బెడ్‎రూమ్ కంటే సౌకర్యవంతంగా ఉంటుంది.. ఫుల్ ఛార్జ్ చేస్తే 430కి.మీ వెళ్తుంది.. అన్ని కార్లలో దీని రేంజే వేరు

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా మోటార్స్ సృష్టించిన సంచలనానికి మించి ఏదైనా ఉందంటే అది ఎంజీ సొంతం. జెడ్ఎస్, కామెట్, విండ్‌సర్‌ వంటి మోడళ్లతో నిశ్శబ్ద విప్లవం సృష్టించిన ఈ బ్రాండ్ ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. సామాన్యులకు చేరువైన ఈ కంపెనీ ఇకపై కాస్త ప్రీమియం మోడళ్లపై దృష్టి సారించనుంది.

ముఖ్యంగా సినీ తారల్లో బాగా ప్రాచుర్యం పొందిన కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌ వంటి వాటికి పోటీగా ఎంజీ ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ ఎంపీవీని భారతదేశానికి తీసుకువస్తోంది. ఇటీవలే జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఎంజీ ఎం9ఈవీ ఆ మోడలే. ఎంజీ సెలెక్ట్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయించబడే ఎం9అల్ట్రా-లగ్జరీ ఆల్-ఎలక్ట్రిక్ లిమోసిన్ మోడల్‌ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించింది.

MG Starts Bookings for M9

ఈ లగ్జరీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ.51,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఎంజీ సెలెక్ట్ వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఎం9 ఈవీ ధర, విడుదల మార్చిలో ఉంటుందని కంపెనీ గతంలో ప్రకటించినప్పటికీ, ప్రణాళికలు ఆలస్యమయ్యాయి. బుకింగ్‌లు ప్రారంభం కావడంతో అతి త్వరలోనే ఈ అల్ట్రా-లగ్జరీ ఆల్-ఎలక్ట్రిక్ లిమోసిన్ రోడ్లపైకి వస్తుందని భావిస్తున్నారు.

ఎంజీ మోటార్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 65లక్షలు ఉండవచ్చని అంచనా. 5,200ఎంఎం పొడవు, 2,000ఎంఎం వెడల్పు, 1,800ఎంఎం ఎత్తుతో ఎంజీ ఎం9 ఈ విభాగంలో కియా కార్నివాల్, టయోటా వెల్‌ఫైర్‌ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని కోసం 3,200ఎంఎం పొడవైన వీల్‌బేస్‌ను ఈ కారులో ఏర్పాటు చేశారు. దీని వలన కారు లోపల విశాలమైన స్థలం ఉంటుందని చెప్పవచ్చు.

MG Starts

చూడటానికి కూడా ఎం9 ఈవీ ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంది. వెడల్పాటి LED లైట్ బార్, క్రోమ్ డెకరేషన్, నిలువుగా ఉండే టెయిల్ లాంప్‌లు వంటి బాహ్య భాగాలు నిజంగా లగ్జరీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్‌తో కూడిన రూఫ్ స్పాయిలర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇకపోతే ఎం9 అల్ట్రా-లగ్జరీ ఆల్-ఎలక్ట్రిక్ లిమోసిన్‌లోని ఇంటీరియర్ దాని అతిపెద్ద ప్రత్యేకత.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీని 7-సీటర్ లేదా 8-సీటర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. ప్రెసిడెన్షియల్ లిమోసిన్ అని పిలువబడే ఎంజీ ఎం9 ఈవీ లోపలి భాగం ఫస్ట్-క్లాస్ సౌకర్యాలు, అత్యాధునిక ఫీచర్లను అందించే విధంగా రూపొందించబడింది. 16-విధాలుగా సర్దుబాటు చేయగల ప్రెసిడెన్షియల్ సీట్లు, 8 రకాల మసాజ్ మోడ్‌లు, వెంటిలేషన్, హీటింగ్ సిస్టమ్‌లు సీట్లలో అందుబాటులో ఉంటాయి.

MG Starts Bookings

64-రంగుల యాంబియెంట్ లైటింగ్ సిస్టమ్, 12-స్పీకర్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ యాచ్-స్టైల్ పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ రియర్-స్లైడింగ్ డోర్‌లు, రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీలోని ఇతర ముఖ్యమైన ఫీచర్లు. ఇది పెద్ద విలాసవంతమైన వాహనం కాబట్టి సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడలేదు.

లెవెల్ 2 ఏడీఏఎస్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఈ కారును అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఎంజీ ఎం9 ఈవీ 90కిలో వాట్స్ లిథియం బ్యాటరీ ప్యాక్‌తో విపణిలోకి రానుంది. ఇది 245 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్-వీల్-డ్రైవ్ మోటార్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

MG Starts Bookings for M9 Electric

సింగిల్ ఛార్జ్‌పై WLTP ద్వారా ధృవీకరించబడిన 430 కిలోమీటర్ల రేంజ్‌ను ఎంజీ ఎం9 అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 30 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ లిమోసిన్ కారు కావడంతో దీని విడుదల అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినీ తారలు, పెద్ద వ్యాపారవేత్తలు ఎం9 ఈవీని కొనుగోలు చేయడానికి వస్తారని కంపెనీ ఆశిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 6, 2025, 16:02 [IST]
English summary
Mg starts bookings for m9 electric limousine with 430 km range more comfortable than a bedroom
Read more on: #mg motors #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+