33.47 కి.మీల మైలేజ్.. రూ.5.64 లక్షల ధర! ఇంజనీర్లు, డాక్టర్లు ఎక్కువ కొనే కారు.. ఇండియాలోనే నెంబర్ 1
భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా అందుబాటు ధరలో, మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా గత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన విక్రయాల డేటాను వెల్లడించింది. కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బెస్ట్ సెల్లింగ్ కార్ టైటిల్‌ను మారుతీ మరోసారి తన సొంతం చేసుకుంది.
బడ్జెట్ ధరలో లభించే డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు ఎక్కువగా కొనుగోలు చేసే వ్యాగన్ఆర్(wagon R) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా అమ్ముడైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. భారతదేశ రహదారులపై దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ 2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే, 2024 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 2,00,177 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికి వ్యాగన్ఆర్ భారతీయుల హృదయాలలో తన స్థానాన్ని కోల్పోలేదని స్పష్టమైంది. టాటా పంచ్ 2024 క్యాలెండర్ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచినప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి మారుతి వ్యాగన్ఆర్ మరోసారి తన సత్తా చాటిందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరం కూడా అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా మారుతి వ్యాగన్ఆర్ తన స్థానాన్ని కాపాడుకుంది.
భారతీయుల ఆదరణ పొందిన వ్యాగన్ఆర్ 2022 ఆర్థిక సంవత్సరంలో 1,88,837 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేయగా, 2023లో 2,12,340 యూనిట్లు, 2024లో 2,00,177 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఇప్పుడు, 2025 ఆర్థిక సంవత్సరంలోనూ 1,98,451 యూనిట్ల అమ్మకాలతో మిగాతా కంపెనీల మోడళ్లు ధీటుగా టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది. టాటా పంచ్ మాత్రం 1,96,572 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానం పొందింది. రెండింటి మధ్య తేడా కేవలం 1,879 యూనిట్లు మాత్రమే.

దేశంలో ప్రత్యేకంగా SUV తరహా కార్లను ప్రజలు అధికంగా ఇష్టపడుతున్నప్పటికి మారుతి వ్యాగన్ఆర్ మాత్రం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తుంది. మరో విషయం ఏమిటంటే 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ప్యాసింజర్ వాహనాల్లో ఏకంగా ఏడు మోడళ్లు మారుతీ సుజుకీకి చెందినవే కావడం విశేషం. ఈ గణాంకాలు స్పష్టంగా మారుతీ బ్రాండ్‌పై భారతీయులకు ఉన్న నమ్మకాన్ని తెలిసేలా చేస్తున్నాయి.
1999లో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మారుతి వ్యాగన్ఆర్, 2024లో 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఇది తొమ్మిది వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రారంభ ధర వచ్చేసి రూ. 5,64,500 నుండి రూ. 7,47,500 వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలలో లభిస్తుంది. 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 68 bhp పవర్, 90 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదే 1.2. 4-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 83 bhp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ మాన్యువల్ లీటర్‌కు 24.35 కి.మీలు, AGS వేరియంట్ 25.19 కి.మీల మైలేజ్‌ను ఇస్తుంది. అదే సీఎన్‌జీ మోడల్ కిలో ఇంధనానికి 33.47 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. భారతదేశవ్యాప్తంగా ఇప్పటివరకు వ్యాగన్ఆర్ 32 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైనట్లు గణంకాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications








