భారత్ పేద దేశం అని ఎవరు చెప్పారు? బెంజ్ కార్ల అమ్మకాలు చూస్తే మీకే అర్థం అవుతుంది

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes Benz India) ఇటీవలి కాలంలో తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటుంది. తాజాగా వచ్చిన సేల్స్ డేటా ప్రకారం, మెరుగైన ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ 2025 వరకు జరిగే మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,238 యూనిట్లను సేల్ చేసి దాని అమ్మకాల పరంగా అత్యుత్తమ Q1 ఫలితాన్ని నమోదు చేసింది. ఇది కేవలం ఏడాది ముందటి కాలంతో పోల్చితే 10.08 శాతం పెరుగుదల మాత్రమే కాదు, బ్రాండ్ నమ్మకంగా కొనసాగుతున్నదన్నదానికి స్పష్టమైన సంకేతం కూడా. ఈ కాలంలో కంపెనీ 3,850 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. క్రమంగా వినియోగదారులకు లగ్జరీ కార్లకు అలవాటు పడటం కారణంగా ధర ఎక్కువ అయిన కూడా బెంజ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే సమయంలో 2025 మొదటి అర్ధభాగంలో మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొత్తం 9,013 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో 9,262 యూనిట్లతో పోలిస్తే దాదాపు 2.69 శాతం తగ్గుదలగా నమోదైంది. దీనిని బట్టి, మెర్సిడెస్‌కు ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసికం మంచి బూస్ట్ ఇచ్చినప్పటికీ, మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు అమ్మకాలు కాస్త వెనుకబడ్డాయి. అయితే, తాజా అమ్మకాల వేగం చూస్తే బ్రాండ్ మళ్లీ పుంజుకోగలదన్న అంచనాలు మళ్లీ బలపడుతున్నాయి.

Mercedes Benz India Fy25 Sales

మార్కెట్ డిమాండ్, కొత్త మోడళ్లకు వచ్చిన ఆదరణ వంటి అంశాలు 2025 చివరి నాటికి మెర్సిడెస్‌ను మరోసారి గరిష్టాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెర్సిడెస్-బెంజ్ ఇండియా అత్యుత్తమ Q1 అమ్మకాలను నమోదు చేయడంలో, ఒక ప్రధాన కారణం, టాప్-ఎండ్ లగ్జరీ సెగ్మెంట్‌లో నమోదైన అసాధారణ వృద్ధి. ఈ విభాగంలో అమ్మకాలు ఏకంగా 20 శాతం పెరిగి, బ్రాండ్‌కు ప్రత్యేకంగా నిలిచాయి.

ఈ సెగ్మెంట్‌లో AMG సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్,EQS, S-క్లాస్ లైనప్ కీలక పాత్ర పోషించాయి. ప్రత్యేకంగా, EQ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడిన మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. మెర్సిడెస్-మేబ్యాక్ నైట్ సిరీస్, G 580, AMG G 63 వంటి వాహనాలు ప్రీమియం పూర్తిగా ఆకర్షించాయి. అంతేకాదు, శక్తివంతమైన స్పోర్ట్స్ కార్ AMG GT 63 PRO ఇప్పటికే ఈ సంవత్సరం మొత్తం సోల్డ్-అవుట్ అయింది.

Mercedes Benz 6 Months Sales Report

ఇంకొక ముఖ్యమైన అంశం C-క్లాస్, E-క్లాస్ LWB, GLC, GLE మోడళ్లకు మద్దతు లభించడంతో, ఈ సెగ్మెంట్ మొత్తం అమ్మకాలలో 60 శాతం వాటా ఇచ్చింది. అంతేకాకుండా, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం వృద్ధి. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది, E-క్లాస్ LWB. ఈ మోడల్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన E450 పెర్ఫార్మెన్స్ వేరియంట్. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ కారుగా నిలిచింది.

మెర్సిడెస్-బెంజ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, కేవలం తన లగ్జరీ ICE కార్లతోనే కాకుండా, ఎలక్ట్రిక్ విభాగంలోనూ విశేషమైన పురోగతిని సాధించింది. ఈ పోర్ట్‌ఫోలియో ఈ కాలంలో 157 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఇది కంపెనీ మొత్తం అమ్మకాలలో 8 శాతం వాటా అందించగలిగింది, అంటే EV లగ్జరీ సెగ్మెంట్‌లో కూడా మెర్సిడెస్ బలంగా నిలిచింది.

Mercedes Benz Sales Report

ఎలక్ట్రిక్ విభాగంలో G 580 (EQ టెక్‌), EQS 450 SUV, EQS మేబ్యాక్ మోడళ్లన్నీ కీలకంగా నిలిచాయి. మార్కెట్లో ఎన్నో ఈవీ కార్లు వస్తున్నప్పటికి తమ ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు, EV లగ్జరీ అనుభవంతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. కొన్ని ఈవీలకు ఏకంగా 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీన్ని బట్టి మెర్సిడెస్-బెంజ్‌కు ఈవీ విభాగంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం అవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 12, 2025, 16:41 [IST]
English summary
Mercedes benz india recorded 4238 sale units in q1 fy25 26 details
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+