కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే తీసుకోండి.. కొద్ది రోజుల్లో ధరల పెంపు! షాక్ ఇచ్చిన కంపెనీ
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఎంజీ మోటార్స్ (MG Motors) మరోసారి వార్తల్లోకెక్కింది. మొదటగా హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి ఐసీఈ ఇంజిన్ కార్లతో దేశంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, తర్వాతి దశలో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించి ఇప్పుడు దేశంలో మంచి డిమాండ్ ఉన్న కంపెనీగా గుర్తింపును సంపాదించుకుంది. ZS EVతో ప్రారంభమైన ఈ ప్రయాణం, తరువాత వచ్చిన Comet EV, Windsor EVల ద్వారా ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుంది. MG షోరూమ్‌లు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల కోసం వచ్చే కస్టమర్లతో నిండిపోయి ఉండటాన్ని కూడా గమనించవచ్చు. కొత్తగా ఈవీ కారును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఎంజీ వైపు చూస్తున్నారు.
అయితే, ఇదంతా జరుగుతున్న సమయానే కంపెనీ నుంచి వచ్చిన తాజా ప్రకటన కారు కొనాలనుకునే వారిలో కొంత అసంతృప్తిని కలిగించింది. జులై 1, 2025 నుంచి MG మోటార్స్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పెంపు కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీ, ZS EV, ఆస్టర్, హెక్టర్, గ్లోస్టర్ వాహనాలను కూడా ప్రభావితం చేయనుంది. ధరలు సగటున 1.5 శాతం వరకు పెరగనున్నట్లు కంపెనీ తెలిపింది.

అంటే, ప్రస్తుతం తక్కువ ధరలో MG కారును కొనాలనుకుంటే, జులై ముందు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ లోపు తీసుకుంటే పాత ధర ప్రకారం కారును సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ వ్యయాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరైనా MG కారు కొనాలనుకుంటే త్వరగా నిర్ణయం తీసుకోవడం మేలు.
జులై 1, 2025 నుండి MG మోటార్స్ వాహనాల ధరల పెంపు ఒక సాధారణ పెంపుగా కాకుండా, ప్రతీ మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉండే విధంగా ఉండనుంది. MG శ్రేణిలో ఎంట్రీ లెవల్ వాహనంగా నిలిచిన Comet EV, ప్రస్తుతం రూ.4.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తోంది. తక్కువ పరిమాణంతో, సిటీ డ్రైవింగ్‌కి అనువైన ఫీచర్లతో ఇది యువతలో మంచి ఆదరణ పొందింది.

విండ్సర్ ఈవీ ధర రూ.10 లక్షల నుండి రూ.13 లక్షల మధ్య ఉంది. ICE మోడళ్లను చూసినట్లయితే MG Aster రూ.11.30 లక్షల ప్రారంభ ధరతో కంపెనీ ICE సెగ్మెంట్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఇది యువతతో పాటు ఫ్యామిలీ యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. తర్వాత, Hector SUV రూ.17.50 లక్షల ధరలో ప్రారంభమవుతుంది. ఎస్‌యూవీ విభాగంలో ఫ్లాగ్‌షిప్‌గా నిలిచిన Gloster, ప్రీమియమ్ ఫీచర్లతో రూ.41.07 లక్షల వద్ద లభిస్తోంది.
ఈ ధరల పెంపుతో, కొంతవరకు వినియోగదారులు ఖర్చు విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచించవలసి రావొచ్చు. అయితే, కార్లలోని ఫీచర్లు, బ్రాండ్ నమ్మకం, EV టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుంటే, MG కార్లు ఇంకా పోటీ మార్కెట్లో హాట్ ఛాయిస్‌లుగానే మిగిలే అవకాశముంది. కొనుగోలు చేయాలనుకునే వారు జూలై 1కు ముందు నిర్ణయం తీసుకుంటే, కొంతవరకు బడ్జెట్ లోపలే కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications