కార్ లవర్స్ గెట్ రెడీ.. ఒకదానిని మించి మరొకటి.. త్వరలో ఎస్యూవీ మార్కెట్లోకి 4కొత్త మోడల్స్ దింపుతున్న మారుతి

భారతదేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) సెగ్మెంట్లో టాప్ పొజిషన్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో మారుతి సుజుకి(Maruti Suzuki) రెడీ అయింది. దేశంలోనే నంబర్ 1 కార్ల తయారీ సంస్థ అయిన మారుతి ఎప్పటికప్పుడూ తమ వాహనాల్లో ప్రాక్టికాలిటీ, ఫ్యూయెల్ కెపాసిటీ, అడ్వాన్సుడ్ ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తుంది.

ఈ క్రమంలో రాబోయే రెండేళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఎస్యూవీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేసింది. మీరు ఎస్యూవీలను ఇష్టపడేవారైతే, లేదా మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్న కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మారుతి తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త ఎస్‌యూవీల వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి.

Maruti s Invasion in SUV Market 4 New Cars Ready for Battle Each One Better Than the Last

ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించుకోవడానికి మారుతి సుజుకి పూర్తిగా సిద్ధమైంది. ప్రత్యేకించి ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలవడానికి మారుతి నాలుగు కొత్త, పవర్ఫుల్ మోడల్స్‌ను రెడీ చేస్తోంది. ఇవి కేవలం కొత్త కార్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకత, టెక్నాలజీ, ఫ్యూయెల్ కెపాసిటీ విషయంలో ఒకదానికొకటి మెరుగ్గా ఉన్నాయి. రాబోయే కాలంలో పోరుకు సిద్ధంగా ఉన్న మారుతి ఆ నాలుగు కొత్త మోడల్స్ వివరాలు చూద్దాం.

1. మారుతి సుజుకి E-విటారా
మారుతి సుజుకి E-విటారా అనేది కంపెనీ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది రాబోయే నెలల్లో షోరూమ్‌లలోకి రానుంది. ఈ కారును పర్ఫార్మెన్స్, రేంజ్, సేఫ్టీ పై దృష్టి సారించి, నూతన హార్టెక్ట్-ఇ ప్లాట్‌ఫామ్ పై రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇవి రెండూ lfp బ్లేడ్ సెల్స్‌ను ఉపయోగించడం వల్ల మన్నిక ఎక్కువ ఉంటుంది.

Maruti s Invasion in SUV Market 4 New Cars Ready for Battle Each One Better Than the Last

వేరియంట్‌ను బట్టి, ఇది ఒక్క ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్‌ను అందించే అవకాశం ఉంది. ఇది సింగిల్-మోటార్ ఫ్రంట్-వీల్ డ్రైవ్, డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌లలో అందుబాటులో ఉంటుంది, 143 bhp నుండి 184 bhp వరకు పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది.

2. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7 సీటర్
మారుతి తదుపరి మోడల్ గ్రాండ్ విటారా 7 సీటర్. ఇది పూర్తిగా ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ప్రస్తుతం ఉన్న 5-సీటర్ మోడల్ కంటే ఎక్కువ స్థలాన్ని, ప్రాక్టికాలిటీని ఇది అందిస్తుంది. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ 7-సీటర్ మోడల్ 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌లతో రావచ్చు. దీనికి మాన్యువల్, ఆటోమేటిక్, ఇ-సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు, వెనుక ప్రయాణీకుల కోసం ప్రత్యేక AC వెంట్‌లు, ఇతర సౌకర్యాలు ఇందులో లభించే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షల నుండి రూ. 27 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

Maruti s Invasion in SUV Market 4 New Cars Ready for Battle Each One Better Than the Last

3. మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ
మారుతి మరొక తురుపుముక్కగా మైక్రో ఎస్‌యూవీ నిలుస్తుంది. దీనికి కొత్త 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ శక్తినిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్/ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో జత చేయబడుతుంది. మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌లు ఇందులో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది, ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ, ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టాప్ వేరియంట్‌లలో 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

4. మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్ అనేది రాబోయే కాలంలో విడుదల కానున్న మరో ముఖ్యమైన ఎస్‌యూవీ. ఇందులో 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ (ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, రీజనరేటివ్ బ్రేకింగ్) ను జతచేస్తారు. మారుతి సొంతంగా అభివృద్ధి చేస్తున్న హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న మొదటి మోడల్ ఈ ఫ్రాంక్స్ హైబ్రిడ్ కావచ్చు.

ఈ కారు 30 నుండి 35 కిలోమీటర్ల వరకు అద్భుతమైన ఫ్యూయెల్ కెపాసిటీని అందిస్తుందని అంచనా. ఈ హైబ్రిడ్ సెటప్ మంచి టార్క్ డెలివరీ, తక్కువ కాలుష్యం, సిటీ, హైవే డ్రైవింగ్‌లో స్మూత్ యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. ఈ వాహనాల గురించిన పూర్తి వివరాలు వాటి విడుదల దగ్గర పడుతున్న కొద్దీ కంపెనీ వెల్లడించనుంది.

Article Published On: Friday, October 3, 2025, 11:15 [IST]
English summary
Marutis invasion in suv market 4 new cars ready for battle each one better than the last
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+