మార్కెట్‎ను దున్నేయడం ఖాయం అనుకున్నారు.. తీరా చూస్తూ కొనే దిక్కేలేదు.. తలపట్టుకున్న ఎంజీ మోటార్స్

ఇండియాలోని కార్ల తయారీదారుల్లో ఎంజీ మోటార్స్ ఓ పాపులర్ కంపెనీ. ఎట్రాక్టివ్ లుక్స్ తో కార్లను తయారు చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ కంపెనీ కూడా ఈ సెగ్మెంట్లో భారీగా పెట్టుబడులు

ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు భారత వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడల్ ఎంజీ విండ్సర్ మోడల్ కు ఇండియాలో డిమాండ్ బాగా పెరిగింది. ఇది ఒక పాపులర్ ఎలక్ట్రిక్ SUV. దీని అద్భుతమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్‌తో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది భారీ సంఖ్యలో అమ్ముడుపోతుంది.

MG Motors Gloster Sales

ఈ మోడల్ లాంచ్ ప్రతి నెల సగటున 3,000 కార్ల సేల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఎంజీ మోటార్స్ ఫిబ్రవరి 2025 నెల అమ్మకాల గణాంకాలను రిలీజ్ చేసింది. ఎంజీ విండ్సర్ ఈవీ 2,000 కంటే ఎక్కువ కార్ల అమ్మకాలతో ముందంజలో ఉంది. అయితే ఎంజీ గ్లోస్టర్ ఎస్ యూవీ మాత్రం తక్కువ విక్రయాలతో అట్టడుగున ఉంది. దీనిని కొనేవాళ్లే లేరు.

ఫిబ్రవరి నెలలో ఈ మోడల్ కేవలం 102 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని ఫలితంగా గ్లోస్టర్ అమ్మకాలు 39శాతం గణనీయమైన వార్షిక తగ్గుదలకు దారితీశాయి. ఎంజీ గ్లోస్టర్ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ కారు లోపల 12.3-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.

MG Motors Gloster Internal

సేఫ్టీ కోసం ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. భారత మార్కెట్లో ఎంజీ గ్లోస్టర్ టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్ వంటి ఎస్యూవీలతో పోటీపడుతుంది. ఎంజీ గ్లోస్టర్ బేసిక్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.57 లక్షలు, టాప్ మోడల్ ధర రూ. ఇది 44.74 లక్షలుగా నిర్ణయించారు.

Take a Poll

ఎంజీ గ్లోస్టర్ రెండు ఇంజన్ ఆఫ్షన్లు అందిస్తుంది. ఒకటి 161bhp పవర్, 373Nm టార్క్‌ అందిస్తుంది. 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. మరొకటి మరింత పవర్ ఫుల్ 2.0-లీటర్ డ్యూయల్-టర్బో డీజిల్ ఇంజన్. ఇది 215bhp పవర్, 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ గ్లోస్టర్ అమ్మకాలు దాని పోటీదారులతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదయ్యాయి.

MG Motors Running

గ్లోస్టర్ లేటెస్ట్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్స్, లగ్జరీ ఎస్ యూవీ పర్ఫామెన్స్ తో కస్టమర్లను ఆకర్షించే విధంగా రూపొందించారు. మార్కెట్ పోటీ లేదా MG విండ్సర్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాల వైపు కస్టమర్లు మారడంతో ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఇది ఫ్యామిలీ కారు. దీనిలో మిగతా కార్లతో పోలిస్తే ఎక్కువ బూట్ స్పేస్ అందించింది కంపెనీ.

ఈ కారు కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనువైనదే అయినప్పటికీ, ధర కొంచెం ఎక్కువే. అమ్మకాలు తక్కువగా ఉండటానికి ఇదే కారణం. ధర తగ్గించడం వల్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. దాని లేటెస్ట్ ఫీచర్స్, పవర్ ఫుల్ ఇంజిన్ కారణంగా రాబోయే నెలల్లో అయినా మార్కెట్లో దాని పోటీదారులను ఎదుర్కొని బలమైన అమ్మకాలను సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 12:30 [IST]
English summary
Mg motors struggling to compete in the market gloster sales fall behind despite premium features
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+