రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లొచ్చు! 26 కి.మీ మైలేజ్.. రూ.11.93 లక్షల ధర.. ఎందుకు పెద్దగా కొనడం లేదు?

మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా నిలిచిన కంపెనీ. ఇలాంటి సంస్థ నుండి వచ్చిన XL6 అనే MPV వినియోగదారులలో విశేషమైన ఆదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. ఆకర్షణీయమైన డిజైన్, ఫ్యామిలీ అవసరాలకు తగ్గ ఫీచర్లు, ప్రీమియం లుక్‌.. ఇవన్నీ కలిపి ఈ కారును ప్రత్యేకంగా నిలబెట్టాయి. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతున్న ఈ మోడల్ తన లగ్జరీ టచ్‌తో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే, గత కొంతకాలంగా ఈ కారుకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ముఖ్యంగా 2025 జూలైలో అమ్మకాల గణాంకాలు ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.

జూలై నెలలో మొత్తం 2,146 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, 2024 ఇదే నెలలో 2,923 యూనిట్లు అమ్ముడైన విషయం పరిశీలిస్తే, సంవత్సరానికి 26.58 శాతం తగ్గుదల నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇదంతా ఒక్కసారిగా జరిగిన డౌన్ ఫాల్ కాదు. 2025 ఫిబ్రవరి నుండి జూన్ వరకు కూడా XL6 అమ్మకాలలో మారుతి సుజుకి పోటీతత్వ స్థాయిలో నిలిచినా, ఆ కాలానికి మొత్తం 14,641 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Maruti Suzuki Xl6 Mpv July 2025 Sales Recorded 26 58 Percent Down Compared To Previous

అంటే, ఆరు నెలల కాలానికి సగటు 2,928 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇంతవరకు మంచి రన్ కొనసాగించిన ఈ MPV, ఇప్పుడు వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పు, పెరుగుతున్న పోటీ కారణంగా వెనుకబడినట్లు కనిపిస్తోంది. మార్కెట్‌లో కొత్తగా ప్రవేశిస్తున్న SUVలు, క్రాస్‌ఓవర్లు, మెరుగైన ఫీచర్లు కలిగిన ఇతర MPVలు XL6కు కఠినమైన సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో XL6ను తిరిగి టాప్‌సెల్లింగ్ మోడల్‌గా నిలబెట్టాలంటే పలు ప్రణాళికలు అవసరం.

ప్రధానంటా ఫీచర్లను అప్‌డేట్ చేయడం, డిజైన్‌లో మార్పు, వినియోగదారులను ఆకర్షించే మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడం తప్పనిసరి అవుతుంది. మారుతి XL6 అమ్మకాల తగ్గుదలకు అదే సెగ్మెంట్‌లోకి వస్తున్న ఇతర MPVల ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్, తాజా క్లావిస్ వంటి మోడళ్లు XL6కు పెద్ద సవాలుగా మారాయి.

Maruti Suzuki Xl6 Mpv July 2025 Sales Recorded 26 58 Percent Down Compared To Previous

ఇవి చాలా తక్కువ ధరల్లో, వినియోగదారులకు అందుబాటులో ఉండటమే కాకుండా, ఫీచర్లు, పనితీరులో కూడా పోటీ ఇస్తున్నాయి. ఫలితంగా, XL6 వంటి ప్రీమియం MPVపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధర, ఇతర వివరాల్లోకి వెళితే, ఈ వాహనం ధర రూ. 11.93 లక్షల నుండి రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండటంతో, ఇది విస్తృతమైన వినియోగదారుల వర్గానికి అందుబాటులో ఉంటుంది.

వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని, దీనిని జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తివంతమైన పనితీరును అందించడానికి దీనిలో అధునాతన పవర్‌ట్రెయిన్‌ను ఇచ్చారు. 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌లతో ఇది మరింత బలమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవడానికి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం కల్పించారు.

Maruti Suzuki Xl6 Mpv July 2025 Sales Recorded 26 58 Percent Down Compared To Previous

ఇంధన సామర్థ్యం విషయానికొస్తే, ఇది 20 నుండి 26 కిలోమీటర్ల వరకు లీటరుకు మైలేజీ అందించగలదు. దూర ప్రయాణాలకు బెస్ట్. అదనంగా, 45 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉండటంతో తరచుగా ఫ్యూయల్ నింపాల్సిన అవసరం తగ్గుతుంది. మొత్తం మీద, ధర, పనితీరు, ఇంధన సామర్థ్యం, వేరియంట్ల వైవిధ్యం వంటి అన్ని అంశాలను సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ వాహనం, అన్ని రకాల వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 26, 2025, 15:04 [IST]
English summary
Maruti suzuki xl6 mpv july 2025 sales recorded 26 58 percent down compared to previous
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+