5 సీటర్ కారును జనాలు భారీగా కొన్నారు.. ఈ కారు లేకపోతే కంపెనీ పరిస్థితి ఏమయ్యేదో?
JSW MG మోటార్ ఇండియా అక్టోబర్ 2025 నెల అమ్మకాల వివరాలను పరిశీలిస్తే, మార్కెట్లో ఈ బ్రాండ్‌కు కస్టమర్లు ఎలా స్పందిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి అమ్మకాల పట్టికలో కంపెనీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే, నెలవారీ, వార్షిక అమ్మకాల గణాంకాలను పోలిస్తే కంపెనీకి కొన్ని ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2025లో JSW MG మొత్తం 6,397 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 7,045 యూనిట్లతో పోలిస్తే 9% తగ్గుదలగా నమోదు అయింది. అమ్మకాల్లో ఈ వార్షిక తగ్గుదల MG మోటార్‌కు చిన్న షాక్ కాదు, భారత మార్కెట్లో పోటీ పెరిగిపోవడం, కొత్త బ్రాండ్ల ప్రవేశం, అలాగే SUV డిమాండ్‌లో వచ్చిన మార్పులు ఈ ప్రభావానికి ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
మరో వైపు, సెప్టెంబర్ 2025తో పోలిస్తే కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. సెప్టెంబర్‌లో కంపెనీ 6,728 యూనిట్లు అమ్మగా, అక్టోబర్‌లో అది 5% తగ్గి 6,397 యూనిట్లకు పడిపోయింది. పండగ సీజన్ ఉన్నప్పటికీ అమ్మకాలు పెరగకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ క్షీణత మధ్యలో కూడా MG మోటార్‌కు ఒక పెద్ద ఆశాకిరణం కనిపిస్తోంది, అదే విండ్సర్ EV. ఈ ఎలక్ట్రిక్ కారు MG లైనప్‌లో గేమ్-చేంజర్‌గా మారింది.

అక్టోబర్ నెలలో మాత్రమే 4,445 యూనిట్లు అమ్ముడవడం దీని పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. MG బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా విండ్సర్ EV మరొకసారి సత్తా చాటింది. ఎలక్ట్రిక్ విభాగంలో పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, విండ్సర్ EV మాత్రం తన ప్రత్యేకమైన డిజైన్, రేంజ్, ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో వినియోగదారుల అభిమానాన్ని పొందుతోంది. మొత్తం అమ్మకాలలో దాదాపు 70%కి పైగా విండ్సర్ EV ఒక్కదే సాధించడం విశేషం.
విండ్సర్ EV అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, MG మోటార్‌కు ఇది ఎంతటి కీలకమైనదో స్పష్టమవుతుంది. గత సంవత్సరం అక్టోబర్ 2024లో అమ్ముడైన 3,116 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్ముడైన 4,445 యూనిట్లు దాదాపు 43% వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ పెరుగుదల MG బ్రాండ్‌కు ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అయితే, సెప్టెంబర్ 2025లో అమ్ముడైన 4,741 యూనిట్లతో పోలిస్తే, అక్టోబర్ అమ్మకాలు 6% తగ్గడం మాత్రం గమనార్హం.

అమ్మకాల వేగం, మోడల్‌పై ఆసక్తిని మరింత పెంచేందుకు అక్టోబర్ 2025లో విండ్సర్ ఇన్‌స్పైర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కేవలం 300 యూనిట్లు అందుబాటులో ఉంచిన ఈ పరిమిత ఎడిషన్, విండ్సర్ EV ఒకే ఏడాదిలో 40,000 అమ్మకాలు పూర్తి చేసిన మైలురాయిని సెలబ్రేట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. MG లైనప్‌లో విండ్సర్ EV తరువాత రెండవ స్థానంలో నిలిచింది కామెట్ EV, ఇది అక్టోబర్‌లో 1,007 యూనిట్ల అమ్మకాలు సాధించింది.
అయితే ఇవి గత సంవత్సరం అక్టోబర్ 2024లో అమ్ముడైన 1,151 యూనిట్లతో పోలిస్తే 13% వార్షిక తగ్గుదలను, సెప్టెంబర్ 2025లో అమ్ముడైన 1,203 యూనిట్లతో పోలిస్తే 16% నెలవారీ క్షీణతను సూచిస్తున్నాయి. మార్కెట్లో పెరిగిన పోటీ కామెట్ EV మీద ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక MG ZS EV గత సంవత్సరం అక్టోబర్ 2024లో అమ్ముడైన 611 యూనిట్లతో పోలిస్తే, ఈసారి 609 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

ఇదే సమయంలో, MG హెక్టర్/హెక్టర్ ప్లస్ అమ్మకాలు గత నెలలో 225 యూనిట్లకు తగ్గాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 82%, నెలవారీ ప్రాతిపదికన 45% తగ్గుదల. అంతేకాకుండా, MG ఆస్టర్ కారు కూడా అమ్మకాలు 87% తగ్గి 102 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, సెప్టెంబర్‌లో అమ్ముడైన 90 యూనిట్లతో పోలిస్తే ఆస్టర్ నెలవారీ అమ్మకాలు 13% పెరిగాయి. గ్లోస్టర్ అక్టోబర్ 2025 లో కేవలం 9 యూనిట్లను మాత్రమే విక్రయించింది.


Click it and Unblock the Notifications








