అందరి ఫేవరెట్ కారుపై భారీ తగ్గింపు! ఆఫర్ మిస్ చేసుకోకండి.. తక్కువ ధరలో సొంతం
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)... పేరు వినగానే భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఓ ఐకాన్ గుర్తుకువస్తుంది. దాదాపు కొన్ని లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, ఏళ్ల తరబడి హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతూ వస్తున్న ఈ కారు, ఇప్పుడు GST తగ్గింపు లాభాలతో మరింత రణరంగం సృష్టిస్తోంది. ధరలు తగ్గడంతో మారుతి షోరూమ్‌ల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగిపోయింది. కొత్తగా కస్టమర్లు మాత్రమే కాదు, ఇప్పటికే కారు కొనాలని చూసిన వారు కూడా ధరల తగ్గింపును సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వేళ, సంవత్సరాంతం కావడంతో ఉన్న స్టాక్‌ను త్వరగా క్లియర్ చేసుకోవడానికి మారుతి సుజుకి భారీ ఆఫర్ల దిశగా అడుగుపెట్టింది. డిసెంబర్ 2025ను లక్ష్యంగా చేసుకుని, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌పై కంపెనీ అగ్రెసివ్‌గా డీల్స్ ప్రకటించింది.
డిసెంబర్ నెలలో స్విఫ్ట్ కొనాలనుకుంటే, ఏకంగా రూ.55,000 వరకు లాభం పొందే అవకాశం ఉంది. ఇందులో రూ.25,000 వరకూ డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ పాలసీ ద్వారా రూ.25,000 బోనస్, లేదా మార్పిడి చేసేవారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు. అదనంగా, రూ.5,000 విలువైన ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అంటే మొత్తం మీద వినియోగదారునికి లాభాల పండుగ... కంపెనీకి పాత స్టాక్ క్లియరెన్స్ ఫెస్టివల్.

అన్నింటికంటే ముఖ్యంగా, స్విఫ్ట్ ప్రాచుర్యం తగ్గని మోడల్. స్టైలిష్ డిజైన్, నమ్మదగిన ఇంజిన్, తక్కువ మెయింటెనెన్స్.. ఇవన్నీ కలసి ఈ కారును కుటుంబాల మొదటి ఎంపికగా నిలిపాయి. ఇప్పుడు ధర తగ్గింపులు, ఆఫర్లు కలిసినప్పుడు, ఈ డిసెంబర్‌లో స్విఫ్ట్‌పై మార్కెట్‌లో డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ ఓసారి స్విఫ్ట్ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైందంటే అతిశయోక్తి కాదు.
మరో కీలక విషయం ఏమిటంటే, డిస్కౌంట్ ఆఫర్లు మీరు ఉన్న నగరం, రాష్ట్రం ఆధారంగా మారే అవకాశం ఉందని తప్పక గమనించాలి. ప్రతి డీలర్‌షిప్‌కు వచ్చే స్టాక్ పరిమాణం, స్థానిక డిమాండ్, కంపెనీ పంపిణీ ప్రణాళికలు.. ఇవన్నీ ఆఫర్ల పరిమాణంలో తేడాలు రావడానికి కారణమవుతాయి. అలాగే, ఈ డిసెంబర్ ఆఫర్లు స్టాక్ లభ్యతకు లోబడి అందించబడతాయి. షోరూమ్‌లో ఉన్న యూనిట్‌లు పూర్తయితే, ఆఫర్లలో మార్పులు రావచ్చు లేదా ముందుగానే ముగియవచ్చు.

కనుక కొనుగోలు ఆలోచనలో ఉన్నవారు ఆలస్యం చేయకుండా సమీప షోరూమ్‌కి వెళ్లి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఇక మారుతి స్విఫ్ట్ ధర చూసినట్లయితే, ప్రస్తుతం స్విఫ్ట్ ధరలు రూ.5.79 లక్షల నుండి రూ.8.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, ఈ హ్యాచ్‌బ్యాక్ తన పనితీరుతో ఇప్పటికీ సెగ్మెంట్‌లో బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. కొత్తతరం 1.2-లీటర్ Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 80 bhp పవర్, 112 Nm టార్క్‌ను ఇస్తుంది.
నగర డ్రైవింగ్‌కు కావాల్సిన స్పందనను, హైవే క్రూజింగ్‌కు కావాల్సిన రిఫైన్మెంట్‌ను అందిస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT-రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు లభిస్తాయి. CNG వేరియంట్ విషయానికి వస్తే, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌పై నడిపినప్పుడు ఇంజిన్ అవుట్‌పుట్ కొద్దిగా తగ్గడం సహజం. అయితే, ఈ తక్కువ పనితీరు గురించి చాలామంది మర్చిపోయేంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చే విషయం మైలేజ్.

ఎందుకంటే స్విఫ్ట్ CNG ఏకంగా కిలోగ్రాముకు 32.85 కిలోమీటర్ల మైలేజీని హామీ ఇస్తోంది. ఇది కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లలో అత్యుత్తమ గణాంకాల్లో ఒకటి. పెట్రోల్ స్విఫ్ట్‌కు కూడా అద్భుతమైన మైలేజ్ సామర్థ్యం ఉందని మారుతి సుజుకి ప్రకటించింది. ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్లు 24.80 కి.మీ/లీ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. మారుతి కారులో మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








