కారు కొనేయండి.. మెయింటెనెన్స్ మర్చిపోండి.. 10ఏళ్ల పాటు మారుతి కంపెనీనే చూసుకుంటుంది
భారతదేశపు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో టాటా, మహీంద్రా, ఎంజీ దూసుకుపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీ క్రెటా కూడా ఎలక్ట్రిక్ అవతారంలో వచ్చేసింది. కానీ అందరూ ఎదురుచూస్తున్నది మాత్రం మారుతి సుజుకి ఎంట్రీ కోసమే.
'ఈ విటారా' అనే మోడల్‌తో కంపెనీ ఇటీవల ఎంట్రీ ఇచ్చినా, అధికారికంగా ఇంకా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ మారుతి సుజుకి ఈ కారును మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీ అవుతుంది. పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఈ విటారాను విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని బ్రాండ్ యోచిస్తోంది.

ఈ ఆవిష్కరణకు ముహూర్తం దగ్గరపడుతుంది. ఈ క్రమంలోనే మారుతి సుజుకి ఈ విటారా గురించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లలో సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఏకంగా 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో విడుదల చేయనుండడం హాట్ టాపిక్ అయింది.
చాలా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు సాధారణంగా బ్యాటరీ ప్యాక్‌లకు 8 సంవత్సరాల వారంటీ ఇస్తుండగా, సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. అయితే కొన్ని కంపెనీలు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వారంటీని కూడా అందిస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మారుతి సుజుకి భారతదేశంలో కూడా 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీని ఇస్తుందో లేదో చూడాలి. ఇక్కడ మహీంద్రా BE 6, XEV 9e మొదటి యజమానులకు బ్యాటరీ ప్యాక్‌పై జీవితకాల వారంటీని అందిస్తున్న నేపథ్యంలో మారుతి నిర్ణయం ఇక్కడ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి.
ప్రస్తుతానికైతే భారతదేశానికి మాత్రమే ప్రత్యేకంగా లైఫ్ టైం వారంటీని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్లోబల్ మార్కెట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు, ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లతో అమ్ముడవుతోంది.

భారతీయ మార్కెట్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆల్-వీల్ డ్రైవ్ మాత్రం ఉండకపోవచ్చు. బ్యాటరీ ప్యాక్‌ల గురించి వివరంగా చెప్పాలంటే, ఈ-విటారా 49 kWh లేదా 61 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో లభిస్తుంది. రెండింటిలోనూ లిథియం-ఫెర్రో-ఫాస్ఫేట్ (LFP) కెమిస్ట్రీని ఉపయోగించినట్లు మారుతి చెబుతోంది.
మొదటిది ఫ్రంట్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. రెండవ దానికి గ్లోబల్ మార్కెట్లలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సింగిల్-మోటార్ 49 kWh వేరియంట్ 142 bhp పవర్, 192.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే 61 kWh ప్యాక్‌తో కూడిన సింగిల్-మోటార్ సెటప్ 172 bhp పవర్‌ను అందిస్తుంది.

మరోవైపు ఆల్-వీల్ డ్రైవ్ 181 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా తయారు చేశారు. రేంజ్ విషయానికొస్తే, మారుతి ఈ విటారా 49 kWh వెర్షన్ సింగిల్ ఛార్జ్‌పై 346 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో 61 kWh ప్యాక్ 428 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. అయితే 61 kWh AWD వేరియంట్ 412 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కలిగి ఉంది.
మూడు వేరియంట్‌లలోనూ 7 kW AC ఛార్జింగ్, 70 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ విటారా బ్యాటరీలు చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీదారు BYD నుంచి వచ్చిన లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్లేడ్ సెల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. గుజరాత్‌లోని మారుతి సుజుకి ప్లాంట్‌లో ఈ విటారా త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది.
భారతీయ మరియు విదేశీ మార్కెట్ల కోసం అవసరమైన యూనిట్లను ఇక్కడే తయారు చేయనున్నారు. వచ్చే నెలల్లో భారతదేశంలో ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా నెక్సాన్ ఈవీ వంటి వాటితో పోటీ పడనున్న ఈ మారుతి ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ ధర రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








