రెండు ఒకే కంపెనీ కార్లు.. కుటుంబానికి బెస్ట్ అంటున్నారు, కానీ ఒకదాన్ని మాత్రం అసలు పట్టించుకోవడంలేదు! ఎందుకో?
మారుతి సుజుకి MPV సెగ్మెంట్ ప్రస్తుతం మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇందులో ముఖ్యంగా ఒక కీలక మోడల్ అయిన మారుతి సుజుకి XL6, సేల్స్ పరంగా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ఇది ఒకప్పుడు ప్రీమియం ఎంపీవీగా మంచి అంచనాలతో మార్కెట్లోకి ప్రవేశించినా, ప్రస్తుతం ఆదరన కొల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఇది 6 సీట్ల కాంబినేషన్‌తో స్టైలిష్ డిజైన్,ఆకట్టుకునే అంశాలను కలిగి ఉన్నప్పటికి కొనుగోలుదారులను ఆకర్షించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటోంది. జూన్ 2025లో మారుతి సుజుకి XL6 అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఈ MPVకు ఎదురవుతున్న వాస్తవ సమస్యలను స్పష్టంగా చూపిస్తోంది. గతంలో ఒక ప్రీమియం ఎంపీవీగా మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న XL6, ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి మెరుగైన స్పందనను పొందడంలో విఫలమవుతోంది.
జూన్ నెలలో XL6 కేవలం 2,011 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం ఆందోళన కలిగించే అంశం. ఇది గత ఏడాది జూన్‌లో అమ్ముడైన 3,323 యూనిట్లతో పోలిస్తే 39 శాతం తగ్గుదల. అంతేకాదు, మే 2025లో 3,507 యూనిట్లు, ఏప్రిల్ 2025లో 4,140 యూనిట్లు అమ్ముడవడం చూస్తే, అమ్మకాల్లో తక్కువ నమోదు చేస్తుందనడానికి ఇది కొనసాగింపుగా తెలుస్తోంది. అటు అదే కంపెనీకి చెందిన మరో MPV ఎర్టిగా మాత్రం సక్సెస్ అవుతుంది.

జూన్ 2025లో ఎర్టిగా 14,151 యూనిట్లు విక్రయించి, ఈ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని చాటింది. XL6 కి ఉన్న ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లు యువతను ఆకట్టుకుంటాయాని ఆశించినప్పటికి, అది వాస్తవంగా జరగలేదు. ఇటీవలి కాలంలో కొత్త అప్‌డేట్స్ జోడించకపోవడం కూడా సేల్స్ తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలోనే ఇతర మోడళ్లు లభించడం కారణంగా కస్లమర్లు ఈ కారుపై ఆసక్తి చూపించడం లేదు.
మారుతి సుజుకి XL6, ఒక ప్రీమియం MPVగా భారత మార్కెట్లో 6 సీట్ల విభాగంలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది సాధారణ పెట్రోల్ వేరియంట్‌తో పాటు CNG వేరియంట్‌లోనూ లభిస్తుంది, తద్వారా ఎక్కువ మైలేజ్ మీద దృష్టి పెట్టే వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ MPV ధరలు రూ. 11.83 లక్షల నుండి రూ. 14.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

కారులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పెట్రోల్ వేరియంట్‌లో లభిస్తున్నప్పటికీ, CNG వేరియంట్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మైలేజ్ పరంగా చూస్తే, XL6 బాగా ఆలోచించి ఎంపిక చేసుకున్న ప్యాకేజ్‌గా చెప్పవచ్చు. కంపెనీ ప్రకారం, CNG - మాన్యువల్ వేరియంట్ 26.32 km/kg వరకు, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 20.97 kmpl, పెట్రోల్ - ఆటోమేటిక్ వేరియంట్ 20.27 kmpl వరకు ఇస్తుంది.
మారుతి సుజుకి XL6 కారు పెద్ద కుటుంబం గల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. లోపల విశాలమైన స్థలం, ఆండ్రాయిడ్ ఆటో,యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ డిస్‌ప్లే, కంఫర్ట్ సీట్లు, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలు కూడా ఈ కారులో అందించడం విశేషం. ఒక ప్రీమియం MPVగా మార్కెట్‌లో నిలుస్తుంది.

భద్రతా ప్రమాణాల విషయంలో మాత్రం ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ కారు, ఇది న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. XL6 ప్రస్తుతం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ హోల్డ్ అసిస్టెన్స్, ISOFIX చైల్డ్ మౌంట్స్ వంటి కొన్ని అవసరమైన భద్రతా సౌకర్యాలతో వస్తోంది.


Click it and Unblock the Notifications








