కుటుంబం కోసం కారు అంటే.. సేఫ్టీ ముందు చూడాలి! ఓసారి ఈ మోడల్‌పై లుక్కేయండి.. ఇకపై మరింత సేఫ్టీ

ప్రస్తుత మార్కెట్లో వాహన తయారీదారులు భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి తమ కార్లలో మెరుగైన అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో తమ పాత మోడళ్లను మరింత కొత్తగా మారుస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తమ కస్టమర్లకు మెరుగైన సేఫ్టీ ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా తన ప్రసిద్ధ మోడల్ ప్రీమియం MPV అయిన XL6 మోడల్‌ను మరింత సురక్షితంగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. ఈ MPVలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఇప్పుడు ప్రామాణికంగా అందించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇది కేవలం భద్రత పరంగా ఓ అప్‌డేట్ మాత్రమే కాకుండా, సంస్థ భవిష్యత్ దృష్టిని సూచించే ఒక బలమైన ప్రకటన కూడా. ఈ తాజా భద్రతా మెరుగుదలతో పాటు, మోడల్ ధరలు సుమారు 0.8 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఇది కూడా వెంటనే అమలులోకి వస్తోంది. ధరలు కొద్దిగా పెరగడంతో, వినియోగదారులకు మరింత భద్రతా అంశాలు లభిస్తున్నాయి.

Maruti Suzuki Xl6 New Price

మార్కెట్లో గల పోటీ పరిస్థితుల మధ్య, వినియోగదారుల కోసం అధిక భద్రత కలిగిన వాహనాలు అందించడం ఇప్పుడు ప్రతి కంపెనీ బాధ్యతగా మారింది. మారుతి సుజుకి అదే దిశగా ముందడుగు వేస్తోంది. ఇప్పటికే XL6 లో ఎన్నో ప్యాక్టికల్ ఫీచర్లు, మైలేజ్, కంఫర్ట్ ఉండగా, ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ప్రయాణీకుల రక్షణను మరో మెట్టుపైకి తీసుకెళ్తోంది. ఇది కేవలం నగరాల్లోనే కాక, హైవే రైడింగ్‌లోనూ మరింత ధైర్యంగా ప్రయాణించేందుకు సహాయపడుతుంది.

సేఫ్టీ నార్మ్స్‌ను కచ్చితంగా పాటిస్తూ, ప్రయాణంలో భద్రతపై భయం లేకుండా ఈ మార్పు వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేలా ఉంటుంది. ఈ అప్‌డేట్‌తో, మారుతి సుజుకి.. కేవలం కారు అమ్మకం కాదు, భద్రతా ప్రమాణాల్లో మున్ముందుగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. ఇండియన్ మార్కెట్‌లో ప్రీమియం MPV సెగ్మెంట్‌కి ఇది ఒక మంచి మార్గదర్శకమవుతుంది.

Maruti Suzuki Xl6

మారుతి సుజుకి ప్రీమియం MPV అయిన XL6 పెట్రోల్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.11.83 లక్షల ఎక్స్‌షోరూమ్ నుంచి మొదలై రూ. 14.99 లక్షల వరకు ఉన్నాయి. XL6 ప్రీమియం MPV సెగ్మెంట్‌లో 6 సీట్ల ఆకర్షణీయ డిజైన్‌తో, ఫ్యామిలీ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్ ఉన్నట్టే చెప్పాలి. ఆకట్టుకునే ఇంటీరియర్, ప్రాక్టికల్ స్పేస్‌తో పాటు, ఇప్పుడు మైలేజ్ పరంగా కూడా ఇది మిగతా కార్లకన్నా మెరుగైన ప్యాకేజీగా నిలుస్తోంది.

ఈ MPVలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తోంది. కంపెనీ ఈ కారును పెట్రోల్, CNG వేరియంట్లలో అందిస్తోంది. వాటి మైలేజ్ వివరాలు చూస్తే, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 20.97 kmpl వరకు,పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 20.27 kmpl వరకు, CNG మాన్యువల్ వేరియంట్ 26.32 km/kg వరకు ఇస్తుంది.

Maruti Suzuki Xl6 6 Airbags

ఈ మైలేజ్ ఫిగర్లతో చూస్తే, XL6 ఒక ఫ్యామిలీ కారుగా సరైన చాయిస్‌ మాత్రమే కాదు, రోజువారీ ప్రయాణాల విషయంలోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా హైవేలు, లాంగ్ ట్రిప్స్ చేయాలనుకునే కుటుంబాలకి ఇది సౌకర్యవంతమైన, స్టైల్ మరియు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ఎంపిక. ఇప్పుడు ఇక భద్రతపై మరింత దృష్టి పెట్టితో ఈ MPVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందించడంతో ప్రయాణికుల రక్షణను మరింత బలోపేతం చేసినట్లయింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 24, 2025, 13:30 [IST]
English summary
Maruti suzuki xl6 now comes with 6 airbags as standard safety features price hike details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+