గత కొన్ని నెలలుగా ఈ కారును అందరు తెగ కొంటున్నారు.. మరి అంత స్పెషల్ దీనిలో ఏముందో!

భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లేని సానుకూలతలు భారత్‌లో ఉండటం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు మన దగ్గరే ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. భారత్ ఈవీ భవిష్యత్తుకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా గత ఏడాది అమ్మకాలను చూసినట్లయితే గతంలో కంటే కూడా 2024లో ఈవీ సెగ్మెంట్‌లో అన్ని వాహనాల విక్రయాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త మోడళ్ల రాక ఎక్కువ అయింది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటా పోటీగా అధునాతన కార్లను లాంచ్ చేస్తూ తమ మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దారు అయిన ఎంజీ (MG) కూడా ఈవీలను విడుదల చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది. గతంలో తీసుకొచ్చిన విండ్సర్ (windsor) అమ్మకాల పరంగా దుమ్ములేపుతుంది.

ఇటీవల ఆటోమొబైల్ తయారీదారులు వరుసగా తమ మోడళ్ల వారీగా అమ్మకాల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఎంజీ మోటార్స్ ఇండియా తన విండ్సర్ సేల్స్ వివరాలను వెల్లడించింది. ఈ డేటా ప్రకారం, 2025 జనవరి నెలలో ఈ కారును 3,277 మంది కొనుగోలు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గత నాలుగు నెలలుగా కూడా ఈ సేల్స్ దాదాపు 2 వేలకు పైనే నమోదు అవుతున్నాయి.

MG Windsor Continues To Register Sales Over 3000 Units

అంతకుముందు 2024 డిసెంబర్ నెలలో ఎంజీ విండ్సర్ 3,785 సేల్స్ యూనిట్లను నమోదు చేసింది. దానికి ముందు నవంబర్‌లో 3,144 యూనిట్లగా ఉన్నాయి. ఇక అక్టోబర్ నెలలో 3,116 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ప్రతినెలా జరుగుతున్న అమ్మకాలను చూసినట్లయితే ఎంజీ విండ్సర్‌కు భారతీయ వినియోగదారుల్లో ఎంత ఆదరణ ఉందో తెలిసిపోతుంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్ కారణంగా అమ్మకాల్లో అంచనాలకు అనుగుణంగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం MG విండ్సర్ మూడు వేరియంట్లలో ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇది బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కింద కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే, MG విండ్సర్ ఎక్సైట్ వేరియంట్ ధర రూ.13,99,800, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.14,99,800, ఎసెన్స్ వేరియంట్ ధర వచ్చేసి 15,99,800. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు.

MG Windsor Sales Details

బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే కారు ధర చాలా వరకు తగ్గుతుంది. సెపరేట్‌గా బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సైట్ వేరియంట్ ధర దాదాపు రూ.9.99 లక్షల వరకు, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.10.99 లక్షల వరకు, సెన్స్ వేరియంట్ ధర రూ.11.99 లక్షల వరకు ఉంది. అదే బ్యాటరీ అద్దె కిమీకు రూ.3.9 వరకు అవుతుంది.

MG విండ్సర్ 38kWh బ్యాటరీ ప్యాక్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనిలొ అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 136 PS పవర్, 200Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 332 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇక కారు ఫీచర్స్ విషయానికి వస్తే, వినియోగదారులకు అవసరమైన అన్ని కూడా దీని లోపల ఉన్నాయి.

MG Windsor Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2025, 17:29 [IST]
English summary
Mg windsor continues to register sales of over 3000 units since last 4 months
Read more on: #mg motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+