కారు లాంచ్ చేసేందుకు రోమ్ వెళ్లిన కంపెనీ.. ఇంత టెక్నాలజీ ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు
ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ తన కొత్త కార్ మోడల్‌ను విడుదల చేసేందుకు రోమ్కు వెళ్లింది. మరదేదో కంపెనీ కాదు మెర్సిడెస్ బెంజ్. ఇది సీఎల్ఏ అనే లగ్జరీ కారు మోడల్ ను విడుదల చేసింది. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కారు మోడల్‌గా కంపెనీ దీనిని రూపొందించింది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ కారులో లేని ఫీచర్లను ఈ మోడల్ లో అందించింది. బెంజ్ ఈ కారులో AI టెక్నాలజీని అందించింది.
కారు ప్రియుల కోసం వారు కోరుకునే, ఆశ్చర్యపడే విధంగా దీనిని రూపొందించారు. ఇది మాత్రమే కాకుండా, మెర్సిడెస్-బెంజ్ కొత్త CLA లగ్జరీ కారులో అనేక ఇతర అద్భుతమైన ఫీచర్లను కూడా అందించింది. ఈ కారు త్వరలో ప్రపంచ లగ్జరీ కార్ల మార్కెట్లో విక్రయాలకు రాబోతుంది. వారు దీనికి ముందే ఈ కారును రోమ్‌లో విడుదల చేశారు. ఈ కారు లాంచ్ కార్యక్రమానికి అనేక మంది ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు.

రోమియో బెక్‌హామ్, కెమిలా కాబెల్లో, ఐస్ స్పైస్, ఆసాఫ్ నాస్ట్ లాంటి అనేక మంది ఇతరులు హాజరయ్యారు. అలాగే, అక్కడ కొన్ని ఆసక్తికరమైన ప్రదర్శనలు కూడా జరిగాయి. దక్షిణాఫ్రికా గాయని టైలా కచేరీ కూడా అక్కడ జరిగింది. ఇంత గొప్ప వేడుకల మధ్య మెర్సిడెస్-బెంజ్ తన CLA లగ్జరీ కారును విడుదల చేసింది.
మెర్సిడెస్-బెంజ్ ఈ కారును రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి హైబ్రిడ్ వెర్షన్, ఎలక్ట్రిక్ వెర్షన్. రెండూ ఎక్స్ టర్నల్ గా చూస్తే ఒకేలా ఉంటాయి. అంటే వారు ఈ కారును చాలా స్టైలిష్ గా తయారు చేశారని అర్థం అవుతుంది. అవి చాలా వాలుగా ఉండే రూఫ్, డోర్లకు పర్ ఫెక్ట్ గా సరిపోయే డోర్ హ్యాండిల్స్, ఫ్రేమ్ లెస్ విండోస్, కారు దిగువ భాగంలో డెకరేటివ్ లైన్స్ అందిస్తాయి.

మరీ ముఖ్యంగా కంపెనీ కారుకు ఫ్రంట్, బ్యాక్ స్పెషల్ LED లైట్లను అందించింది. ఈ కారు అందాన్ని మరింత పెంచేందుకు 17 ఇంచుల అలాయ్స్ నుంచి19 ఇంచుల అలాయ్స్ వరకు వీల్ ఆఫ్షన్లను అందించింది. అదే విధంగా దాని లోపలి భాగంలో మూడు రకాల స్క్రీన్లు అందించింది. 14.6-అంగుళాల స్క్రీన్, 14-అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్ , 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ అందించారు.
దీని ప్రత్యేకతలలో మెత్తటి సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ముందు, వెనుక రెండు వైపులా స్టోరేజ్ కెపాసిటీలు అందించారు. అయితే, హైబ్రిడ్ వెర్షన్ బ్యాక్ లో మాత్రమే స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటాయి. దీని హైబ్రిడ్ వెర్షన్ 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ మోటారును ఉపయోగిస్తుంది. ఈ మోటారుతో పాటు వారు 48-వోల్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని అందిస్తున్నారు.

ఇది 27 BHP మోటారు, 1.3 kWh ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. దీని పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ రెండు వేర్వేరు ఆఫ్షన్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆ ఆఫ్షన్లు సింగిల్ మోటార్, రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్. సింగిల్-మోటార్ ఆప్షన్ గరిష్టంగా 268 బిహెచ్‌పి పవర్, 335 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 792 కి.మీ వరకు ప్రయాణించగలదు.
ఇందులో డ్యూయల్-మోటార్ వెర్షన్ పూర్తిగా ఛార్జ్ చేస్తే 771 కి.మీ రేంజ్ అందజేస్తుంది. ఇది గరిష్టంగా 350 బిహెచ్‌పిల పవర్, 515 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లు రెండూ అంత ఎట్రాక్టివ్ గా లేవు. అదే సమయంలో, రెండింటి మధ్య స్వల్ప తేడాను చూడవచ్చు. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో బ్యాడ్జ్, గ్రిల్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ-కార్ వెర్షన్‌లో ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంటుందని గమనించాలి.


Click it and Unblock the Notifications








