పెట్రోల్, డీజిల్ అవసరమే లేని సరికొత్త కారు.. ఊహకందని అంచనాలతో మైమరపిస్తుంది.. ధర తెలిస్తే షాక్..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ (mercedes benz) ఇండియాలో అధునాతన సదుపాయాలతో కూడిన లగ్జరీ కార్లను విడుదల చేస్తూ, తన మార్కెట్‌ను భారీగా విస్తరించుకుంటుంది. దాదాపు కంపెనీ దేశీయంగా 30 ఏళ్లకు పైగా తన వాహనాలను ఇక్కడ సేల్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా అధునాతన ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తుంది. 2024 ఏడాదిలో కూడా భారతీయ వినియోగదారులకు మరింత చేరువ కావడానికి డజనకు పైగా లగ్జరీ కార్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త ఏడాదిలో కూడా మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి ప్రణాళికలు వేసింది. ఈ నేపథ్యంలో 2025 ప్రారంభంలోనే కంపెనీ ఈక్యూఎస్ (EQS 450) మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఒక ఎస్‌యూవీ (SUV). దీన్ని కంపెనీ రూ. 1.28 కోట్లకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది.

ఇంత ధర పెట్టి మధ్యతరగతి వినియోగదారులు మాత్రం కొనలేరు. ధనవంతులు కొనే విధంగా ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. దీనిలో ఐదు మంది కూర్చోని ప్రయాణించవచ్చు. EQS 450 SUVని వచ్చే వారం జరగనున్న ఇండియా ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ కారులొ శక్దివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి బ్యాటరీపై ప్రత్యేకంగా దృష్టిసారించి మెరుగైన దాన్ని అందించింది.

Mercedes Benz Luxury Car Eqs 450 Suv Launched

మెటార్ 355bhp పవర్, 800Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని వీల్స్‌కు కూడా పవర్ అందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఈ కారు దాదాపు 820 కిమీల వరకు ప్రయాణిస్తుంది. ఇది కేవలం 6.1 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది. దీన్ని టాప్ స్పీడ్‌ 210km/h గా ఉంది. 120kWh బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 200kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఇచ్చారు.

దీంతో కేవలం 31 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. బ్లాక్ కలర్‌లో ఉన్నటువంటి 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎయిర్‌మాటిక్ ఎయిర్ సస్పెన్షన్, 4-మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, LED టెయిల్ లైట్లు, వెనుక బంపర్‌పై సిల్వర్ ఎలిమెంట్స్ వంటివి ఉన్నాయి.

Mercedes Benz Luxury Car Eqs 450 Suv

లోపల అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, మెరుగైన డ్యాష్‌బోర్డ్‌, యాపిల్ కార్‌ప్లే వంటివి ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 5-స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, మల్టీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, ప్రయాణికుల రక్షణ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ , లెవెల్ 2 ADAS ఫంక్షన్, యాక్టివ్ స్టీరింగ్ , లేన్ కీపింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ EQS 450 SUVని కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ తాజాగా బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. కస్టమర్లకు డెలివరీలను ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో లగ్జరీ కారును కోరుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు.

Mercedes Benz Eqs 450 Suv Launched

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2025, 8:30 [IST]
English summary
Mercedes benz eqs 450 suv launched in india starting price at rs 1 28 crore
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+