విజయభేరి మోగించిన మారుతి విక్టోరిస్..28.65కిమీ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం జనం ఎగబడుతున్నారు

భారతదేశంలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి రెండవసారి విడుదల చేసిన మోడల్ విక్టోరిస్(Victoris). ఈ కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన తొలి నెల నుంచే అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. లుక్, ఫీచర్లు, ధర విషయంలో వినియోగదారులను ఆకట్టుకున్న విక్టోరిస్‌ను కొనుగోలు చేయడానికి జనం బారులు తీరుతున్నారు.

2025 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ నెలలో మారుతి సుజుకి ఏకంగా 12,300 యూనిట్ల విక్టోరిస్ కార్లను విక్రయించింది. మూడు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, తొలి రోజుల్లోనే 25,000 యూనిట్ల బుకింగ్‌లను దాటిందంటే, దీనికి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Maruti Victoris Hybrid SUV Sales Soar Records 28 65 Kmpl Mileage and 5-Star Safety

మారుతి సుజుకి సాధారణంగా ఉపయోగించే డిజైన్‌కు భిన్నంగా విక్టోరిస్‌కు మంచి సైజు, వాల్యూమ్ ఉన్న ఆకృతిని ఇచ్చారు. ఇందులో కొత్త LED DRLలు, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, LED లైటింగ్, 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు టెయిల్‌గేట్‌పై LED లైట్ బార్, సిల్వర్ రంగు రూఫ్ రైల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

విక్టోరిస్ మొత్తం పది రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్ LXi, VXi, ZXi, ZXi(O), ZXi+, ZXi+ (O) అనే వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

Maruti Victoris Hybrid SUV Sales Soar Records 28 65 Kmpl Mileage and 5-Star Safety

విక్టోరిస్ ఇంటీరియర్ కూడా గ్రాండ్ విటారా కంటే పూర్తిగా భిన్నంగా, అధునాతనంగా రూపొందించబడింది. ఇందులో కొత్తగా 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డోల్బీ అట్మాస్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), ఆంబియెంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టెక్నాలజీ పరంగా చూస్తే, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్, జెస్టర్ కంట్రోల్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్, అండర్‌బాడీ CNG ట్యాంక్ వంటి ప్రత్యేకతలు దీనిని సెగ్మెంట్‌లో వేరుగా నిలబెడుతున్నాయి.

Maruti Victoris Hybrid SUV Sales Soar Records 28 65 Kmpl Mileage and 5-Star Safety

విక్టోరిస్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది: 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 1.5 లీటర్ పెట్రోల్-CNG ఆప్షన్. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే, హైబ్రిడ్ వేరియంట్‌లు లీటర్‌కు 28.65 కిలోమీటర్లు ఇవ్వడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్.

పెట్రోల్ మ్యాన్యువల్ 21.18 కి.మీ, పెట్రోల్ ఆటోమేటిక్ 21.06 కి.మీ, CNG అయితే కిలోగ్రామ్‌కు 27.02 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ SUV భారత్ NCAP, గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెద్దల భద్రతకు 34కి 33.72 పాయింట్లు, పిల్లల భద్రతకు 49కి 41 పాయింట్లు సాధించడం ద్వారా ఈ కారు సురక్షితమైన ఎస్‌యూవీగా నిరూపించబడింది. 5స్టార్ సేఫ్టీ ఉండడంతో అమ్మకాలు రానున్న కాలంలో మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 13, 2025, 16:07 [IST]
English summary
Maruti victoris hybrid suv sales soar records 28 65 kmpl mileage and 5 star safety
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+