పేదవాడి డ్రీమ్ కారు.. రూ.4.99 లక్షలకే 34 కి.మీ మైలేజ్.. అందుకే ఇప్పటి వరకు 1.65 లక్షల మంది కొనేశారు

మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ ఆర్(Wagon R) కారు భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కారు ధర కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్‌లో 34 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుంది.

తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, కుటుంబానికి సరిపడా విశాలమైన స్పేస్ వంటి కారణాల వల్ల ఈ కారును సామాన్యులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే గత 10 నెలల్లో ఏకంగా 1,65,044 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ విజయం ఈ కారుపై భారతీయ వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

Maruti Wagon R Sales Success 1 65 Lakh Units Sold in 10 Months

వ్యాగన్ ఆర్ మార్కెట్‌లోకి వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ తన సత్తా చాటుతోంది. ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ కారు అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. తాజా గణాంకాల ప్రకారం గత 10 నెలల్లో అంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ కారును ఏకంగా 1.65 లక్షల మంది కొనుగోలు చేశారు. ఈ సుదీర్ఘ కాలంలో కూడా వ్యాగన్ ఆర్ అమ్మకాలు తగ్గకపోవడానికి గల కారణాలను ఇక్కడ వివరంగా చూద్దాం.

మారుతి సుజుకి కంపెనీ ఎప్పటి నుంచో వ్యాగన్ ఆర్ కారును విక్రయిస్తోంది. ఈ కారు 2025లో కూడా అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. గత 10 నెలల్లో జనవరి నెలలో అత్యధికంగా 24,078 యూనిట్లు అమ్ముడయ్యాయి.జూన్ నెలలో అత్యల్పంగా 12,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు మారుతి వ్యాగన్ ఆర్ మొత్తం 1,65,044 యూనిట్లను విక్రయించింది.

నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి (24,078), ఫిబ్రవరి (19,879), మార్చి (17,175), ఏప్రిల్ (13,413), మే (13,949), జూన్ (12,930), జూలై (14,710), ఆగస్ట్ (14,552), సెప్టెంబర్ (15,388), అక్టోబర్ (18,970) కార్లు అమ్ముడయ్యాయి.

Maruti Wagon R Sales Success 1 65 Lakh Units Sold in 10 Months

వ్యాగన్ ఆర్ విజయం వెనుక దాని ధర, ఇంజన్ ఆప్షన్లు, అసాధారణమైన మైలేజ్ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.95 లక్షల మధ్య అందుబాటులో ఉంది. ఇందులో రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 67 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 90 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. ఈ వేరియంట్ ఒక కిలో సీఎన్‌జీకి ఏకంగా 34 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్. వ్యాగన్ ఆర్ కేవలం మైలేజ్‌తోనే కాకుండా, దాని ఎత్తు, విశాలమైన స్పేస్, ఫీచర్ల వల్ల కూడా ప్రజాదరణ పొందింది.

ఈ కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్, 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ముందు భాగంలో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు అందించారు.

వ్యాగన్ ఆర్ కొత్తగా కారు కొనేవారికి, చిన్న కుటుంబాలకు సరైన ఆప్షన్. దీని ఎక్కువ ఎత్తు, విశాలమైన స్థలం దీనికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ లక్షణాల వల్లే వ్యాగన్ ఆర్ అమ్మకాలు నిరంతరం కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, November 23, 2025, 17:50 [IST]
English summary
Maruti wagon r sales success 1 65 lakh units sold in 10 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+