ఇండియా మొట్టమొదటి ఏఐ కారు వచ్చేసింది.. ఎంజీ ఆస్టర్ ఫీచర్స్ వింటే పిచ్చెక్కాల్సిందే
ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'ఎంజీ ఆస్టర్' కారును విడుదల చేసింది. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికత, సేఫ్టీ, సౌకర్యం ఉన్నాయి. ఎంజీ ఆస్టర్ ఇప్పుడు దాని కొత్త షైన్ వేరియంట్‌తో రూ.12.5 లక్షల(ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధరకే పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే దాని సెగ్మెంట్లో ఏకైక SUV అని కంపెనీ చెబుతోంది.
ఇంకా, సెలెక్ట్ వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగులు, మెరుగైన భద్రత, సౌకర్యం కోసం ప్రీమియం ప్రీమియం ఐవరీ లెథరెట్ సీట్లతో వస్తుంది. SUV ప్రియులు తమ సమీపంలోని జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా డీలర్‌షిప్‌లను సందర్శించి 'ది బ్లాక్‌బస్టర్ SUV'ని కొనుగోలు చేయవచ్చు. 2025 ఎంజీ ఆస్టర్ 1.5L మాన్యువల్, CVT, 1.3 టర్బో ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది.

'ది బ్లాక్‌బస్టర్ SUV' 50 కి పైగా సేఫ్టీ ఫీచర్స్, ప్రీమియం ఇంటీరియర్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది అద్బుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఎంజీ ఆస్టర్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్, 14 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్స్ పొందిన భారత మొట్టమొదటి SUV. దీనిని 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ముందు వరుసలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఎక్స్ట్రా సేఫ్టీ, సౌలభ్యం కోసం ఆటో డిమ్మింగ్ IRVM, మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అప్ డేట్ చేసిన i-SMART 2.0, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం 80+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి.

దీని ప్రత్యేక ఫీచర్లలో JIO వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉన్నాయి. ఇది వెదర్, క్రికెట్ అప్డేట్స్, కాలిక్యులేటర్, టైం, తేదీ/రోజు సమాచారం, హోరోస్కోప్, డిక్షనరీ, వార్తలు, నాలెడ్జ్ కోసం వాయిస్ కమాండ్స్ అందిస్తుంది. డిజిటల్ కీ యాక్టివిటీతో కలిపిన యాంటీ-థెఫ్ట్ ఫీచర్ నెట్‌వర్క్ కనెక్షన్ లేకుండా కూడా సేఫ్టీని అందిస్తుంది.
దీనిపై ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. "ఎంజీ ఆస్టర్ అనేది ఒక మంచి SUV కోసం చూస్తున్న ఎంట్రీ-లెవల్ వినియోగదారులకు సరైన కారు. అత్యుత్తమ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వాళ్లకు ఓ బెస్ట్ ఆఫ్షన్'' అని అన్నారు.

ఎంజీ మోటార్ ఇండియా 100కి పైగా దేశాలలో ఉనికిని కలిగి ఉంది. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన SAIC మోటార్, JSW గ్రూప్ ఒక జాయింట్ వెంచర్...జేఎస్ డబ్ల్యూ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనిని 2023లో స్థాపించారు. జాయింట్ వెంచర్ స్మార్ట్, సస్టైనబుల్ ఆటోమోటివ్ ఎకోసిస్టమ్ నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ప్రపంచ స్థాయి సాంకేతికతను పరిచయం చేస్తుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని, తన వ్యాపార కార్యకలాపాలలో అత్యుత్తమ ఆవిష్కరణలను తీసుకువస్తుంది. భారతదేశంలో గణనీయమైన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంది. 1924లో యూకేలో స్థాపించబడిన మోరిస్ గ్యారేజ్ ఆటోమొబైల్స్ దాని స్పోర్ట్స్ కార్లు, రోడ్‌స్టర్‌లు, యు క్యాబ్రియోలెట్‌లతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

1930లో యూకేలోని అబింగ్‌డన్‌లో స్థాపించబడిన ఎంజీ కార్ క్లబ్ వేలాది మంది అభిమానులను కలిగి ఉంది. ఇది ఈ కార్ బ్రాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లబ్‌లలో ఒకటి. గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న దాని అత్యాధునిక తయారీ కేంద్రం ఏటా లక్ష వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6,000 మంది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








