ఇండియాలో ఈ ఎలక్ట్రిక్ కారుకు జనాలు నీరాజనం పడుతున్నారు.. చూసినవాళ్లంతా ఫిదా అవుతున్నారు
JSW MG మోటార్ ఇండియా భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో తన బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే, MG ఎలక్ట్రిక్ వ్యూహం ఎంతగా ఫలితాలు ఇస్తోందో అర్థమవుతుంది. ముఖ్యంగా MG విండ్సర్ EV ఈ నెలలో కంపెనీకి ప్రధాన అమ్మకాల ఇంజిన్‌గా మారింది. స్టైలిష్ డిజైన్, ప్రాక్టికల్ రేంజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై పెరుగుతున్న నమ్మకంతో, విండ్సర్ EV వినియోగదారుల మనసు గెలుచుకుంటోంది. నవంబర్ 2025లో MG విండ్సర్ EV మొత్తం 4,025 యూనిట్ల అమ్మకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. ఇది MG మోటార్ ఇండియా మొత్తం నెలవారీ అమ్మకాలలో దాదాపు 70 శాతం వాటాను అందుకోవడం విశేషం.
అంటే కంపెనీ అమ్మకాల్లో మూడు కార్లలో రెండు కార్లు విండ్సర్ EVలే కావడం, ఈ మోడల్‌పై మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై భారత వినియోగదారుల ఆసక్తి ఎంత వేగంగా పెరుగుతోందో చెప్పడానికి ఉదాహరణ. గత ఏడాదితో పోలిస్తే విండ్సర్ EV అమ్మకాలు మరింత బలంగా పెరిగాయి. నవంబర్ 2024లో 3,144 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి అదే నెలలో అమ్మకాలు 28 శాతం పెరగడం గమనార్హం.

విండ్సర్ EV ప్రయాణం ఇంకా ప్రత్యేకమైన మైలురాయితో మరింత ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 2024లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు, కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడై ఒక అరుదైన రికార్డును సృష్టించింది. భారత EV మార్కెట్‌లో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి అమ్మకాలను సాధించడం అంటే, విండ్సర్ EV ఎంతగా వినియోగదారులను ఆకర్షించిందో స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ అమ్మకాలతో విండ్సర్ EV భారతదేశంలో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇది MG బ్రాండ్‌కు మాత్రమే కాకుండా, మొత్తం భారత EV మార్కెట్‌కు మైలురాయి. అయితే, మరో కోణంలో చూస్తే 2025 అక్టోబర్ నెలతో పోలిస్తే విండ్సర్ EV అమ్మకాలు సుమారు 9 శాతం తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, మొత్తం MG అమ్మకాలలో విండ్సర్ EV ఆధిపత్యం మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

ప్రస్తుతం MG మోటార్ ఇండియాలో బాగా అమ్ముడవుతున్న ఏకైక మోడల్ విండ్సర్ EV కావడం గమనార్హం. అంటే, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ కార్లు ఈ సమయంలో అమ్మకాల పరంగా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇది MG పూర్తిగా ఎలక్ట్రిక్ వ్యూహంపై ఎంతగా ఆధారపడుతోందో స్పష్టంగా తెలియజేస్తోంది. విండ్సర్ EVనే కంపెనీ అమ్మకాల భారం మొత్తాన్ని మోస్తున్న మోడల్‌గా మారింది.
విండ్సర్ EV తరువాత స్థానంలో ఉన్న MG కామెట్ EV నవంబర్ 2025లో వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 2024తో పోలిస్తే అమ్మకాలు దాదాపు 50 శాతం పెరిగి, మొత్తం 897 యూనిట్లకు చేరుకున్నాయి. అప్పట్లో కేవలం 600 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వడం గమనార్హం. ఇక MG అమ్మకాల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న MG ZS EV మాత్రం డిమాండ్ పరంగా స్వల్ప తగ్గుదల ఎదుర్కొంది.

నవంబర్ 2025లో ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కేవలం 400 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యింది. MG హెక్టర్,యు హెక్టర్ ప్లస్ అమ్మకాలు నవంబర్ 2024 నుండి 75% తగ్గి 278 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, 2025 అక్టోబర్‌లో అమ్ముడైన 225 యూనిట్లతో పోలిస్తే 24% వృద్ధి హెక్టర్ కార్ల అమ్మకాలలో స్వల్ప పునరుద్ధరణను చూపిస్తుంది. గత నెలలో MG Astor అమ్మకాలు కూడా 73% తగ్గి 149 యూనిట్లకు చేరుకున్నాయి.
కానీ గత అక్టోబర్‌తో పోలిస్తే, అమ్మకాలు 46% పెరిగాయి (అక్టోబర్ 2025లో 102 యూనిట్లు). MG హై-ఎండ్ మోడల్ గ్లోస్టర్ నవంబర్‌లో కేవలం 5 యూనిట్లను (గత సంవత్సరం నవంబర్‌లో 138 యూనిట్లు) విక్రయించి స్తబ్దుగా అమ్మకాలను ఎదుర్కొంటోంది. ఇటీవల రూ. 11.99 లక్షల ఆకర్షణీయమైన ధరతో ప్రారంభించబడిన కొత్త హెక్టర్ రాబోయే నెలల్లో దాని అమ్మకాలను పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








