అదిరిపోతున్న ఈ 7 సీటర్ కారును ఇక మర్చిపోండి! ఇది ఒక పాత జ్ఞాపకంగా గుర్తిండిపోతుంది!

భారత ఆటోమొబైల్ రంగంలో 7 సీటర్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రజల ప్రయాణ అలవాట్లలో వచ్చిన మార్పులు, ఎక్కువ మందితో సౌకర్యవంతమైన ప్రయాణ అవసరాలు ఈ సెగ్మెంట్‌కు భారీ ఊపునిచ్చాయి. ఒక కుటుంబం అంతా కలిసి ప్రయాణించగలగడం, పైగా అంతా కలిసి టూర్స్ లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం వలన ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లకు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. టయోటా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, వంటివి, మిడ్-సెగ్మెంట్ విభాగంలో మారుతీ ఎర్టిగా, కియా కారెన్స్, మహీంద్రా స్కార్పియో వంటి వాహనాలకు ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటి ధర, మైలేజ్, ఫీచర్ల కారణంగా సాధారణ గృహ వినియోగదారులకు కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి.

ఈ క్రమంలో లగ్జరీ వాహనాల విభాగంలో కూడా ఈ 7 సీట్ల ధోరణి పలు కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. మెర్సిడెస్-బెంజ్ వంటి బ్రాండ్లు ఇప్పుడు తాము రూపొందిస్తున్న కార్లలో ఎక్కువగా మూడు వరుసల సీట్లు కలిగిన మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు లేదా పెద్ద కుటుంబాలున్న వారే లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కుటుంబ పర్యటనలకైనా, షూటింగ్ లొకేషన్ పర్యటనలకైనా అద్భుతంగా సరిపోతాయి.

Mercedes Benz 7 Seater Suv Car Glb No Available In India

విశాలమైన ఇంటీరియర్, ఎక్కువ మంది కూర్చునేలా సీటింగ్, ఇవన్నీ కలిపి 7 సీటర్ కారు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అయితే ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, తన అత్యంత ప్రసిద్ధ మోడల్ 7 సీటర్ SUV అయిన GLB విక్రయాలను భారత మార్కెట్లో నిలిపివేసింది. ఈ మోడల్‌ను 2022 డిసెంబరులో భారతదేశంలో ప్రారంభించారు.

రెండు సంవత్సరాల పాటు మార్కెట్లో కొనసాగిన తర్వాత, ఇకపై ఇది కొనుగోలుకు అందుబాటులో ఉండదని సంస్థ స్పష్టం చేసింది. కానీ ఇదే సమయంలో మెర్సిడెస్ తమ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మరో ముందడుగు వేసింది. GLBకి ప్రత్యామ్నాయంగా, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన EQB SUVను మాత్రం మార్కెట్లో కొనసాగిస్తోంది. లగ్జరీ 7-సీట్ల విభాగంలో తన స్థానాన్ని బలపర్చడం కోసం ఈ మోడల్‌ను మాత్రం అమ్మకానికి అందుబాటులో ఉంచుతుంది.

Mercedes Benz Glb

దీని విలాసవంతమైన ఇంటీరియర్, మెర్సిడెస్‌కి బ్రాండ్, మూడు వరుసల సీటింగ్ ప్రత్యేకతలతో, ఇది ఒక మినీ ఇన్నోవా కంటే మెరుగైన అనుభూతిని అందించగలదు. మెర్సిడెస్-బెంజ్ GLB భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పుడు, ఇది సాధారణంగా లగ్జరీ SUV మార్కెట్లోని విలాసవంతమైన, మూడు వరుసల సీట్ల ఆప్షన్‌గా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్నికంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) ద్వారా అసెంబుల్ చేయలేదు.

దానికి బదులుగా, కంప్లీట్లీ బిల్ట్-అప్‌ను ఎంచుకుని దిగుమతి చేయాలని మెర్సిడెస్ ఎంచుకుంది. దీని ఫలితంగా, GLB కార్లను మెక్సికోలోని మెర్క్ ప్లాంట్‌లో తయారు చేసి, పూర్తిగా అమర్చిన రూపంలోనే భారతదేశానికి దిగుమతి చేసేవారు. దీంతో దేశీయంగా కారు ధర రూ.63.80 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమయి అత్యధికంగా రూ. 69.80 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు చేరింది.

Mercedes Benz 7 Seater Suv Car Glb No Longer Available In India

ఈ ధరల్లోనే GLB మోడల్, అదే సెగ్మెంట్‌లో ఉన్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కంటే దాదాపు రూ.7.60 లక్షల తక్కువ ధరకే అందుబాటులో ఉండేది. ఇది ఒక లగ్జరీ SUV కావడం, మూడు వరుసల సీట్ల సౌకర్యం ఉండటం వంటి ప్రత్యేకతలతో, మొదట్లో మంచి ఆసక్తిని పొందినట్లే కనిపించింది. GLB మూడు వేరియంట్లలో భారత మార్కెట్లో విడుదలైంది. ఇవి వినియోగదారులకు కావాల్సిన అన్నీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది.

ఇది GLB 200 ప్రోగ్రెసివ్, 220d 4MATIC, 220d AMG లైన్ 4MATIC అనే వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇవి ఇండియాలో 2022లో విడుదలయ్యాయి. రెండు సంవత్సరాలకు పైగా అమ్మకానికి ఉన్నాయి. దీంతో మెర్సిడెస్, దేశంలోని ఎంట్రీ-లెవల్ లగ్జరీ SUV మార్కెట్‌లో తన స్థానాన్ని బలపరచాలనుకుంది. అయితే, మార్కెట్లో ఉన్న పోటీతత్వం, ధరల కారణంగా, గణనీయమైన అమ్మకాలు సాధించలేకపోయింది. రెండు సంవత్సరాలకు ఉన్నప్పటికి GLB ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

7 Seater Suv Car Glb No Longer Available

ప్రారంభ సమయంలో ఉన్న డిమాండ్ తరువాత కాలంలో అది స్థిరంగా కొనసాగలేకపోవడమే మెర్సిడెస్ ఈ మోడల్‌ను నిలిపివేయడానికి ప్రధాన కారణం అయి ఉండొచ్చు. మెర్సిడెస్-బెంజ్ GLB మార్కెట్లో నుంచి తప్పుకున్నప్పటికీ, ఈ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా మరో మెడల్‌ను అందించాలనే ఉద్దేశంతో కంపెనీ సైలెంట్‌గా పనులు చేపట్టినట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన GLB 200 ప్రోగ్రెసివ్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఇది గరిష్టంగా 163 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిసి పని చేస్తూ, ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండేది. పవర్‌ఫుల్ ప్రదర్శనను అందించడంతో పాటు, సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. ఇక మరింత శక్తివంతమైన వేరియంట్ల విషయానికి వస్తే, GLB 220d 4MATIC, 220d AMG లైన్ 4MATIC ప్రత్యేకంగా నిలిచాయి.

వీటిలో ఉన్న 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 190 bhp పవర్, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఇవి ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమయ్యే వాహనాలు కావడంతో, అన్ని రకాల వాతావరణాల్లోనూ, మారుమూల రోడ్లపైనా కూడా సాఫీగా పరుగులు తీయగలుగుతాయి. ఈ డీజిల్ వేరియంట్లకు 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు.

ICE ‌తో వచ్చిన GLB SUVను మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో నిలిపివేసినప్పటికీ, ఆ లోటును భర్తీ చేయడానికి ఎలక్ట్రిక్ వేరియంటుతో భర్తీ చేసింది. అదే, మెర్సిడెస్ EQB. ఈ మోడల్ 2022 డిసెంబరులో భారత్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. అప్పటినుంచి ఇప్పటివరకు, ఇది దేశంలో లభ్యమవుతున్న అతికొద్ది 7 సీట్ల పూర్తి ఎలక్ట్రిక్ SUVల్లో ఒకటిగా నిలిచి, మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 22, 2025, 13:00 [IST]
English summary
Mercedes benz 7 seater suv car glb no longer available in india details
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+