ఆటో ఎక్స్‌పోలో ఎంజీ కొత్త ఈవీలతో కేక.. వామ్మో.. ఈ కారు పొడవులో పోటీనే లేదు!
బ్రిటిష్ మోటారింగ్ బ్రాండ్ జేఎస్ డబ్యూ ఎంజీ మోటార్ ఇండియా.. తమ వాహనాలతో భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తమ కార్లతో అన్ని వర్గాల వారికి చేరువైంది. ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ సాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ సంస్థ ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లను ఆవిష్కరించింది. అందులో ఒకటి Cyberster EV కాగా.. మరొకటి లగ్జరీ ఎంపీవీ అయిన MG M9. మార్చిలో సైబర్ స్టర్ ఈవీ, ఎం9 కార్ల బుకింగ్స్ ప్రారంభించి, ఏప్రిల్‌లో వీటి డెలివరీలను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఈ కార్ల పీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సైబర్‌స్టర్ ఈవీ సంప్రదాయ స్పోర్ట్స్ కారు డిజైన్‌లో లాంగ్ బానెట్‌తో ఉంటుంది. షార్ప్ బాడీ లైన్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED DRLs, honeycomb- ప్యాటర్న్ లోయర్ ఫ్రంట్ గ్రిల్‌తో ఈ కారు ఉంటుంది. ఈ కారు ఎలక్ట్రానికిల్లీ ఆపరేటెడ్ సిజర్ డోర్స్‌తో ఉంటుంది.

అంతేగాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు.. 20 అంగుళాల డ్యూయల్- టోన్ అలాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్‌తో బ్లాక్ ORVMs ఉంటాయి. యారో- షేప్డ్ LED టెయిల్ లైట్లు, మధ్యలో కనెక్టింగ్ లైట్ బార్, వైడ్ రియర్ డిఫ్యూజర్ వంటి వాటితో వస్తుంది.
Dynamic Red, Inca Yellow, Cosmic Silver, and English White అనే నాలుగు రంగుల్లో సైబర్‌స్టర్ ఈవీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఎంజీ సంస్థ. ఈ ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో ప్రధాన ఆకర్షణగా దీంట్లో ఉండే ఎలక్ట్రికల్లీ ఆపరేబుల్ రూఫ్ అని చెప్పవచ్చు.

సైబర్‌స్టర్ ఈవీ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది రెడ్, బ్లాక్ థీమ్‌తో ఉంటుంది. టిపుల్ స్క్రీన్ లే అవుట్‌తో దీని డ్యాష్ బోర్డ్ ఉంటుంది. 7 అంగళాల ఇన్స్టుమెంట్ గేజ్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఏసీ కంట్రోల్స్ కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ డ్యాష్ బోర్డ్ పూర్తిగా ఫైటర్ జెట్ తరహాలో రూపొందించారు.
ఇందులో 8-స్పీకర్ ప్రీమియం బోస్ ఆడియో సిస్టం, 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం(ADAS) వంటివి ఉంటాయి. ఈ ఏడీఎస్‌లో లేన్- కీప్ అసిస్ట్, యాక్టివ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఇతర సదుపాయాలు ఉంటాయి.

ఇక సైబర్ స్టర్ ఈవీ పవర్ ట్రెయిన్ విషయాన్ని పరిశీలిస్తే ఇది 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్‌తో ఇది అనుసంధానించి ఉంటుంది. ఈ కారు 510 PS పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో AWD సిస్టం కూడా ఉంటుంది. 3.2 సెకన్లలోనే ఈ ఈవీ.. 0-100 కి.మీ.ల వేగాన్ని అందుకోగలదు. ఇందులోని బ్యాటరీ ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే ఏకంగా 443 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఈ ఈవీ ధరను మాత్రం ఇంకా ఎంజీ సంస్థ వెల్లడించలేదు.
ఇక ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ విషయానికి వస్తే.. ఇది 5.72m పొడవుతో, 2m వెడల్పుతో, 1.84m ఎత్తుతో, 3.2m వీల్ బేస్ తో ఉంటుంది. ఈ కారు భారత్ లో పొడవైన ఫుల్- సైజ్ ఎలక్ట్రిక్ ఎంపీవీల్లో ఒకటి అని చెప్పవచ్చు.
MG M9 ముందు భాగాన ట్రాపెజోయిడల్ ఎయిర్ ఇన్ టేక్ వెంట్స్‌తో ఉండే blanked-off ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. LED హెడ్ లైట్లు, eyebrow-like LED DRLs ఉంటాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ.. బాక్సీ silhouette తో ఉంటుంది. స్లైడింగ్ ఎలక్ట్రిక్ డూర్స్, క్రోమ్ accentsతో ఉంటుంది. వెనుకవైపు LED టెయిల్ లైట్లు, మధ్యలో కనెక్టింగ్ లైట్ బార్ ఉంటుంది.
beige-and-tan interior థీమ్‌తో ఈ M9 EV MPV ఉంటుంది. ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, లాంగ్- రన్నింగ్ ఏసీ వెంట్స్ ఇందులో ఉంటాయి. ఈ కారు 7, 8 సీటర్ కన్ఫిగరేషన్లతో వస్తుంది. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ మిడిల్ సెక్షన్ సీట్లు ఇందులో ఉంటాయి.
ఫ్రంట్ క్యాబిన్‌లో సింగిల్ సన్ రూఫ్‌తో ఉంటుంది. వెనుక సీట్ల వైపు పనోరమిక్ సన్ రూఫ్‌తో ఉంటుంది. 12.3- అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, 7 అంగుళాల డిజిటల్ ఇన్స్టుమెంట్ గేజ్ క్లస్టర్, రియర్ ఎంటర్ టెయిన్మెంట్ స్క్రీన్స్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, త్రీ- జోన్ క్లైమేట్ కంట్రోల్, 12- స్పీకిర్ ప్రీమియం ఆడియో సిస్టం ఇందులో ఉంటాయి.
90 kWh బ్యాటరీ ప్యాక్ తో ఎంజీ ఎం9 ఈవీ ఉంటుంది. ఇది 245 PS పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సైజులో పెద్దగా ఉన్నప్పటికీ ఈ కారు 9.9 సెకన్లలోనే 0-100 km/h వేగం అందుకుంటుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 430 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. దీని ధరను కూడా ఎంజీ సంస్థ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








