లక్షల మంది భారతీయుల హృదయాలను తాకిన మెర్సిడెస్-బెంజ్.. భారత రోడ్లపై బెంజ్ బ్లాస్ట్

భారతదేశంలో లగ్జరీ కార్ల విభాగంలో ప్రసిద్ద కంపెనీ మెర్సిడెస్-బెంజ్, మరో చారిత్రాత్మక ఘట్టాన్ని సాధించింది. సంస్థ పూణే సమీపంలోని చకన్ తయారీ యూనిట్ నుంచి 2,00,000వ కారును విడుదల చేసి, దేశీయంగా ఒక ముఖ్యమైన మైలురాయిని దాటింది. ఈ ముఖ్యమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకుంటూ, మెర్సిడెస్-బెంజ్ గ్రూప్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఉత్పత్తి, నాణ్యత, సరఫరా గొలుసు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జార్జ్ బెర్గర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా 200,000వ కారు మెర్సిడెస్-బెంజ్ EQS SUV ని అధికారికంగా విడుదల చేశారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, దేశీయ ఉత్పత్తిలో మెర్సిడెస్ భారత మార్కెట్‌పై పెట్టుకున్న నమ్మకానికి, అలాగే లగ్జరీ సెగ్మెంట్ వినియోగదారులు మద్దతుగా నిలిచినట్లయింది.

EQS SUV విడుదల మరింత ప్రత్యేకంగా మారడానికీ ఇదే కారణం. ఇది మెర్సిడెస్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రతిష్టాత్మకమైన మోడల్‌గా నిలుస్తోంది. సంస్థ దేశీయంగా తన ప్రయాణాన్ని 1995లో ప్రారంభించినప్పటికీ, మొదటి 50,000 కార్ల అమ్మకాల కోసం దాదాపు 19 సంవత్సరాలు (1995-2014) పట్టింది. తర్వాత దాదాపు అదే సంఖ్య కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి కావడం విశేషం. 2015 నుంచి 2025 మధ్య దశాబ్దంలో 1,50,000 కార్లు అమ్ముడయ్యాయి.

Mercedes Benz Made In India Car Milestone

ఈ గణంకాలన్నీ కూడా భారతీయ మార్కెట్‌లో మెర్సిడెస్-బెంజ్ ప్రాముఖ్యతను, అలాగే వినియోగదారుల నమ్మకాన్ని చాటుతుంది. అంతేకాక, గత రెండు సంవత్సరాల్లోనే 50,000 కార్లను ఉత్పత్తి చేయడం సంస్థ ఉత్పాదక సామర్థ్యం ఎంతగా పెరిగిందో తెలుస్తుంది. ఇది కంపెనీ గ్లోబల్ ప్రమాణాలకు తగ్గట్లు భారతదేశంలో తయారీని పెంచేందుకు తీసుకున్న కఠినమైన చర్యలకు నిదర్శనగా చెప్పవచ్చు. కంపెనీ 2015లో మెర్సిడెస్-మేబ్యాక్ S500 మోడల్‌ను జర్మనీలో కాకుండా తొలిసారిగా భారతదేశంలో తయారు చేసింది.

ఇది దేశీయ తయారీ రంగానికి గర్వకారణం మాత్రమే కాదు, భారత తయారీ నైపుణ్యానికి మెర్సిడెస్ వంటి ప్రీమియం బ్రాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెర్సిడెస్-బెంజ్ భారత్‌ను కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గానే కాకుండా, ఓ నమ్మకమైన తయారీ కేంద్రంగా కూడా మార్చింది. ఈ మైలురాయి భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్‌ను మరింత వేగవంతం చేసింది. పూణేలోని చకన్ ఉత్పత్తి కేంద్రం మెర్సిడెస్-బెంజ్‌కి కీలక తయారీ స్థావరం.

Mercedes Benz Rolled Out 200000th Made In India

ఇది ఇప్పుడు లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల(EV) తయారీలోనూ అగ్రగామిగా మారింది. 2022లో EQS 580 సెడాన్‌ను దేశీయంగా తయారు చేయడం ద్వారా, మెర్సిడెస్ భారత్‌లో BEV విభాగంలో తన తొలిసారిగా అడుగు పెట్టింది. అదే ఏడాది EQS 580 SUV ఉత్పత్తిని కూడా భారత్‌లో ప్రారంభించి, రెండు ఎలక్ట్రిక్ వాహనాలను స్థానికీకరించిన తొలి లగ్జరీ కార్ బ్రాండ్‌గా ఘనతను సాధించింది. దీని ద్వారా మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్‌లో బలంగా నిలిచింది.

ప్రస్తుతం ఈ బ్రాండ్ భారత్‌లో 11 స్థానికంగా తయారు చేసిన లగ్జరీ కార్లను వినియోగదారులకు అందిస్తోంది. ఇది 'మేడ్ ఇన్ ఇండియా' అనుగుణంగా వాహనాలను విడుదల చేస్తుంది. ఇతర లగ్జరీ ఆటోమేకర్లతో పోల్చితే, మెర్సిడెస్-బెంజ్ భారత్‌లో అత్యధిక పెట్టుబడిని పెట్టిన సంస్థగా నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థ, 2024లో అదనంగా రూ.200 కోట్లు వెచ్చిస్తూ తన స్థిరమైన వృద్ధి లక్ష్యాలను వెల్లడిస్తోంది.

Mercedes Benz Rolled Out 200000th Made In India Car Milestone

ఈ పెట్టుబడులు కేవలం తయారీ సామర్థ్యాల కోసం కాకుండా, దేశీయంగా అధిక విలువ జోడించే ఉత్పత్తుల అభివృద్ధికి కూడా నిదర్శనం. మెర్సిడెస్-బెంజ్ ఇండియా సాధించిన ఈ తయారీ మైలురాయి, దేశీయ లగ్జరీ కార్ల రంగంలో ఇప్పటివరకు నమోదు అయిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ 50కి పైగా నగరాల్లో 100కు మించి ఉన్న లగ్జరీ టచ్‌పాయింట్లతో దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 16, 2025, 13:20 [IST]
English summary
Mercedes benz rolled out 200000th made in india car milestone more details check here
Read more on: #mercedes benz #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+