దేశవ్యాప్తంగా ఈ 6 సీటర్ కారుకు ఫుల్ డిమాండ్.. 27 కి.మీల మైలేజ్‌తో సేల్స్‌లో తుఫానులు సృష్టిస్తోంది!
భారతీయ కార్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఎంపీవీ మోడల్స్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా అంటే చాలా మందికి తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది మంచి పనితీరు, కుటుంబానికి అనువైన సౌకర్యాలతో ప్రజాధారణ పొందుతుంది. అయితే, ఎర్టిగా తరహాలోనే ఇంకొంచెం ఎక్కువ ఫీచర్లు, స్టైల్, ప్రీమియం అనుభూతి కోరుకునే వారికోసం మారుతీ సుజుకీ XL6 (ఎక్స్‌ఎల్6) అనే వేరియంట్ ప్రత్యేకంగా వచ్చింది. పేరు చెప్పినట్లుగానే, ఈ MPVలో ఆరు మందికి అనువైన సీటింగ్ ఉంటుంది, దీనివల్ల ఇది చిన్న కుటుంబాలతో పాటు పెద్ద కుటుంబం గల వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఎర్టిగాను సాధారణంగా అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తుండగా, XL6ను మాత్రం ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేకంగా 'నెక్సా' షోరూమ్‌లలో అందుబాటులో ఉంచారు.
XL6 డిజైన్ అందరిని కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ మోడల్‌కు సంబంధించిన అమ్మకాల వివరాలను కంపెనీ వెల్లడించింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025 నెలలో మారుతీ సుజుకీ XL6 అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. ఈ నెలలో 4,140 యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. అదే ఏప్రిల్ 2024లో కేవలం 3,509 యూనిట్లు మాత్రమే సేల్ అయింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఇది దాదాపు 18 శాతం వృద్ధి.

ఇది మాత్రమే కాదు, మార్చి 2025తో పోలిస్తే అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. దీనిని బట్టి మారుతీ సుజుకీ XL6 మోడల్‌కు మార్కెట్లో స్థిరమైన డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్చి 2025లో XL6 కేవలం 3,105 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోగా, ఏప్రిల్‌కు వచ్చే సరికి పెరుగుదల కనిపించింది. ఇది కేవలం ఒక నెలలోనే 25 శాతం వృద్ధి నమోదు చేసినట్లే. దీన్ని బట్టి కస్టమర్లకు ఈ మోడల్ బాగా నచ్చింది.
ఈ డిమాండ్ వెనక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి, XL6 మోడల్ అందించే ఫీచర్లు, దాని ధర. భారత మార్కెట్లో ఈ కారు ధర రూ. 11.84 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర రూ. 14.84 లక్షలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతుంది.

ఈ ధరలో ప్రీమియం ఇంటీరియర్, కెప్టెన్ సీట్లు, స్మార్ట్ టెక్నాలజీ, మైలేజ్ ఫ్రెండ్లీ ఇంజిన్ వంటి అనేక ఫీచర్లు వినియోగదారులకు లభించడం XL6 మోడల్‌ను మరింత నమ్మకమైనదానిగా మార్చాయి. ముఖ్యంగా, కుటుంబ ప్రయాణాలు చేసే వారి దృష్టిలో ఇది ప్రాధాన్యత పొందింది. మార్చి నుండి ఏప్రిల్ వరకు వచ్చిన విక్రయాల పెరుగుదల ద్వారా, మార్కెట్లో XL6కి ఉన్న క్రేజ్ స్పష్టమవుతుంది.
XL6 మల్టీ పర్పస్ వెహికల్ (MPV)గా నిలుస్తోంది. ఈ కారును రెండు వేరే వేరే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది, 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్, 1.5-లీటర్ K15C CNG లలో లభిస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్‌లో వినియోగదారులు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు, CNG వేరియంట్‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే, XL6 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.97 కి.మీ, అలాగే పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 20.27 కి.మీ లు, సీఎన్జీలో 26.32 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది. ఇది నగరంలోనూ, లాంగ్ రైడ్స్‌లోనూ వినియోగదారులకు మంచి మైలేజ్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








