రోజూ విమానంలో పోతున్న ఎక్స్ పీరియన్స్ కావాలంటే.. ఈ కారును వెంటనే కొనేయండి...ధర కూడా చాలా తక్కువ
విమానంలో ప్రయాణిస్తున్న ఎక్స్పీరియన్స్ ప్రతి రోజూ కావాలంటే కేవలం రూ. 9.99 లక్షలు ఖర్చు చేస్తే సరిపోతుంది. అలాంటి అన్ని ఫీచర్స్ ఉన్న ఎంజీ విండ్‌సర్ ఈవీని ఈ రోజే ఇంటికి తెచ్చుకోండి. అందుకే విడుదలైన కేవలం ఆరు నెలల్లోనే 20,000 యూనిట్ల రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న ఈ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే కారు విండ్‌సర్ ఈవీ (MG Windsor EV). రోడ్డుపై ఈ కారు వెళ్తుంటే కళ్లు అప్పగించి చూడని వారుండరు. ఎంజీ హెక్టర్ SUVతో మనదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంజీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఇంతకుముందు విడుదల చేసిన ZS ఈవీ విజయాన్ని కొనసాగిస్తూ, కామెట్ అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ వాహన రంగంలో కంపెనీ మరింత దూకుడును ప్రదర్శించింది. అద్భుతమైన సిటీ కారుగా పేరు తెచ్చుకున్న కామెట్ EV వేగంగా అమ్ముడవుతోంది. భారతదేశంలో అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
ఈ కారుతో పాటు, విండ్‌సర్ ఈవీని కూడా విడుదల చేసి ఎంజీ మోటార్స్, టాటా మోటార్స్‌ను సైతం అధిగమించి ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో ఒక కీలక శక్తిగా ఎదిగింది. తాజాగా, దేశంలోనే మొట్టమొదటి క్రాస్‌ఓవర్ యుటిలిటీ ఎలక్ట్రిక్ వాహనం అమ్మకాల్లో కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది.

కేవలం 6 నెలల్లోనే భారతీయ మార్కెట్‌లో ఎంజీ విండ్‌సర్ ఈవీ 20,000 యూనిట్ల అమ్మకాలను దాటి రికార్డు సృష్టించింది. ఈ మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా ఎంజీ ఈ ఎస్యూవీ రికార్డు నెలకొల్పింది. ఈ కారును కొనుగోలు చేసే మొదటి యజమానికి బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీని, రెండవ యజమానికి 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది.
విమానంలో ప్రయాణిస్తున్నంత సౌకర్యవంతమైన అనుభూతిని విండ్‌సర్ ఈవీ అందించడం కూడా దీని విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇవన్నీ అందుబాటు ధరలో లభిస్తుండటం విశేషం. ఎంజీ ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.13.50 లక్షల నుండి రూ. 15.50 లక్షల వరకు ఉంది.

ఇక బ్యాటరీని అద్దెకు తీసుకునే (BaaS - Battery as a Service) విధానాన్ని ఎంచుకుంటే కారు ధర రూ.9.99 లక్షలకు తగ్గుతుంది. అలాంటప్పుడు, నడిచే ప్రతి కిలోమీటరుకు రూ.3.50 చొప్పున కంపెనీకి అద్దె చెల్లిస్తే సరిపోతుంది.
వేరియంట్ల వారీగా ధరలు పరిశీలిస్తే, ఎక్స్‌సైట్ వేరియంట్ ధర రూ.13,99,800, ఎక్స్‌క్లూసివ్ వేరియంట్ ధర రూ.14,99,800, టాప్ ఎసెన్స్ వేరియంట్ ధర రూ.15,99,800గా ఉంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే విండ్‌సర్ ఈవీ 134 bhp శక్తిని, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందిస్తుంది. అయితే, రియల్ వరల్డ్‌లో ఇది సుమారు 260 నుండి 280 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో 45kW DC ఛార్జర్ ద్వారా 55 నిమిషాల్లో 10-80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
ఎంజీ విండ్‌సర్ ఈవీతో పాటు స్టాండర్డ్‌గా పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది. అయితే, కంపెనీ వాల్ బాక్స్ ఛార్జర్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ వాహనమైన విండ్‌సర్ ఈవీ పెద్ద హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపించినప్పటికీ, ఇది ఎంపీవీ మాదిరి లుక్ అందిస్తుంది.

15-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 9 స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
సేఫ్టీ విషయానికి వస్తే, ఎంజీ విండ్‌సర్ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

విండ్‌సర్ ఈవీ విజయాన్ని కొనసాగిస్తూ.. కంపెనీ మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఎంజీ త్వరలో తమ 'ఎంజీ సెలెక్ట్' ప్రీమియం రిటైల్ అవుట్‌లెట్ ద్వారా రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఎంజీ సైబర్‌స్టర్ టు-డోర్ డ్రాప్‌టాప్ స్పోర్ట్స్ కారు, ఎంజీ ఎం9 ప్రీమియం ఎంపీవీ త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
కొత్త ఎంజీ సెలెక్ట్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఎంజీ అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా వినియోగదారులు ఈ మోడళ్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందరి దృష్టి ఎంజీ సైబర్‌స్టర్ టూ-సీటర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారుపై ఉంది. ఎంజీ ఈ కొత్త ఈవీ ఇటీవల ఆసియాలోనే అత్యంత వేగవంతమైన కారుగా నిలిచింది.
కొత్త ఎంజీ సైబర్‌స్టర్ 528 bhp శక్తిని, 725 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 77 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 570 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.
ట్రిపుల్ స్క్రీన్ సెటప్, ఎలక్ట్రికల్‌గా పనిచేసే, క్లోజ్ డ్ రూఫ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఆరు విధాలుగా ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేయగల హీటెడ్ సీట్లు, 8 స్పీకర్‌లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్ ఎంజీ సైబర్‌స్టర్‌లోని ఇతర ముఖ్యమైన ఫీచర్లు. సేఫ్టీని ఇంకా మెరుగుపరచడానికి లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) సూట్ కూడా ఈ కారులో ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








