నెలకు రూ.9 వేలతో.. 34 కి.మీ మైలేజ్ కారు.. ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్, నెలవారీ EMI వివరాలు

భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, ఎక్కువ కాలం పాటు ప్రజల మనసుల్లో నిలిచిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) పేరు ముందువరుసలో ఉంటుంది. ఇది కేవలం ఒక కారు కాదు, కోట్లాది భారతీయ కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమైపోయిన వాహనం. వాడుకలో సులభం, మైలేజ్, మారుతి సుజుకి నాణ్యత కలయిక ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతుంది. ధర పరంగా వ్యాగన్ఆర్ అత్యంత పోటీగా ఉంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల మధ్య లభిస్తోంది. ఈ ధర పరిధిలో మైలేజ్, ఫీచర్లు అందించే కారు మార్కెట్లో చాలా అరుదు. కొత్తగా ఈ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి దీని EMI ఇతర ధర వివరాలు ఈ కథనంలో అందించడం జరిగింది.

ముందుగా LXI (పెట్రోల్) వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. 6.05 లక్షలు. మీరు ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 4.05 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే, మీ నెలవారీ EMI సుమారు రూ. 8,400 వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఇది సరైన ఎంపిక.

Maruti Suzuki Wagonr Hatchback On Road Price And Monthly Emi Details In Telugu

తర్వాత VXI(పెట్రోల్) వేరియంట్ అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ సేలింగ్ మోడల్. దీని ఆన్-రోడ్ ధర రూ. 6.72 లక్షలు. మీరు అదే విధంగా రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ. 4.72 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలపాటు ఈ రుణానికి నెలవారీ EMI సుమారు రూ. 9,800 వరకు ఉంటుంది. ఫీచర్లు, పనితీరు పరంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

అంతేకాకుండా, ZXI(పెట్రోల్) వేరియంట్ కూడా మరింత ప్రీమియం ఫీచర్లతో లభిస్తోంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7.23 లక్షలు. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసిన తరువాత, రుణ మొత్తం రూ. 5.23 లక్షలు అవుతుంది. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలపాటు EMI సుమారు రూ. 10,800 వరకు ఉంటుంది. ఇది స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టైలిష్ ఇంటీరియర్‌లు, అదనపు సేఫ్టీ ఫీచర్లతో ప్రత్యేకంగా ఉంటుంది.

Maruti Suzuki Wagonr Hatchback On Road Price And Monthly Emi Details In Telugu

ఇక CNG వేరియంట్లలో LXI CNG ఆన్-రోడ్ ధర సుమారు రూ. 7.15 లక్షలు. మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, రూ. 5.14 లక్షల వరకు రుణం పొందవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలపాటు EMI సుమారు రూ. 10,600 వరకు ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ వేరియంట్ తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఆర్థిక పరిష్కారం.

మరోవైపు, VXI CNG వేరియంట్ మరింత ఫీచర్లు, సౌకర్యాలను అందిస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 7.76 లక్షలు. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసిన తరువాత, రూ. 5.76 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలపాటు EMI సుమారు రూ. 11,800 వరకు ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అత్యంత ఆర్థికంగా మరియు పర్యావరణహితంగా ఉంటుంది.

Maruti Suzuki Wagonr Hatchback On Road Price And Monthly Emi Details In Telugu

కొత్త వ్యాగన్ఆర్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ పెట్రోల్+CNG ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 23 నుండి 34 kmpl మైలేజీని అందిస్తుంది, ఇది ఏ ఇతర బైక్‌తోనూ సాటిలేనిది.

More from DriveSpark

Article Published On: Thursday, October 30, 2025, 14:56 [IST]
English summary
Maruti suzuki wagonr hatchback on road price and monthly emi details in telugu
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+