ఇది ఇండియా బాస్.. లగ్జరీని కూడా బల్క్‌లో కొంటారు! పేద దేశం అని ఎవరైనా అంటే ఈ లెక్కలు చూపించాలి!
భారతదేశం ఆర్థికంగా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో బడ్జెట్ ధరలో లభించే కార్లను ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆదాయ స్థితిగతుల్లో మార్పులు రావటం కారణంగా చాలా మంది సమాజంలో హుందాగా కనిపించడానికి ఎక్కువగా ఖరీదైన లగ్జరీ కార్లను కొంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. దీనిని రుజువు చేస్తూ, లగ్జరీ కార్ల విభాగంలో ప్రముఖమైన బ్రాండ్ అయిన మెర్సిడెస్-బెంజ్ (mercedes benz) గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్రాండ్ సాధారణంగా ఖరీదైన, విలాసవంతమైన కార్లను మాత్రమే విక్రయిస్తుంది. అయినప్పటికీ, వీటి అమ్మకాలు ఆశ్చర్యకరమైన రీతిలో పెరగడం మన దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోందనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తుంది.
డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మెర్సిడెస్ బెంజ్ సంస్థ మొత్తం 18,928 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 4 శాతం ఎక్కువ కావగం గమనార్హం. ఇది రికార్డు స్థాయిలో అమ్మకాలు కావడమే కాకుండా, భారతదేశంలో విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ను కొరుకునే వారి సంఖ్య పెరుగుతుందని సూచిస్తుంది. దీన్ని బట్టి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి లైఫ్‌స్టైల్‌ను కోరుకునే దేశంగా మారుతుంది.

ప్రత్యేకించి మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరిగింది. . గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి పెరగడం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఎలక్ట్రిక్ మోడళ్ల అమ్మకాలు 2023-24తో పోలిస్తే ఏకంగా 51 శాతం అధికంగా నమోదవడం గమనార్హం. ఇది కేవలం అభివృద్ధిని సూచించడమే కాదు, భవిష్యత్తు వాహనాలపై ప్రజల నమ్మకాన్ని, వారి ఆసక్తిని కూడా తెలియజేస్తుంది.
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రత్యేకించి EQ టెక్నాలజీతో కూడిన G 580, మేబ్యాక్ నైట్ సిరీస్, EQS SUV, AMG G 63 మోడళ్లకు దేశవ్యాప్తంగా అమితమైన ఆదరణ లభించింది. ఈ మోడళ్లలో లభించే లేటెస్ట్ సదుపయాలు, లగ్జరీ డిజైన్, పవర్‌ఫుల్ పనితీరే ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మెర్సిడెస్-బెంజ్ లాంటి బ్రాండ్ నుంచి వచ్చే విలాసవంతమైన ఎలక్ట్రిక్ కార్లు కెపాసిటీలో ఇతర మోడళ్లకు బలమైన పోటీగా ఉంటాయి.

భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ లగ్జరీ కార్ల అమ్మకాల వృద్ధి చూసినవారిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. అత్యంత ఖరీదైన మోడళ్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎస్-క్లాస్, మెబ్యాక్ నైట్ సిరీస్, AMG G 63, EQS SUV లాంటి మోడళ్ల ధరలు సగటు వినియోగదారుల పరిధిలో ఉండకపోయినా, భారతీయులు వాటిని కొనుగోలు చేయడంలో వెనుకంజ వేయడం లేదు. ఇవి చూస్తుంటే, భారతదేశం ఇంకా పేద దేశమని కొందరు అనుకుంటున్న అభిప్రాయాన్ని తప్పు అని చెప్పవచ్చు.
ఇది కంపెనీకి ఒకవైపు గర్వకారణంగా నిలిస్తే, మరోవైపు అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌కు ఉన్న వినియోగ శక్తిని బయట ప్రపంచానికి చూపిస్తుంది. అత్యంత ఖరీదైన కార్లు మాత్రమే కాదు, ఎక్కువ మందిని ఆకర్షించే మోడళ్లకు కూడా భారీ ఆదరణ లభిస్తోంది. సీ-క్లాస్, ఇ-క్లాస్ LWB, జిఎల్‌సీ, జీఎల్‌ఇ మోడళ్లన్నీ ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లుగా నిలిచాయి.

ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ మోడల్ ఏదంటే LWP E-క్లాస్. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, రుచికరమైన లగ్జరీ డిజైన్, శక్తివంతమైన డ్రైవింగ్ వంటి అంశాల కారణంగా ఇది వినియోగదారులకు బాగా ఇష్టమైన మోడళ్లుగా ఉంది. ఈ మోడల్ ప్రారంభ ధర భారతదేశంలో రూ. 78.5 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.


Click it and Unblock the Notifications








