కొన్ని కలలు కొందరికే సాకారం అవుతాయి! ఈ స్టైలీష్ కారును మీరు సొంతం చేసుకుంటే అదృష్టవంతులే!
లగ్జరీ కార్ల విభాగంలో తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న మెర్సిడెస్-బెంజ్ (mercedes benz), భారత మార్కెట్‌ను ఉద్దేశించి మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. 'మెర్సిడెస్-AMG G63 కలెక్టర్స్ ఎడిషన్ (Mercedes AMG G63 collectors-edition)' పేరుతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ భారతీయ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు రూపొందించబడింది. బెంజ్ ఈ ఎడిషన్‌ను కేవలం 30 యూనిట్లకే పరిమితం చేసింది. దీని ఎక్స్‌టీరియర్ విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ద చూపెట్టింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కలర్స్, డిజైన్ టచ్‌తో ఈ కారు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మెర్సిడెస్ ఈ G63 కలెక్టర్స్ ఎడిషన్‌ను రూ.4.3 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంత ధర పెట్టి మధ్య తరగతి వినియోగదారులు కొనడం చాలా తక్కువ. పెద్ద వ్యాపారస్తులు, ధనవంతులు, సెలబ్రిటీలు మొదలగు వారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మెర్సిడెస్-AMG G63 'కలెక్టర్స్ ఎడిషన్' లోపల ఓ ప్రత్యేకమైన లగ్జరీ అనుభూతిని కలిగిస్తుంది. కారు క్యాబిన్ భాగాన్ని కాటలానా లేత గోధుమరంగు, నలుపు రంగుల డ్యూయల్-టోన్ కలయికలో రూపొందించారు. ఇది నప్పా లెథర్‌తో మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక డిజైన్, వినియోగదారులను లగ్జరీ అనుభూతికి మరింత దగ్గర చేస్తుంది. పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ కారు అత్యంత శక్తివంతమైన 4.0 లీటర్ V8 ట్విన్ టర్బో ఇంజిన్‌తో నడుస్తుంది.

ఇది 430 కిలోవాట్ల శక్తిని, 850 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనితో పాటు, అదనంగా 15 కిలోవాట్ల హైబ్రిడ్ శక్తిని అందిస్తుంది. ఈ ఇంజిన్ 48-వోల్ట్ ఆన్-బోర్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG)తో వస్తుంది. ఈ G63 కేవలం 4.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 240 కి.మీలుగా ఉంటుంది.
ఈ ఇంజిన్ 9-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడింది. మెర్సిడెస్-AMG G63 కలెక్టర్స్ ఎడిషన్ లోపల ఉన్న ఆప్షన్లు కారును మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా, ప్రీమియంగా మార్చేస్తాయి. కారులో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి డాష్‌బోర్డ్‌పై డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఈ డిస్ప్లేలు ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌గా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌గా పనిచేస్తాయి.

వీటిలో సంస్థ తీసుకొచ్చిన తాజా MBUX NTG7 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేకతగా నిలుస్తుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకు మద్దతునిచ్చేలా రూపొందించబడింది. అలాగే USB-C పోర్ట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్, టచ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. కారులో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 18-స్పీకర్ బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇంకా 360 డిగ్రీ కెమెరా సహాయంతో పార్కింగ్, మల్టీ-యాంగిల్ వీక్షణ వంటివి ఉన్నాయి.
ఆఫ్-రోడింగ్ ప్రేమికుల కోసం, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో ప్రత్యేకంగా కొత్త ఆఫ్-రోడ్ కాక్‌పిట్ డిస్‌ప్లే కూడా అందించబడింది. ఇది డ్రైవర్‌కు ట్రాక్ పరిస్థితులపై మరింత స్పష్టతనిచ్చి, కంట్రోల్‌ను మెరుగుపరుస్తుంది. పనితీరు పరంగా, ఈ కలెక్టర్స్ ఎడిషన్ యాంత్రికంగా స్టాండర్డ్ AMG G63కి సమానమే. కానీ, ఇది పొందే టెక్నాలజీ, ప్రత్యేకతలు దానిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

మెర్సిడెస్-AMG G63 'కలెక్టర్స్ ఎడిషన్' బుకింగ్‌లు జూన్ 12 నుంచే అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ కారును ఆసక్తిగల కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది సాధారణ విక్రయంగా కాకుండా, ప్రత్యేకంగా ఎంపికైన టాప్-ఎండ్ మెర్సిడెస్ కస్టమర్లకు మాత్రమే లభ్యమవుతుందని కంపెనీ స్పష్టంగా తెలిపింది. కారుకు సంబంధించి 2025 నాల్గవ త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అంటే, బుకింగ్ చేసుకున్న వారు ఈ సంవత్సరాంతానికి తమ కారును అందుకోనున్నారు.


Click it and Unblock the Notifications








