ఈ కారును ప్రతి గంటకు 5 మంది కొన్నారు! 400 రోజుల్లో 50 వేల మంది సొంతం చేసుకున్నారు

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో టాటా మోటార్స్ ఒక్కదాని ఆధిపత్యం నడిపితే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా రంగంలోకి వచ్చిన కంపెనీలు, ముఖ్యంగా JSW MG మోటార్ ఇండియా, కేవలం ఒకే మోడల్‌తో మార్కెట్‌ వ్యవస్థనే తారుమారు చేస్తున్నాయి. ఆ మోడల్‌ మరెవరో కాదు... ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా EV కొనుగోలుదారుల మనసుల్ని గెలుచుకున్న MG విండ్సర్ EV. ఇండియన్ మార్కెట్‌లో EV సెగ్మెంట్‌ను రీడిఫైన్ చేసిన ఈ క్రాస్‌ఓవర్ యుటిలిటీ వాహనం అమ్మకాల విషయంలో నిజంగా కొత్త చరిత్ర రాసింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లు అమ్ముడవడం భారతీయ ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో అరుదైన ఘనత సాధించింది.

MG మోటార్ ఇండియా పత్రికా ప్రకటనలో వెల్లడించిన మరో ఆసక్తికరమైన వివరమేమిటంటే దేశంలో ప్రతి గంటకూ సుమారు ఐదు విండ్సర్ EVలు అమ్ముడవుతున్నాయి. అంటే రోజంతా, గంట గంటకూ ఈ కారు కోసం షోరూమ్‌లలో కొనుగోలుదారుల రద్దీ కొనసాగింది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ఈ విజయాన్ని MG సాధించింది కేవలం ఒకే మోడల్‌తో. విండ్సర్ EV క్వాలిటీ, ఫీచర్లు, రేంజ్, ధర ఈ నాలుగు అంశాల కలయిక ఒక మేజిక్‌లా పనిచేసింది.

Mg Windsor Ev Hits 50000 Sales Milestone In 400 Days

టాటా మోటార్స్ అనేక ఎలక్ట్రిక్ వేరియంట్లతో ముందుకు సాగుతుండగా, MG మాత్రం విండ్సర్ EV మీద దృష్టి సారించి మార్కెట్‌ షేర్‌ను దాదాపు రెండో స్థానానికి తీసుకువచ్చింది. వాహనం కేవలం గణాంకాల్లోనే కాదు, వినియోగదారుల అభిరుచుల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ మోడల్ సృష్టించిన రికార్డు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. EV ప్రపంచంలో టాటా తర్వాత MG స్థానాన్ని దృఢంగా ఆక్రమించడానికి విండ్సర్ EV కీలక పాత్ర పోషించింది.

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్‌ను రెండు విభిన్న బ్యాటరీ ఆప్షన్లలో అందిస్తోంది. విండ్సర్ ప్రో EVలో ఉన్న 52.9 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ దీన్ని మరింత ప్రీమియం క్యాటగిరీలో నిలబెడుతోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇది 449 కి.మీ వరకు ప్రయాణించే రేంజ్‌‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్, ఏదైనా కావొచ్చు, ఈ రేంజ్ వినియోగదారులకు పూర్తి నమ్మకాన్ని ఇస్తుంది.

Mg Windsor Ev Hits 50000 Sales Milestone In 400 Days

60 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 20% నుంచి 80% వరకు కేవలం 50 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి అవ్వడం వలన లాంగ్ డ్రైవ్‌లో కూడా ఛార్జింగ్‌పై ఆందోళన తగ్గిపోతుంది. ఈ వెర్షన్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 136 PS పవర్, 200 Nm టార్క్‌ను అందిస్తూ స్మూత్ డ్రైవ్ అనుభవాన్ని ఇస్తుంది. నగర రోడ్లపై వేగంగా కదిలే ట్రాఫిక్‌లోనూ, హైవేపై స్టెబుల్ పెర్ఫార్మెన్స్‌లోనూ ఇది సౌకర్యవంతంగా పనిచేస్తుంది.

ఇక ప్రామాణిక విండ్సర్ EV గురించి మాట్లాడితే, ఇది 38 kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ 330 కి.మీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారుల రోజువారీ ప్రయాణ అవసరాలకు బెస్ట్. మరోవైపు ధర పరంగా చూసినా ఈ వెర్షన్ మరింత అందుబాటులో ఉంటుంది. MG విండ్సర్ EV ధరలు కూడా విజయానికి పెద్ద కారణం. ఎక్స్-షోరూమ్ ధరలు రూ.12.6 లక్షల నుండి రూ.18.39 లక్షల మధ్య ఉంది.

Mg Windsor Ev Hits 50000 Sales Milestone In 400 Days

అయితే MG అందిస్తున్న మరో ప్రత్యేక ప్రయోజనం Battery as a Service (BaaS) ఆప్షన్. దీన్ని ఎంచుకుంటే వాహన ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు తగ్గిపోతుంది. బ్యాటరీని వేరుగా సభ్యత్వంగా తీసుకునే ఈ మోడల్, మొదటి పెట్టుబడిని తగ్గించుకోవాలనుకునే వినియోగదారులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.

More from DriveSpark

Article Published On: Thursday, November 20, 2025, 11:26 [IST]
English summary
Mg windsor ev hits 50000 sales milestone in 400 days more details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+