మెర్సిడెస్ సృష్టించిన వింత..కొండలను పిండి చేసే రాక్షసుడికి..ఇంద్రభవనం లాంటి లగ్జరీ టచ్
ఆఫ్-రోడ్ వాహనాల ప్రపంచంలో మెర్సిడెస్ బెన్స్ యూనిమొగ్ (Mercedes-Benz Unimog) అనేది ఒక సాటిలేని లెజెండ్. కొండలు, కోనలు, బురద, ఇసుక.. ఇలాంటి కఠినమైన భూభాగాలనైనా లెక్కచేయకుండా దూసుకుపోయే ఈ భారీ వాహనానికి సుమారు 80 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సాధారణంగా సైన్యంలో, అటవీ శాఖలో లేదా అత్యంత క్లిష్టమైన పారిశ్రామిక పనుల కోసం ఒక మొరటు వాహనంగా వాడే ఈ మృగాన్ని, ఇప్పుడు మెర్సిడెస్ ఒక విలాసవంతమైన మహారాజులా మార్చి ప్రపంచానికి పరిచయం చేసింది.
యూనిమొగ్ 80వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ లగ్జరీ ఎడిషన్, సంప్రదాయ పనులకు మాత్రమే పరిమితం కాకుండా, అత్యంత విలాసవంతమైన సాహసయాత్రలకు కూడా ఇది సరైన జోడి అని నిరూపిస్తోంది. సాంకేతిక బలం, సౌకర్యాల కలయిక ఈ ఆడంబరపు యూనిమొగ్‌ను మెర్సిడెస్ బెన్స్ సంస్థ హెల్గెత్ ఇంజనీరింగ్ (Helgeth Engineering) భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది.

ఈ వాహనం స్పెషాలిటీ ఏమిటంటే, దీని పాతకాలపు మెకానికల్ పటిష్టతను ఏమాత్రం తగ్గించకుండానే, లోపల మాత్రం హైటెక్ లగ్జరీ అనుభవాన్ని జోడించారు. ఒకప్పుడు కేవలం పనిముట్టులా భావించిన ఈ వాహనంలో ఇప్పుడు ప్రీమియం సీట్లు, యాంబియెంట్ లైటింగ్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు చోటు చేసుకున్నాయి. పోర్టల్ ఆక్సిల్స్, ఎంచుకోదగిన ఆల్-వీల్ డ్రైవ్, లాకింగ్ డిఫరెన్షియల్స్ వంటి ఫీచర్లు దీని ఆఫ్-రోడ్ శక్తిని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.
శక్తివంతమైన ఇంజిన్, గంభీరమైన డిజైన్ ఈ లగ్జరీ యూనిమొగ్‌లో మెర్సిడెస్ బెన్స్ శక్తివంతమైన OM 936 ఆరు-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది దాదాపు 300 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ, ఎంతటి లోతైన గుంతలనైనా, ఎత్తైన కొండలనైనా అలవోకగా అధిగమిస్తుంది. దీని ఎక్సటీరియర్ విషయానికి వస్తే, మ్యాట్ గ్రే పెయింట్ ఫినిషింగ్‌తో ఇది అత్యంత మోడ్రన్‌గా, గంభీరంగా కనిపిస్తుంది.

దీనికి అమర్చిన 20-అంగుళాల భారీ అల్యూమినియం బీడ్‌లాక్ వీల్స్, అత్యంత కఠినమైన ఆఫ్-రోడ్ ప్రయాణాల్లో కూడా వాహనాన్ని స్థిరంగా ఉంచి, ప్రయాణికులకు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయి. అత్యాధునిక డ్రైవింగ్ టెక్నాలజీ ఈ కొత్త మోడల్‌లో డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికపరంగా పెద్ద మార్పులే చేశారు.
సాధారణ సైడ్ మిర్రర్లకు బదులుగా, ఇందులో మెర్సిడెస్ డిజిటల్ మిర్రర్‌క్యామ్ (Digital MirrorCam) సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనం చుట్టూ ఉన్న బ్లైండ్ స్పాట్‌లను తొలగించి, డ్రైవర్‌కు అత్యంత క్లియర్ విజిబిలిటీని అందిస్తాయి. దీనివల్ల ఇరుకైన అటవీ దారుల్లో లేదా కొండ ప్రాంతాల్లో ఈ భారీ వాహనాన్ని నడపడం చాలా సులభం అవుతుంది.

ముందు, వెనుక భాగాలలో అమర్చిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు చీకటి సమయాల్లో కూడా పగటిపూట లాంటి వెలుతురును అందిస్తూ, వాహనానికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే ఇంటీరియర్ యూనిమొగ్ లోపలి భాగాన్ని చూస్తే, ఇది ఒక యుద్ధ విమానం లేదా లగ్జరీ ఎస్‌యూవీ లోపల ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది.
దీనిని డబుల్-క్యాబ్ డిజైన్‌లో రూపొందించడం వల్ల నలుగురు ప్రయాణికులు అత్యంత విలాసవంతంగా ప్రయాణించవచ్చు. లోపల వాడిన హై-క్వాలిటీ లెదర్ సీట్లు, ప్రత్యేకమైన స్టిచ్చింగ్ మరియు లెదర్ ఫ్లోర్ మ్యాట్‌లు అత్యంత ప్రీమియం అనుభవాన్ని ఇస్తాయి. రాత్రిపూట ప్రయాణాల్లో క్యాబిన్ అంతటా వెలిగే యాంబియెంట్ ఎల్‌ఈడీ లైటింగ్, ప్రయాణికులకు ఒక విలక్షణమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఒకప్పుడు కేవలం డ్యూటీ కోసం వాడిన ఈ వాహనం, ఇప్పుడు ధనవంతుల లాంగ్ టూర్లకు, లగ్జరీ క్యాంపింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. ఈ లగ్జరీ యూనిమొగ్ ఆవిష్కరణతో, మెర్సిడెస్ బెన్స్ ఆఫ్-రోడ్ వాహనాల విభాగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. పవర్, లగ్జరీ ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో ఈ వాహనం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








