రూ.5.50 లక్షల డిస్కౌంట్.. ఇంత భారీ తగ్గింపు ఎప్పుడూ చూడలేదు! చిన్న ఎలక్ట్రిక్ కార్లపై కూడా..

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (Mg motor India) ఇటీవల తన దూకుడును మరింత ఎక్కువగా ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేస్తూ టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీదారులకు గట్టి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేస్తూనే అదే సమయంలో బాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై కూడా కీలకంగా దృష్టి సారించింది. SUV మోడల్ హెక్టర్ లాంచ్‌తో ఎంజీ మోటార్ దేశంలో బలమైన వృద్దిని సాధిస్తుంది. కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలను కూడా తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈవీ కార్ల పరంగా టాప్ ప్లేస్‌లో ఉన్నటువంటి టాటా మోటార్స్ గట్టి షాక్ ఇచ్చి సేల్స్ విషయంలో మెరుగైన గణాంకాలను నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో తన సేల్స్‌ను మరింత పెంచుకోవడానికి కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ ప్రత్యేకంగా మార్చి నెలలో తగ్గింపు ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్ల వినియోగదారులు షోరూమ్‌కు క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంజీ మోటార్ 2024, 2025 మోడల్ కార్లపై డిస్కౌంట్ ఆఫర్‌ అందిస్తుంది. మర్చినెల తగ్గింపులో భాగంగా కామెట్, ఆస్టర్, ZS EV, విండ్సర్ EV, హెక్టర్, గ్లోస్టర్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Mg Motor India Huge Discount Offers In March

ఆఫర్ వివరాల్లోకి వెళితే, ఎంజీ కామెట్ ఈవీపై ఈ నెలలో దాదాపు రూ..45,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది 2024 మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ మొత్తం అమౌంట్‌లో ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 20,000 ఉన్నాయి. అలాగే, 2025 కామెట్ ఈవీ మోడల్‌ను చూసినట్లయితే ఫాస్ట్ ఛార్జర్‌ వచ్చినటువంటి మైక్రో EVపై తగ్గింపు లభిస్తుంది.

ఎక్సైట్ ఎఫ్‌సీ, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ ట్రిమ్‌లపై రూ. 40,000 వరకు తక్కువ తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర ప్రస్తుతం భారతీయ మార్కెట్లో దాదాపు రూ.6.99 లక్షల నుంచి రూ.9.64 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మోడల్‌కు బ్యాటరీని అద్దె ప్రాతిపదికన కూడా చూసుకోవచ్చు. BssSని ఎంచుకుంటే, రూ. 4.99 లక్షల నుంచి చెల్లించాల్సి వస్తుంది.

Mg Motor India Huge Discount Offers On Hector

మిడ్-సైజ్ SUV ఆస్టర్ పై భారీ తగ్గింపు ఉంది. 2024 మోడళ్లపై కంపెనీ ఏకంగా రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ తగ్గింపు టర్బో పెట్రోల్ సావీ ప్రో వేరియంట్‌కు ఉంది. ఈ మొత్తంలో రూ.75,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 లాయల్టీ బోనస్, రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే రూ.15,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అదే 2025 మోడల్‌పై మాత్రం గరిష్టంగా రూ. 70,000 తగ్గింపు ఉంది.

ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్ మోడళ్లపై రూ. 2.20 లక్షల విలువైన ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇది 2024 మోడల్‌కు మాత్రమే. డీజిల్ వేరియంట్లపై రూ.1.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఉంది. అదే 2025 మోడళ్లపై గరిష్టంగా రూ.70,000 తగ్గింపు లభిస్తుంది. ఎంజీ ఆస్టర్ విషయానికి వస్తే, 2024 మోడల్‌పై రూ. 1.45 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. టర్బో పెట్రోల్ సావీ ప్రో వేరియంట్‌కు ఇది అందుబాటులో ఉంటుంది.

Mg Gloster Discount In March 2025

ఈ మొత్తంలో రూ.75,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 35,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అదే 2025 మోడళ్లపై రూ. 70,000 తగ్గింపు ఉంది. ఎంజీ గ్లోస్టర్‌పై అత్యధికంగా రూ. 5.50 లక్షల విలువైన ఆఫర్లు ఎదురుచూస్తున్నాయి. దీనిలో రూ.4.50 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

2025 మోడల్‌పై రూ.4-3.5 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV, ZS ఈవీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌‌పై రూ. 2.05 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వేరియంట్లపై రూ.1.35 లక్షల వరకు తగ్గింపు ఉంది. మా పాఠకులకు ముఖ్య గమనిక ఏమిటంటే ఈ ఆఫర్స్ నగరాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అందుకే పూర్తి వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 10:58 [IST]
English summary
Mg motor india huge discount offers on hector comet ev gloster and astor in march 2025
Read more on: #mg motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+