విదేశాల్లో కారు ఎగుమతుల్లోనూ మారుతికి రికార్డు.. ఇండియాలో అమ్మిన దానికంటే ఎగుమతుల్లోనే ఎక్కువ లాభం!
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) అమ్మకాల విషయంలో తన రికార్డును కొనసాగిస్తోంది. తాజాగా విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2) ఆర్థిక ఫలితాలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి. దేశీయ విక్రయాలలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, విదేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి సరికొత్త రికార్డు సృష్టించింది.
జూలై నుండి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో, కంపెనీ ఏకంగా 1,10,487 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది, ఇది 42.2 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశీయ అమ్మకాల కంటే ఎగుమతుల నుంచే ఎక్కువ లాభం వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5-డోర్ జిమ్నీ, ఫ్రాంక్స్ (Fronx) వంటి మోడళ్లకు విదేశీ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.

భారతదేశంలో కార్ల అమ్మకాలలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై నుండి సెప్టెంబర్)లో ఎగుమతుల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. ఈ త్రైమాసికంలో మారుతి మొత్తం 1,10,487 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది 42.2 శాతం వృద్ధిని సూచిస్తుంది.
జీఎస్టీ తగ్గింపు కోసం వినియోగదారులు వేచి చూడటం వల్ల దేశీయ అమ్మకాలు ఈ త్రైమాసికంలో 5.1 శాతం తగ్గి 4,40,387 యూనిట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ, విదేశాల నుంచి బలమైన డిమాండ్ కారణంగా మారుతి మొత్తం అమ్మకాలు 1.7 శాతం పెరిగి 5,50,874 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ రికార్డుతో, దేశీయ అమ్మకాల కంటే ఎగుమతుల ద్వారానే కంపెనీకి ఎక్కువ లాభం లభించినట్లు తెలుస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్) మారుతి సుజుకి మొత్తం విక్రయాల్లో కూడా మంచి గణాంకాలు నమోదు చేసింది. ఈ అర్ధ భాగంలో మారుతి సుజుకి మొత్తం 10.78 లక్షల కార్లను విక్రయించింది. ఇందులో 8.71 లక్షల యూనిట్లు దేశీయ మార్కెట్‌లో అమ్ముడవగా, 2.07 లక్షల యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇది బ్రాండ్ చరిత్రలోనే అత్యుత్తమ అర్ధ-వార్షిక ఎగుమతి గణాంకం.
మారుతి సుజుకి ఎగుమతి వృద్ధికి కొత్త మోడళ్లైన జిమ్నీ 5-డోర్, ఫ్రొంక్స్ ముఖ్య కారణాలుగా నిలిచాయి. 5-డోర్ జిమ్నీ విజయవంతం కావడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. మేడ్ ఇన్ ఇండియా జిమ్నీ 5-డోర్ ప్రస్తుతం జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది.

ఫ్రొంక్స్ తర్వాత అత్యధికంగా ఎగుమతి అవుతున్న రెండో మోడల్ జిమ్నీ 5-డోరే. ఈ రెండు మోడళ్లు అంతర్జాతీయంగా మారుతి స్థానాన్ని బలోపేతం చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గుజరాత్ ప్లాంట్ నుంచి ఆరు వేలకు పైగా ఈ విటారా యూనిట్లను యూకే, ఇతర యూరోపియన్ మార్కెట్‌లకు మారుతి ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications








