన బలంగా నిలుస్తూనే ఉంది. పైన పేర్కొన్న వాటి పక్కన నిలవగల సామర్థ్యం వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉందని చెప్పవచ్చు.

భారత మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న వ్యాగన్ఆర్ కేవలం పేరు మీదే ఒక హ్యాచ్‌బ్యాక్ కాదు, మధ్యతరగతి వినియోగదారుల కలలను నెరవేర్చిన ప్రతీక. ప్రస్తుతం ఈ కారు రూ.5.54 లక్షల నుండి రూ.7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధరతో లభిస్తోంది. ఫీచర్లను బట్టి LXI, VXI, ZXI వేరియంట్లలో అమ్మకానికి ఉంది, వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకునే వెసులుబాటు కలిగింది.
కొత్త వ్యాగన్ఆర్ మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికను అందిస్తోంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సీఎన్‌జీ వేరియంట్ కూడా ఉంది. సిటీ డ్రైవ్‌లో తేలికగా, పొడవైన రోడ్లపైన కూడా రన్ అవుతూ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లను అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 23 కి.మీ.ల నుంచి 25 కి.మీ.ల వరకు, సీఎన్‌జీ వేరియంట్ అయితే 34 కి.మీ. వరకు మైలేజీ అందిస్తుంది.

ప్రయాణికుల రక్షణకు అత్యాధునిక సేఫ్టీ అందిస్తూ, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విశ్వసనీయతకు ఉదాహరణ అవుతోంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉంటాయి, ప్రమాద సమయంలో అధిక స్థాయి రక్షణను అందించడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాక, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) లాంటి బ్రేకింగ్ సాంకేతికతలు, కారు నియంత్రణను మరింత స్థిరంగా ఉంచుతాయి.
వెనుక పార్కింగ్ సెన్సార్లు కారును పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకునేలా సహాయపడతాయి. సీట్ బెల్ట్ హెచ్చరిక, ఓవర్‌స్పీడ్ అలర్ట్ లాంటి ఫీచర్లు డ్రైవర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయి. చిన్నారుల భద్రత కోసం చైల్డ్ లాక్ ఏర్పాటుతో పాటు, సడెన్ ఎంచైన్లపై వాహనం వెనక్కి జారకుండా చూసుకునే హిల్ హోల్డ్ అసిస్టు కూడా అందుబాటులో ఉంది. ఇంకా పలు అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








