కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ఈ కారు కొనడం కష్టం! ధర కేవలం రూ.2.9 కోట్లు మాత్రమే

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ (Mercedes Benz) ఎప్పుడూ తన ప్రత్యేకమైన డిజైన్‌, ఇంజనీరింగ్‌, లగ్జరీ ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. భారత మార్కెట్లో కూడా ఈ బ్రాండ్‌కి ఉన్న క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మెర్సిడెస్ మరో మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది, అదే మెర్సిడెస్ బెంజ్ జీ 450డీ (Mercedes-Benz G 450d), ఇది ప్రసిద్ధమైన G-Class సిరీస్‌లో తాజా డీజిల్ వేరియంట్‌గా నిలుస్తోంది. ఈ కొత్త SUV ధరను కంపెనీ రూ.2.9 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ప్రకటించింది. ధర ఎక్కువగానే ఉన్నా, దానికి తగ్గ లగ్జరీ, పవర్‌, టెక్నాలజీని ఈ కారు అందిస్తుంది. G-Class అంటేనే బలం, ప్రీమియం లుక్‌, ఆఫ్‌రోడ్ సామర్థ్యం కలిగిన SUV అని చెప్పొచ్చు.

ఇప్పుడు విడుదలైన ఈ G 450d మోడల్ కూడా ఆ ట్రెడిషన్‌ను కొనసాగిస్తూ, మరింత ఆధునికతను జోడించింది. భారత మార్కెట్ కోసం మెర్సిడెస్ ఈ వాహనాన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. మొదటి దశలో కేవలం 50 యూనిట్లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. అంటే, ఈ కారును కొనుగోలు చేసే వారు నిజంగానే అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఇది కేవలం వాహనం మాత్రమే కాదు, ఒక ప్రతిష్టాత్మక చిహ్నం లాంటిది.

Mercedes Benz New Car G450 D Launched In India At Rs 2 9 Crore Details

కొత్త మెర్సిడెస్-బెంజ్ G 450d కేవలం లగ్జరీ, స్టైల్‌కే కాకుండా, సామర్థ్యంతో కూడా ప్రత్యేకతను చాటుతోంది. ఈ SUV మొదటి బ్యాచ్‌గా 50 యూనిట్లు జర్మనీ నుండి నేరుగా దిగుమతి చేయబడుతున్నాయి. అంటే, ఇది పూర్తిగా మేడ్ ఇన్ జర్మనీ క్వాలిటీతో భారత రోడ్లపైకి అడుగుపెడుతోంది. ఈ కొత్త మోడల్‌లో 3.0-లీటర్ ఇన్‌లైన్-సిక్స్ టర్బోచార్జ్డ్ డీజిల్ గెలాండేవాగన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

ఇది పవర్ డెలివరీని మరింత సమర్థవంతంగా మార్చి, ఫ్యూయల్ ఎఫిషియెన్సీని మెరుగుపరుస్తుంది. ఈ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 362bhp పవర్, 750Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు శక్తిని పంపుతుంది, అంటే దీని AWD సిస్టమ్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫలితంగా, ఇది హైవేల్లో గానీ, పర్వత మార్గాల్లో గానీ, లేదా కఠినమైన ఆఫ్‌రోడ్ ట్రాక్‌లో మెరుగైన ట్రాక్షన్‌ను అందిస్తుంది.

Mercedes Benz New Car G450 D Launched In India At Rs 2 9 Crore Details

పర్ఫార్మెన్స్ పరంగా, G 450d కేవలం 5.8 సెకన్లలో 0 నుండి 100 kmph వేగం అందుకుంటుంది. ఇది ఒక భారీ లగ్జరీ SUVకి నిజంగా ఆశ్చర్యకరమైన స్పీడ్‌. దీని గరిష్ట వేగం 210 kmph. ఇంత పవర్ ఉన్నప్పటికీ, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. సగటున 9 kmpl మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ 100 లీటర్లు. కాబట్టి దూర ప్రయాణాల్లో రీఫ్యూయల్ అవసరం లేకుండా చేస్తుంది.

కొత్త మెర్సిడెస్-బెంజ్ G 450d లగ్జరీ SUV కేవలం శక్తివంతమైన ఇంజిన్‌తోనే కాకుండా, తన ఇంటీరియ్ డిజైన్, ఫీచర్లతో కూడా ఆకట్టుకుంటుంది. ఈ కారులో 5 సీట్ల సీటింగ్ ఆప్షన్ లభిస్తుంది, ప్రతి సీటు కూడా ప్రీమియం లెదర్ క్వాలిటీతో రూపొందించబడింది. కారు లోపల డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు ఉన్నాయి. ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం.

Mercedes Benz New Car G450 D Launched In India At Rs 2 9 Crore Details

అలాగే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్‌ను కలిగి ఉంది, దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫీచర్లను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ అందించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో యాంబియంట్ లైటింగ్ క్యాబిన్‌లో రాయల్టీ ఫీల్‌ కలిగిస్తుంది. వీటితో పాటు మరిన్ని అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 14, 2025, 11:06 [IST]
English summary
Mercedes benz new car g450 d launched in india at rs 2 9 crore details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+