కార్లపై రూ.3.92 లక్షల ప్రత్యేక తగ్గింపు ఆఫర్.. పొట్టి ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఒక శక్తివంతమైన కంపెనీగా టాటా మోటార్స్ నిలుస్తూ ఉండగా, ఇటీవల కాలంలో దానికి గట్టి పోటీ ఇచ్చేలా ఎంజీ మోటార్స్(mg motors) ఎదిగింది. ZS EV అనే మోడల్‌తో ev విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రాండ్, అప్పుడే మార్కెట్‌లో తనదైన ముద్ర వేయడంలో విజయం సాధించింది. కామెట్ EV రూపంలో వచ్చిన చిన్న కారుతో యువతను ఆకట్టుకోవడమే కాదు, నగర ప్రయాణాలకు సరిపోయే వినూత్నతను చూపించింది. ఇక విండ్సర్ EV అంటూ మరో అడుగు ముందుకు వేసి, సాధారణ వినియోగదారుడి దృష్టిని సంపాదించగలిగింది. ఈ రెండు మోడల్స్ ద్వారా ఎంజి మోటార్స్ ఈవీలో టాటా కంపెనీకి గట్టి సవాళ్లను విసురుతుంది. 'చైనీస్ బ్రాండ్' అయినప్పటికి JSW గ్రూప్ పెద్ద మొత్తంలో వాటా కొనుగోలు చేయడంతో, ఇప్పుడు దేశీయంగా కంపెనీగా నిలదొక్కుకుంది.
ప్రారంభంలో హెక్టర్, గ్లోస్టర్ వంటి మోడల్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ఎంజీ, ICE వాహనాల విభాగంలో తన బలాన్ని నిరూపించుకుంది. ఆకట్టుకునే డిజైన్, ఆధునిక సాంకేతికత, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మోడళ్లను విడుదల చేయడం ద్వారా ఇప్పుడు ఎంజీ బ్రాండ్‌ను భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక వాహన తయారీదారుగా నిలబెట్టాయి. అమ్మకాల పరంగా ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వడానికి తన అమ్మకాలను పెంచడానికి తాజాగా ఏప్రిల్ నెల తగ్గింపులను తీసుకొచ్చింది.

ఎలక్ట్రిక్, ICE ఇంజిన్ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్ల కోసం ఏకంగా రూ.3.92 లక్షల వరకు ప్రయోజనాలు ఇస్తుంది. ఈ తగ్గింపులో డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు వంటివి అన్ని కలిపి ఉంటాయి. కొత్త కారు కొనే ఆలోచనలో ఉంటే, ముందు ఈ ఆఫర్ల గురించి తెలుసుకోండి. షోరూమ్‌కి వెళ్లే ముందు ఈ డీల్స్ తెలుసుకోవడం ద్వారా భారీగా ఆదా చేసుకుని కొత్త కారును ఇంటికి తీసుకెళ్ళవచ్చు.
ఏప్రిల్ 2025 ఆఫర్‌లో భాగంగా కామెట్ ఈవీ 2024 మోడల్ ఇయర్ మోడల్‌పై కంపెనీ రూ. 45,000 వరకు మొత్తంగా ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 20,000 లాయల్టీ బోనస్, మరియు రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే,మిడ్-రేంజ్ వేరియంట్‌లపై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఎక్సైట్, 100-ఇయర్ ఎడిషన్ వేరియంట్‌లపై రూ. 35,000 వరకు డిస్కౌంట్ ఉంది.

2025 మోడల్స్‌పై కూడా ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి రూ. 35,000 నుండి రూ. 40,000 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇది చిన్నదైన కానీ శక్తివంతమైన ఈవీ కారు. ఈ ఏప్రిల్ నెలలో ఇస్తున్న తగ్గింపు ప్రయోజనాలు వాడుకుని తక్కువ ధరలో కామెట్ EVని తీసుకెళ్లవచ్చు. MG కామెట్ ఈవీ ఇతర వివరాలను ఒకసారి చూద్దాం. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది.
ఈ కారు 42 bhp పవర్, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్‌ను MG రూ.4.99 లక్షల ధరకు అందిస్తోంది, అది కూడా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్‌లో. అంటే, మీరు బ్యాటరీని కొనకుండా ఉపయోగించవచ్చు, కానీ ప్రతి కిలోమీటరు ప్రయాణానికి రూ.2.50 అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కారుకు కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అందిస్తోంది. కామెట్ EV ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జ్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. నగరాల్లో రొజూ ప్రయాణంచడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ ధరలో ఈవీ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది.
MG ఆస్టర్ ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ మిడ్-సైజ్ SUVపై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ డ్రైవింగ్‌ను కోరుకునే వారికి టర్బో ఆటోమేటిక్ వేరియంట్ పై రూ. 75,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 35,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. అలాగే, స్ప్రింట్, సెలెక్ట్ వంటి తక్కువ వేరియంట్లపై రూ. 35,000 వరకు తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది.

2025 మోడళ్లపై కూడా రూ. 70,000 వరకు ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 110 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 140 bhp పవర్‌ను విడుదల చేస్తుంది. MG ఆస్టర్, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి SUVలకు బలమైన పోటీగా నిలుస్తుంది.
హెక్టర్, హెక్టర్ ప్లస్ SUV మోడళ్లకు ఏప్రిల్ నెల మరింత గ్రాండుగా మారింది. ప్రత్యేకంగా, హెక్టర్ ప్లస్ 6-సీటర్ షార్ప్ ప్రో వేరియంట్ ఎంపికచేసే వారికి, ఏకంగా రూ. 3.92 లక్షల వరకు ఆదా చేసే అవకాశాన్ని MG అందిస్తోంది. అలాగే, హెక్టర్ 5-సీటర్‌పై రూ. 3.73 లక్షల వరకు ప్రయోజనాలు, హెక్టర్ ప్లస్ 7-సీటర్ స్మార్ట్ వేరియంట్ పై రూ. 1.95 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
అలాగే, ఈ SUV లను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా రూ.20,000 లాయల్టీ బోనస్ లభిస్తోంది. కార్పొరేట్ కింద రూ.10,000 నుండి రూ. 15,000 వరకు ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఉంది. అదే సమయంలో వేరియంట్, డీలర్‌షిప్‌ను బట్టి రూ. 10,000 నుండి రూ. 90,000 వరకు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. MG హెక్టర్‌ను పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
పెట్రోల్ వెర్షన్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 141 bhp పవర్. 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో 170 PS పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హెక్టర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది, డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. పై ఆఫర్స్ గురించి దగ్గరలోని షోరూమ్‌లో పూర్తి వివరాలు తెలుసుకోగలరు.


Click it and Unblock the Notifications








