మైలేజ్‌లో స్కూటర్‌కు పోటీ.. కిలోమీటరుకు 50పైసలే ఖర్చు.. అమ్మకాల్లో దూసుకుపోతున్న చిన్న కారు ధర పెరిగింది

భారతీయుల కార్ల ఆలోచనను మార్చిన మోడల్ ఎంజీ కామెట్.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవం సృష్టించిన ఈ చిన్న కారు ఇప్పుడు మహిళలకు కూడా ఇష్టమైన కార్లలో ఒకటిగా మారింది. సైజు ముఖ్యం కాదు ప్రాక్టికాలిటీనే కార్లకు ముఖ్యమని నిరూపిస్తూ కామెట్ ఒక డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది.

స్కూటర్‌లో పెట్రోల్ కొట్టి తిరిగే దానికంటే ఈ కారులో ప్రయాణించడం చాలా లాభం. ఇంట్లో సోలార్ ఉంటే, ఎండ, వాన తగలకుండా ఫ్రీగా ప్రయాణించొచ్చు. ఆటోరిక్షా పిలిచినా కూడా కామెట్ ఈవీని ఛార్జ్ చేసే దానికంటే ఎక్కువ డబ్బులు అవుతాయన్నది నిజం.

MGCometEV

అయితే, కామెట్ ఈవీ కొందామని అనుకునేవారికి ఓ బాధాకరమైన వార్త వచ్చింది. అదేమిటంటే, మైక్రో ఎలక్ట్రిక్ కారు పాత ధరలకు లభించదని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ప్రకటించింది. జూలై నుండి ఈ కారు కొనుగోలు చేసే కస్టమర్లు మునుపటి ధర కంటే 1.94 శాతం లేదా రూ.12,700 నుండి రూ.15,000 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎంజీ కామెట్ ఈవీలోని అన్ని వేరియంట్ల ధరలు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. గతంలో జనవరిలో కూడా ఈ మైక్రో ఈవీ ధరలో మార్పులు చేశారు. కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, 100 ఇయర్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణించగలదు కాబట్టి, రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ధరల పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని లైవ్‌హిందూస్థాన్ రిలీజ్ చేసింది. ఎంజీ కామెట్ ఈవీ 3.3kW ఏసీ ఛార్జర్‌తో వచ్చే ఎగ్జిక్యూటివ్ బేస్ మోడల్ ధర గతంలో రూ.7,35,500 ఉండేది. ఇప్పుడు ఇది రూ.14,300 పెరిగి రూ.7,49,800 అయింది. కామెట్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ కొత్త ధర రూ.8,56,800. దీనికి రూ.15,000 పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది.

ఇక ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ చూస్తే, కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.9,56,100. గతంలో రూ.9,41,100 ఉన్న ధర ఇప్పుడు రూ.15,000 పెరిగింది. 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే ఎక్సైట్ FC వెర్షన్ ధర రూ.15,000 పెరిగి రూ.8,96,800 అయింది. ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జర్ మోడల్ ధర రూ.9,96,800 ఉంటుంది. టాప్ ఎండ్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ కొనుగోలు చేసేవారు ఎక్స్-షోరూమ్ ధరగా రూ.9,98,800 చెల్లించాల్సి ఉంటుంది.

MGCometEV

ధరలో మార్పు తప్ప, ఈ చిన్న ఈవీలో కంపెనీ ఇతర అప్‌గ్రేడ్‌లు ఏమీ చేయలేదు. GSEV ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించిన ఈ ఎలక్ట్రిక్ కారు సిటీ డ్రైవింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. చిన్న సైజు కారణంగా వాహనం సురక్షితమేనా అని సందేహించేవారు చాలా మంది ఉన్నారు. అయితే, సేఫ్టీ పరంగా కూడా ఇది తక్కువేమీ కాదు అని నిరూపించబడింది.

17.4 kWh బ్యాటరీ ప్యాక్ ఎంజీ కామెట్ ఈవీకి హార్ట్ లాంటిది. సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఎంజీ ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు అందిస్తుంది. పనితీరు విషయానికి వస్తే చిన్న ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడిన ఈ ఈవీ 42 bhp పవర్‌లో 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 1,000 కిలోమీటర్లు నడపడానికి కామెట్‌కు కేవలం రూ.519 మాత్రమే ఖర్చవుతుందని ఎంజీ చెబుతోంది.

8 సంవత్సరాలు లేదా 1.20లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కామెట్ ఈవీతో అందిస్తున్నారు కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఎంజీ కామెట్ ఈవీ బ్రాండ్ సమగ్ర ఎంజీ ఇ-షీల్డ్ 3-3-3-8ప్యాకేజీతో మార్కెట్‌లోకి వస్తుంది. అంటే, 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ, 3సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 ఉచిత లేబర్ సర్వీస్‌లు 8 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ కారుతో లభిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఎంజీ కామెట్ ఈవీ ధర పెరిగినప్పటికీ, దాని ప్రాక్టికాలిటీ, తక్కువ రన్నింగ్ కాస్ట్, మంచి వారంటీ ప్యాకేజీలు దీనిని ఇప్పటికీ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుపుతున్నాయి. ముఖ్యంగా సిటీ డ్రైవింగ్, తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

More from DriveSpark

Article Published On: Tuesday, July 8, 2025, 18:17 [IST]
English summary
Mg comet ev new prices released up to rs 15 000 hike full details
Read more on: #mg motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+