548 కి.మీ. రేంజ్, అద్భుతమైన ఫీచర్లు..మానం లాంటి సౌకర్యాలతో త్వరలో మార్కెట్లోకి ఎంజీ కొత్త కారు

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ఎంజీ మోటార్స్ అద్భుతాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. జెడ్‌ఎస్ ఈవీతో మొదలైనప్పటికీ, కామెట్, విండ్సర్ వచ్చిన తర్వాతే బ్రాండ్ పేరు బాగా తెలిసింది. అప్పటివరకు టాటా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే చూసిన మధ్యతరగతి వారికి ఎంజీ ఈవీలు నిజంగా ఒక మ్యాజిక్‎లా అనిపించాయి. మంచి సర్వీస్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ అన్నీ కలిపి అందించిన వాహనాలను భారతీయులు బాగా ఇష్టపడుతున్నారు.

ఎలాంటి అలసట లేకుండా సుదూర ప్రయాణాలకు సరిపోయే సరికొత్త వాహనంతో ఎంజీ త్వరలో రాబోతోంది. ఇది లగ్జరీ క్లాస్ కోసం తయారుచేసిన, అత్యంత విలాసవంతమైన ఎలక్ట్రిక్ ఎంపీవీ కానుంది. ఏది అనుకుంటున్నారా? ఇటీవల వాహన ప్రియులు వింటున్న ఎమ్‌9 ఈవీ లక్ట్రిక్ వాహన మార్కెట్‌ను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది. 2025ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎంపీవీ భారత మార్కెట్‌లో ఎంజీ విడుదల చేయనున్న ఐదవ ఎలక్ట్రిక్ కారు.

MG M9 EV

జులై 21, 2025న ఎమ్‌9 అధికారికంగా భారతదేశంలో విడుదల కానుంది. రూ.51,000 టోకెన్ డిపాజిట్ తీసుకొని 2025 మే నెల నుంచే ఎంజీ ఎమ్‌9 ఈవీ కోసం బుకింగ్స్ ప్రారంభించారు. సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో పాటు, బ్రాండ్ ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ అయిన ఎంజీ సెలెక్ట్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీని విక్రయించనున్నారు. లగ్జరీ ఎంపీవీ విభాగంలో టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ వంటి వాహనాలతో ఇది పోటీపడనుంది.

అందువల్ల కియా, టయోటాలకు జులై 21నుండి కచ్చితంగా నిద్ర లేకుండా పోతుందని స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో ఎంజీ మొదటి పీపుల్-క్యారియర్గా ఎమ్‌9 రంగంలోకి దిగుతోంది. ఇది పూర్తిగా విదేశాలలో తయారు చేసి భారతదేశానికి దిగుమతి అవుతుంది కాబట్టి, దీని ధర రూ.65లక్షల నుండి రూ.70 లక్షల వరకు ఉండవచ్చు. ఈ పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేసినా, విమానంలోని బిజినెస్ క్లాస్ ప్రయాణం ఎంజీ ఈ కొత్త కారులో లభిస్తుంది.

MG M9 EV

డిజైన్ పరంగా చూసినా, ఎవరికైనా నచ్చే విధంగానే ఎంజీ తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎంపీవీకి రూపకల్పన చేసింది. క్లోజ్డ్-ఆఫ్ ట్రాపెజోయిడల్ ఫ్రంట్ గ్రిల్, బంపర్‌లో అమర్చిన స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, దీని పైన కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్ వంటివి ఎమ్‌9 ఈవీని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్‌లు ఉండటంతో ఇది మరింత అద్భుతంగా ఉంటుంది.

సెల్ఫ్-హీలింగ్ కాంటినెంటల్ కాంటిసీల్ టైర్లతో కూడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపున ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, రూఫ్ స్పాయిలర్ వంటివి వాహనం బాహ్య సౌందర్యాన్ని పెంచడానికి ఏర్పాటు చేశారు. మూడు వరుసలు, 7 సీటర్ ఆప్షన్‌తో వచ్చే ఎమ్‌9 ఈవీ మొత్తం పొడవు 5,270 మి.మీ, వెడల్పు 2,000 మి.మీ, ఎత్తు 1,840 మి.మీ, వీల్‌బేస్ 3,200 మి.మీ.

MG M9 EV

అంటే, కార్నివాల్, వెల్‌ఫైర్ వంటి పోటీదారుల కంటే ఎంజీ ఎమ్‌9 ఈవీ పెద్దది అని అర్థం. భారతదేశంలో, ఈ ఎంపీవీ ప్రెసిడెన్షియల్ లిమో అని పిలువబడే ఫుల్ లోడెడ్ టాప్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మెటల్ బ్లాక్, కాంక్రీట్ గ్రే, పెర్ల్ లస్టర్ వైట్ వంటి రంగులలో ఈ వాహనాన్ని ఎంచుకోవచ్చు. దీని ఇంటీరియర్ కాగ్నాక్ బ్రౌన్ లెదర్, స్యూడ్ మిశ్రమంతో పూర్తి చేయబడింది.

కారు లోపలికి వెళ్తే, మన ఇళ్లలోని బెడ్‌రూమ్ కంటే కూడా అద్భుతంగా ఉందనిపించేలా వాహనాన్ని డిజైన్ చేశారు. 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, జెబిఎల్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్లు ఉన్న డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు వంటి అనేక ఫీచర్లు ఎమ్‌9 ఈవీలో ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ 90 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల రేంజ్ వరకు అందిస్తుంది. ఈ ఈవీలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 241 బీహెచ్‌పీ పవర్‌తో 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఎమ్‌9 ఈవీ గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఛార్జింగ్ విషయానికి వస్తే, 11 kWh ఛార్జర్‌ను ఉపయోగించి దాదాపు 8.5 గంటల్లో బ్యాటరీని 5 శాతం నుండి 100 శాతానికి పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకవేళ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే, కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 30 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చని ఎంజీ చెబుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 18, 2025, 15:10 [IST]
English summary
Mg m9 ev to challenge toyota vellfire luxury electric mpv with 548 km range
Read more on: #mg motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+