ఆటోలకు పెట్టే ఖర్చుతో కారు ఛార్జ్ చేసుకోవచ్చు.. చౌకైన ఎంజీ మోడల్ ధర భారీగా పెరిగిందోచ్
సిటీల్లో తిరగడానికి ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత మహిళలు కూడా ఈ చిట్టి కారుకు అభిమానులుగా మారారు. దీని ప్రధాన బలం ఏమిటంటే ఇది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది.
దానితో పాటు తక్కువ ధర, మంచి రేంజ్ ఉండడంతో రోడ్లపై కామెట్‌లు బాగా కనిపించాయి. భారతీయుల కారు అనే ఆలోచనకు ఇది సరిగ్గా సరిపోకపోయినా, ఎంజీ ఈ ఎలక్ట్రిక్ కారు చాలా మంది అభిప్రాయాలను మార్చింది. స్కూటర్‌పై పెట్రోల్ కొట్టించుకుని తిరిగే ఖర్చు కంటే ఇందులో ప్రయాణించడం చాలా లాభదాయకం.

నిజం చెప్పాలంటే ఆటో రిక్షాకు ఫోన్ చేసినా, కామెట్ ఈవీని ఛార్జ్ చేసే ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే, ఈ కారును కొనాలని ఆలోచిస్తున్న వారికి కంపెనీ నుండి ఒక నిరాశపరిచే వార్త వచ్చిందని చెప్పాలి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ సెలక్ట్ చేసిన మోడళ్ల ధరలను భారీగా పెంచింది.
కాబట్టి ఇకపై ఎంజీ కామెట్ ఈవీని పాత ధరలకు కొనలేరు. బ్రాండ్ అత్యంత సరసమైన కారు అయిన కామెట్ ధర ఏకంగా రూ.35,700 వరకు పెరిగింది. దీంతో ఒక ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవాలంటే ఎక్స్-షోరూమ్ ధర రూ.7.35 లక్షల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఎఫ్‌సి, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సి, బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్, 100-ఇయర్ ఎడిషన్ అనే 7 వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

ధరల పెంపు విషయంలో ఎక్సైట్, ఎక్సైట్ FC వేరియంట్ల ధరలు ఇప్పుడు వరుసగా రూ.16,000, రూ.4,000 పెరిగాయి. అదే సమయంలో, ఎంజీ కామెట్ ఈవీ 100-ఇయర్ ఎడిషన్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలు రూ.5,300 చొప్పున పెరిగాయి. ఎంజీ ఈ చిట్టి కారు ధర ఇప్పుడు రూ.7.35 లక్షల నుంచి రూ.9.84 లక్షల వరకు ఉంది.
ఇక బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్ కింద అయితే, ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.4.99 లక్షలకే మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. బదులుగా మీరు కారు నడిపిన ప్రతి కిలోమీటర్‌కు రూ.2.50 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే దాని గురించి ఎంజీ మోటార్స్ ఇండియా ఇంకా వెల్లడించలేదు.

ఇటీవల కంపెనీ కామెట్ ఈవీ 2025 మోడల్‌ను అప్ డేటెడ్ ఫీచర్లతో విడుదల చేసింది. రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్ ORVMలు, లెథరెట్ సీట్లు, నాలుగు స్పీకర్లు ఈసారి జోడించిన ప్రధాన ఫీచర్‌లు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను కూడా ఎంజీ చేర్చింది.
ఈవీలో క్రీప్ మోడ్‌ను కూడా ఎంజీ మోటార్స్ చేర్చడం గమనార్హం. దీని వల్ల డ్రైవర్ బ్రేక్ నుంచి కాలు తీసిన వెంటనే కారు కదలడం మొదలవుతుంది. మొత్తానికి ఈ మైక్రో ఈవీ మునుపటి కంటే మరింత స్మార్ట్‌గా మారింది. కంపెనీ కామెట్ ఈవీతో 8 సంవత్సరాలు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అందిస్తోంది కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు.

మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఎంజీ కామెట్ ఈవీ బ్రాండ్ సమగ్ర ఎంజీ ఇ-షీల్డ్ 3-3-3-8 ప్యాకేజీతో మార్కెట్‌లోకి వస్తోంది. అంటే 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 ఉచిత లేబర్ సర్వీసులు, 8 సంవత్సరాలు లేదా 1.2 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ ఇందులో ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీ గుండె 17.4 kWh బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్క ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ వాహనం 42 bhp పవర్, గరిష్టంగా 110 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే చిన్న ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. కంపెనీ చెబుతున్న ప్రకారం కామెట్‌తో 1,000 కిలోమీటర్లు తిరగడానికి కేవలం రూ.519 మాత్రమే ఖర్చవుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








