10 చక్రాలు కలిగిన యోధుడు.. శత్రువులు సైతం భయపడి పారిపోవాల్సిందే.. ఇంతకి ఇది ఎంటో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లను తయారు చేసే ప్రముఖ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్యాసింజర్ వాహనాలతో పటు ఇతర అవసరాలకు ఉపయోగపడే వాటిని కూడా తయారు చేస్తుంది. ప్రస్తుతం సైనిక వినియోగానికి ఉపయోగకరంగా ఉండే ఒక ట్రక్కును తయారు చేసినట్లు సమాచారం. ఇది చాలా శక్తివంతమైనదని, అన్ని వాతావరణ కఠిన పరిస్థితులను సులభంగా తట్టుకుని సైనికులకు అన్ని విధాలుగా సహాయకరంగా ఉంటుంది. ఈ ట్రక్కు పేరు మెర్సిడెస్ అరోక్స్ 4042 AS 6X6 (mercedes arocs 4042 as 6x6). ఈ శక్తివంతమైన ట్రక్కును మెర్సిడెస్ బెంజ్ అబుదాబిలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన అండ్ సమావేశంలో ప్రదర్శనకు ఉంచింది. ఇది కేవల సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్‌లో వివిధ కంపెనీలకు చెందిన సైనిక , సరిహద్దు భద్రతలో వాడే వాహనాలను, ఇతర పరికరాలను ప్రదర్శనకు ఉంచారు.
వాటి ప్రక్కన ఈ బెంజ్ ట్రక్కు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ చాలా కాలంగా దీని తయారీపై పని చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే లక్ష్యంతోనే ఈ ట్రక్కును రూపొందించి ప్రపంచానికి పరిచయం చేసింది. సరిహద్దు భద్రతలో, సహయక చర్యల సమయంలో, ఇది ఎలాంటి రాజీ పడకుండా అన్ని విధాలుగా సైనికులకు తోడ్పాటుగా ఉంటుంది. దీని ఇంజిన్ చాలా శక్తివంతమైనదని సమాచారం. ఆఫరోడ్‌లలో రయ్ మంటూ దూసుకుపోతుంది.

మోటార్1 నుంచి సమాచారం ప్రకారం, ఈ బెంజ్ ట్రక్కు ట్యాంకులను సైతం లాగ గలదు. పెద్ద వాహనాలను లాగడానికి దీనిలో ప్రత్యేకంగా డ్యూయల్ కేబుల్ వించ్‌ను అమర్చబడి ఉంటుంది. హెవీ-డ్యూటీ ఆఫ్-రోడ్ కోసం అవసరమైన అన్ని పరికరాలను దీనికి అమర్చారు. ఈ ట్రక్కు భారీ సైజుతో కనిపిస్తుంది. కొలతల విషయానికి వస్తే, 8.2 మీటర్లు పొడవు, 2.5 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది.
ఆఫ్‌రోడ్ ప్రయాణాల కోసం దీన్ని రూపొందించారు, కాబట్టి 4.2 మీటర్ల వీల్‌బేస్ ఉంది. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, శక్తివంతమైన 12.8-లీటర్ ఇన్‌లైన్-6 డీజిల్ మోటారును అమర్చారు. ఇది 416 HP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 12-స్పీడ్ పవర్‌షిఫ్ట్ 3 ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను దీనికి జోడించారు. ఈ ట్రక్కు 10 వీల్స్‌ను కలిగి ఉంటుంది. అన్నింటికి కూడా పవర్ అందుతుంది. ఇది 6X6 టెక్నాలజీని కలిగి ఉంది.

దీంతో అత్యంత కఠిన మార్గాల్లో కూడా ఈజీగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని డిజైన్ కూడా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఉంటుంది. ట్యాంకులను లాగే సమయంలో తన బలం మొత్తాన్ని కూడా ప్రదర్శిస్తుంది. రూపురేఖలు చాలా కఠినంగా ఉండటం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి మరి దీన్ని రూపొందించారు. టైర్లు కూడా చాలా బలంగా ఉంటాయి. రాళ్లపై నుంచి కూడా ఈజీగా ప్రయాణిస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ ఏం చెబుతుందంటే, ఈ ట్రక్కు ప్రజలను రక్షించడానికి సైనిక సిబ్బందికి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంటుంది. విపత్తుల సమయంలో సహాయక చర్యలతో పాటు సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రదర్శనకు ఉంది. అతి త్వరలోనే ఏదో ఒక దేశంలో తన సేవలు అందించనుంది. దీని పనితీరుతో శత్రువులను పారిపోయేలా చేస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








