మారుతికి లాభాల పంట పండిస్తున్న లో బడ్జెట్ కార్లు.. హ్యుందాయ్, టాటాకు చెమటలు పట్టిస్తున్న మహీంద్రా
ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల మార్కెట్‌లలో భారతదేశం కూడా ఒకటి. ప్రతీ నెలా లక్షలాది కార్లు భారతదేశంలో అమ్ముడవుతాయి. మారుతి సుజుకి ఒక్కటే ప్రతీ నెలా లక్షకు పైగా కార్లను విక్రయిస్తుందంటే దీని మార్కెట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. గత 2025 జూన్ నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించిన టాప్ 10 కంపెనీలు ఏవి? అవి ఎన్ని కార్లను విక్రయించాయి? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 14 కార్ల కంపెనీల నుండి కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ 14 కంపెనీల నుండి గత జూన్ నెలలో మొత్తం 3,17,757 కార్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలో గత ఒక నెలలో మొత్తం అమ్ముడైన కార్ల సంఖ్య ఇది. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు కూడా లో బడ్జెట్లోని కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మార్కెట్ వ్యాల్యూ పెరిగింది.

అయితే, 2024 సంవత్సరంలో ఇదే జూన్ నెలలో 21, 661 కార్లు ఎక్కువగా, అంటే 3,39,418 కార్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా చూస్తే, గత సంవత్సరం జూన్‌తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్‌లో భారతదేశంలో కార్ల అమ్మకాలు 6.38% తగ్గాయి. ఎప్పటిలాగే, అత్యధిక కార్లను విక్రయించిన కంపెనీగా మారుతి సుజుకి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
మారుతి సుజుకి నుండి గత జూన్ నెలలో 1,18,906 కార్లు అమ్ముడయ్యాయి. అయితే, 2024 జూన్ నెలలో మారుతి సుజుకి 1,37,160 కార్లను విక్రయించింది. ఈ విధంగా చూస్తే, మారుతి సుజుకి కార్ల అమ్మకాలు 13.31% తగ్గాయి.

మారుతి సుజుకి తర్వాత, మహీంద్రా కంపెనీ నుండి గత నెలలో అత్యధిక సంఖ్యలో కార్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీలను దాటుకుని, మహీంద్రా కంపెనీ గత జూన్ నెలలో 47,306 కార్లను విక్రయించి ఒక్కసారిగా పుంజుకుంది.
మహీంద్రా తర్వాత 3వ స్థానంలో హ్యుందాయ్ 44,024 కార్ల అమ్మకాలతో ఉంది. అయితే, 2024 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ 50,103 కార్ల అమ్మకాలతో మారుతి సుజుకి తర్వాత 2వ స్థానంలో ఉంది. ఆ నెలలో మహీంద్రా కేవలం 40,022 కార్లను మాత్రమే విక్రయించింది.

వీటి తర్వాత 4వ స్థానంలో టాటా మోటార్స్ 37,083 కార్ల అమ్మకాలతో ఉంది. ఇది సాధారణం కంటే చాలా తక్కువ. 5వ స్థానంలో ఉన్న టయోటా గత నెలలో 26,453 కార్లను విక్రయించింది. ఈ టాప్-10 జాబితా చివరి ఐదు స్థానాల్లో వరుసగా కియా (20,625), ఎంజీ మోటార్(5,829), స్కోడా(5,014), హోండా (4,618), వోక్స్‌వ్యాగన్ (3,089) ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా కంపెనీ కార్ల అమ్మకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీల అమ్మకాలు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, టాటా మోటార్స్ కంపెనీ గత నెలలో కేవలం 37 వేల కార్లను మాత్రమే విక్రయించడం ఆశ్చర్యకరం. దీని ద్వారా హ్యుందాయ్, టాటా కార్ల కస్టమర్లను మహీంద్రా నెమ్మదిగా తమ వైపు ఆకర్షిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








