మారుతీ సుజుకీ కొత్త కారు.. 30 కి.మీల మైలేజ్.. 7 సీటర్ ఆప్షన్.. హై ఎండ్ ఫీచర్స్.. దీనికోసం అందరూ వెయిటింగ్..

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) 2024 ఏడాదిలో సేల్స్ పరంగా అన్ని కంపెనీల కంటే కూడా టాప్ ప్లేస్‌లో నిలిచింది. గత ఏడాది అదిరిపోయే కార్లను విడుదల చేసి మార్కెట్లో అన్ని వర్గాల వారికి చేరువ కాగా, కొత్త ఏడాది 2025లో కూడా కంపెనీ కార్ల సేల్స్ విషయంలో తన స్థానాన్ని నిలబెట్టుకోడానికి ఈ సంవత్సరం అధునాతన డిజైన్లతో కూడిన కార్లను దేశీయంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా తన రాబోయే మోడళ్లను మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది. మారుతీ సుజుకీ ఈ ఏడాది 2 కొత్త మిడ్-సైజ్ SUVలను విడుదల చేయాలని ఆలోచన చేస్తుంది. ఇండియాలో మిడ్-సైజ్ సెగ్మెంట్‌‌కు మంచి డిమాండ్ ఉన్న తరుణంలో రెండు కార్లను తీసుకురాబోతుంది.

ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్ జనవరి 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇండియాలోని ప్రముఖ వాహన తయారీ కంపెనీలు అన్ని కూడా తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ ఈవెంట్ నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిలోనే చాలా వాహన తయారీదారులు తమ ఉత్పత్తులను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కూడా పలు కార్లను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది.

Maruti Suzuki New Midsize Suvs In 2025

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మారుతీ చాలా కాలంగా వెనుకబడి ఉంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కార్ల తయారీదారులు ఈవీలో ఇప్పటికే మార్కెట్‌ను సంపాదించగా, మారుతీ మాత్రం ఇంధన వాహనాలను మాత్రమే ఇన్నాళ్లు విడుదల చేస్తూ వచ్చింది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరగడంతో ఇతర కంపెనీల మాదిరిగానే మారుతీ ఈవీ విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. తన మొదటి మోడల్ ఇ- విటారా (E-Vitara)ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతుంది.

మారుతీ సుజుకీ మొదటి ఎలక్ట్రిక్ కార్ ఇ- విటారా(E-Vitara)ను ఈ ఈవెంట్‌లో విడుదల చేస్తుంది. ఈ కారును ఇప్పటికే ఇటలీలో ఆటో ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో అప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ కారును భారతీయ అభిరుచులకు అనుగుణంగా కొద్ది పాటు మార్పులు చేసి విడుదల చేయబోతున్నారు. ఈవీలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఇది కూడా సక్సెస్ అవుతుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.

Maruti Suzuki New Midsize Suvs In 2025

ఇ- విటారా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ఇవి ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 172bhp శక్తిని విడుదల అవుతుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో లభిస్తుంది. 49kwh బ్యాటరీ ద్వారా 144 PS పవర్, 189 Nm గరిష్ట శక్తి, అదే 61kwh బ్యాటరీ ద్వారా 172 PS పవర్, 189 Nm గరిష్ట శక్తి ఉత్పత్తి అవుతుంది.

ఈ కారుతో పాటు మారుతీ సుజుకీ మరో మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV)ని భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేయాలని చూస్తుంది. ఇది 2025 ఏడాదిలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతుంది. కొత్త రాబోతున్న మరో మోడల్ పేరు మారుతీ వై17 (Maruti Y17). ఇది విటారా కారు కంటే మరింత పెద్దదిగా ఉంటుంది. 7 సీటర్ ఆప్షన్‌లో ఇవి విడుదల కాబోతుంది. పెద్ద ఫ్యామిలి కల వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.

Maruti Suzuki Will Launch New Cars 2025

Maruti Y17కి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అవుతున్నాయి. దీంతో దీనిపై భారతీయ వినియోగదారుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ కారు మైల్డ్ హైబ్రిడ్‌తో 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌‌తో వచ్చే అవకాశం ఉంది. అదే పూర్తి హైబ్రిడ్ అయితే 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌‌ను కలిగి ఉండవచ్చని, 30 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుందని సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, January 13, 2025, 16:10 [IST]
English summary
Maruti suzuki will launch two new midsize suvs in 2025 year full details check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+