ఈ కారులో వెళ్తుంటే స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంటుంది.. ఎక్కారంటే దిగాలనిపించదు

లగ్జరీ కార్లకు పేరుగాంచిన జర్మన్ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా భారత మార్కెట్‌లో తన కొత్త మోడల్ జీఎల్ఎస్ ఏఎంజీ లైన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.40 కోట్ల నుంచి రూ.1.43 కోట్ల వరకు ఉంటుంది. కంపెనీ దీనిని జీఎల్ఎస్ 450 ఏఎంజీ లైన్, జీఎల్ఎస్ 450డి ఏఎంజీ లైన్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది.

ఇది జర్మన్ బ్రాండ్ అత్యధికంగా అమ్ముడవుతున్న లార్జ్ సైజ్ లగ్జరీ ఎస్‌యూవీ. దీని భారత మార్కెట్లో ఇప్పటికే 16,000 కు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ డిజైన్ ప్రతిష్టాత్మకమైన జీ-క్లాస్ నుండి ఇన్ స్పైర్ అయింది. అయితే ఏఎంజీ ఎలిమెంట్స్ దీనిని మరింత స్పోర్టీగా, స్పెషల్‎గా చేస్తాయి.

Mercedes GLS AMG Line

ఏఎంజీ ఫ్రంట్ ఏప్రాన్‌తో, జీఎల్ఎస్ ఏఎంజీ లైన్‌లో ముందు భాగంలో స్పోర్టీ, స్పెషల్ ఎయిర్ ఇన్‌లెట్‌లు కూడా ఉన్నాయి. ముందు, వెనుక వింగ్ ఫ్లేర్స్‌లో ఏఎంజీ సైడ్ సిల్ ప్యానెల్స్‌తో పాటు బాడీ-కలర్ ఫినిష్ లభిస్తుంది. వెనుక వింగ్‌పై ఉన్న ఎయిర్ అవుట్‌లెట్స్, డిఫ్యూజర్-లుక్ ఉన్న ఏఎంజీ రియర్ ఏప్రాన్,క్రోమ్ ట్రిమ్ స్ట్రిప్‌తో డిజైన్‌ను కంప్లీట్ చేశారు.

లోపలి భాగంలో నప్పా లెదర్‌తో తయారు చేసిన మల్టీఫంక్షన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, బ్లాక్ రబ్బర్ స్టడ్‌లతో ఉన్న బ్రష్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఏఎంజీ స్పోర్ట్స్ పెడల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ నలుపు రంగులో ఉంటుంది. దీనికి 3-ట్విన్-స్పోక్ డిజైన్లో బ్లాక్ కలర్ టాప్‌స్టిచింగ్ ఇచ్చారు. ఈ హై-పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ముందు ఆక్సిల్‌పై పెద్ద రంధ్రాలున్న డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. వీటిపై మెర్సిడెస్-బెంజ్ లెటర్స్ చెక్కబడి ఉంటాయి.

Mercedes GLS AMG Line

జీఎల్ఎస్ ఏఎంజీ లైన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 3.0 లీటర్ 6-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 375 bhp పవర్, 500 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో కూడా 3.0 లీటర్ 6-సిలిండర్ ఇంజిన్ ఉంది.

ఇది 362 bhp పవర్, 750 Nm ఉత్పత్తి చేస్తుంది. రెండు వెర్షన్లు 9-స్పీడ్ 9G-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడ్డాయి. ఈ రెండు కార్లు 6.1 సెకండ్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటాయి. హయ్యెస్ట్ స్పీడ్ 250 కి.మీ/గం.

Mercedes GLS AMG Line

కారు లోపలి భాగంలో గేర్‌షిఫ్ట్ పెడల్స్, టచ్ కంట్రోల్ ప్యానెల్, నప్పా లెదర్‌తో తయారు చేసిన ఎయిర్‌బ్యాగ్ కవర్, AMG అక్షరాలున్న బ్లాక్ ఫ్లోర్ మ్యాట్లు, సిల్వర్ క్రోమ్‌తో తయారు చేసిన స్టీరింగ్ వీల్ ట్రిమ్ వంటివి ఉన్నాయి. మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ ఏఎంజీ లైన్‌ను ఏఎంజీ నైట్ ప్యాకేజీతో కూడా తీసుకోవచ్చు.

ఇందులో 21-అంగుళాల ఏఎంజీ అల్లాయ్ వీల్స్, డార్క్ క్రోమ్‌లో 4-స్లాట్ రేడియేటర్ గ్రిల్, ఏఎంజీ ఫ్రంట్, రియర్ ఏప్రాన్‌లో ట్రిమ్ స్ట్రిప్, మ్యాట్ బ్లాక్ ఫినిష్ రూఫ్ రెయిల్స్ ఉన్నాయి. కారు లాంచ్ సందర్భంగా మెర్సిడెస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారతదేశంలో 4,238 యూనిట్లను విక్రయించి తమ చరిత్రలోనే అత్యుత్తమ త్రైమాసిక అమ్మకాలను నమోదు చేసినట్లు ప్రకటించింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ ఏఎంజీ లైన్ అనేది లగ్జరీ, పర్ఫార్మెన్స్, స్టైల్ కలగలిసిన ఒక అద్భుతమైన ప్యాకేజీ. ఏఎంజీ డిజైన్ ఎలిమెంట్స్, శక్తివంతమైన ఇంజిన్లు, విలాసవంతమైన ఇంటీరియర్‌తో ఈ ఎస్‌యూవీ లగ్జరీ కార్ల ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అమ్మకాలలో కంపెనీ సాధించిన రికార్డు కూడా దాని మార్కెట్ పట్టును సూచిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 12, 2025, 10:52 [IST]
English summary
Mercedes gls amg line enters india price starts from rs 1 40 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+