మారుతీ నుంచి 40 కి.మీల మైలేజ్ ఇచ్చే పెద్ద కారు.. దేశీయ రోడ్లపై పరుగులు పెట్టబోతుంది!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) ఆటోమొబైల్ మార్కెట్‌పై తన పట్టును సాధించడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. కంపెనీ 2025 నాటికి పలు కొత్త SUV మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని తన వ్యూహాన్ని ప్రకటించింది. దేశంలో SUV మద్దతు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతీ ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా మొదటగా మార్కెట్లోకి రాబోతున్న మోడల్ Suzuki e-Vitara. ఇది మారుతీ సుజుకీ నుంచి రానున్న తొలి పూర్తి ఎలక్ట్రిక్ SUV కావడం విశేషం. ఈ మోడల్‌ను 2025 సెప్టెంబర్‌లో కంపెనీకి చెందిన Nexa ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆకట్టుకునే డిజైన్‌తో వస్తున్న ఎలక్ట్రిక్ కారు తరువాత మారుతీ నుంచి ఏడు సీట్ల SUVని విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. విస్తృతంగా ప్రయాణించే కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్‌ను 2025 చివరి త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేయాలని మారుతి భావిస్తోంది. ఇవి కాకుండా, కంపెనీ తన లైనప్‌ను మరింత పెంచుకోవడానికి సరికొత్త ఫ్రాంక్స్ కారును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది.

Maruti Suzuki Fronx

ఇది ప్రస్తుత ఫ్రాంక్స్ మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశముంది. మారుతీ వినియోగదారుల అభిరుచులను బట్టి, తమ కార్ల శ్రేణిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ మోడల్‌ను రూపొందిస్తోందని చెప్పవచ్చు. దీన్ని కంపెనీ హైబ్రిడ్ టెక్నాలజీతో తీసుకురానుంది. మాస్-మార్కెట్ కార్లకు శక్తినిచ్చేలా రూపొందించిన ఓ కొత్త తరం బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని మారుతీ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా కొత్త మోడల్ మరింత మెరుగైన మైలేజ్ అందించే అవకాశం ఉంది.

రాబోయే ఫ్రాంక్ ఫేస్‌లిఫ్ట్ కొత్తగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన మొదటి మారుతి మోడల్ కావడం విశేషం. అందులోనూ, ఈ కారు దాదాపు మైలేజీ 40 కిలోమీటర్లకు పైగా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇంత భారీ మైలేజ్ అంటే వినియోగదారుల ఆశలను ఈ అంశం మరింత పెంచుతుంది. హైబ్రిడ్ టెక్నాలజీని ఈ మోడల్‌కు మాత్రమే కాకుండా తన ఇతర కార్లకు సైతం అందించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Maruti Suzuki Upcoming Cars

ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌ను రాబోయే ఫ్రాంక్ ఫేస్‌లిఫ్ట్ కారులో మాత్రమే అందించకుండా తన చిన్న కార్ల విభాగంలో ఉన్న మరిన్ని మోడళ్లకు విస్తరించాలనే దిశగా వేగంగా కదులుతోంది. ప్రధానంగా స్విఫ్ట్, డిజైర్, విటారా, బ్రెజ్జా వంటి చిన్న కార్లలోనూ ఈ బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించేందుకు మారుతీ సన్నద్ధమవుతోంది. ఈ మోడళ్లన్నీ కూడా ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న కార్లు. మధ్యతరగతి వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

ఇప్పటివరకు ఈ కార్లు మంచి మైలేజీతోనే ప్రసిద్ధి గాంచినప్పటికీ, హైబ్రిడ్ టెక్నాలజీ జోడించటం ద్వారా మరింత మైలేజ్ సామర్థ్యం గలవిగా మారతాయి. దీని ఫలితంగా కార్ కొనుగోలుదారులకు నిత్యం వాడే వాహనాల్లో తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూలమైన ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఇదే దిశగా, 2026 చివరిలో మారుతీ విడుదల చేయబోయే కొత్త ఎంట్రీ-లెవల్ సబ్-4 మీటర్ MPV కారుకు కూడా ఈ టెక్నాలజీని అమర్చే ప్రణాళికలు ఉన్నాయి.

ఈ MPV ప్రత్యేకంగా కొత్త హైబ్రిడ్ ఇంజిన్‌తో రాబోతుంది. చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది. ఇది మార్కెట్లోకి రాగానే సబ్-కాంపాక్ట్ వాహన విభాగంలో గట్టి పోటీని ఇవ్వనుంది. సాధారణంగా హైబ్రిడ్ కార్లు ఇంజిన్ పనితీరు పరంగా మంచి పెర్ఫామెన్స్ అందించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 6, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki will planing to introduces new hybrid technology cars
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+