ఇండియా బెస్ట్ సెల్లింగ్ కారు.. ఒకేసారి రెండు సార్లు ధర పెంచిన కంపెనీ.. కొత్తగా ఎంత పెరిగిందంటే ?
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాడకం బాగా పెరిగింది. టాటా, ఎంజీ, హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు తమ కొత్తకొత్త ఈవీలను నిరంతరం మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏదైనా ఉందంటే, అది ఎంజీ విండ్‌సర్ ఈవీ. ఈ కారు ఇప్పుడు చాలామందికి ఒక కల. అయితే, ఈ కారు కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. దీని ధర మళ్లీ పెరిగింది.
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మ్యాట్రో తమ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు అయిన విండ్‌సర్ ఈవీ ధరను మళ్లీ పెంచింది. జూలై నెలలో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎసెన్స్ ప్రో ధర రూ. 21,200 పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు ధరను పెంచారు. అయితే, బేస్ మోడల్, మిడ్ వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు.

కొత్త ధరల పెంపు నేపథ్యంలో.. ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ధరను రూ. 10,000 పెంచారు. పాత ధర రూ. 15.04 లక్షలు ఉండగా, కొత్త ధర రూ. 15.14 లక్షలు. ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎసెన్స్ వేరియంట్‌పై రూ. 15,000 పెరిగింది. పాత ధర రూ. 16.14 లక్షలు ఉండగా, కొత్త ధర రూ. 16.29 లక్షలు.
ఎంజీ విండ్‌సర్ ఈవీ ఎసెన్స్ ప్రో వేరియంట్‌పై రూ. 8,000 పెరిగింది. పాత ధర రూ. 18.31 లక్షలు ఉండగా, కొత్త ధర రూ. 18.39 లక్షలు. ఈ పెంపు తర్వాత, ఎంజీ విండ్‌సర్ ఈవీ ప్రారంభ ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 18.39 లక్షల వరకు ఉంది.

ధర పెరిగినా, కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఒకటి 38kWh, మరొకటి పెద్ద 52.9kWh బ్యాటరీ ప్యాక్. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 332 కి.మీ, 449 కి.మీ రేంజ్ ఇస్తాయి.
ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లను సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌కు జత చేశారు. ఇది 134bhp పవర్, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఛార్జింగ్ కోసం 7.4kWh ఏసీ ఛార్జర్‌ను అందిస్తున్నారు. దీనితో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు 9.5గంటలు పడుతుంది. అయితే, ప్రో వేరియంట్‌లో 60kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది, దీని ద్వారా కేవలం 50నిమిషాల్లో 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఎంజీ విండ్‌సర్ ఈవీలో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.
సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. ఇందులో ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు భద్రతను మరింత పెంచుతాయి.


Click it and Unblock the Notifications








